Home
News

షియోమి ఎంఐయుఐ7 ఫీచర్స్ ఇవే...

By Hazarath

చైనా మొబైల్స్‌ కంపెనీ షియోమి.. ఆండ్రాయిడ్‌ ఆధారంగా పని చేసే అప్‌గ్రేడెడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఎంఐయుఐ7ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను చాలా మెరుగు పరిచామని, కస్టమైజేషన్‌కు ఎక్కువగా అవకాశం ఉంటుందని షియోమి గ్లోబల్‌ విపి హ్యుగో బర్రా తెలిపారు. ఎంఐయుఐ7ను సృష్టించేందుకు ఎంఐయుఐలో చాలా కాలంపాటు మార్పులు చేర్పులు చేసినట్టు ఆయన చెప్పారు. రంగులతో ఇంటర్‌పస్త్రస్‌, అద్భుతమైన పనితీరు, బ్యాటరీ సేవింగ్‌, పర్సనలైజేషన్‌ ఆప్షన్లు ఇందు లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఎంఐఒఐని 15 కోట్లకు పైగా యూజర్లు వినియోగిస్తున్నారని చెప్పారు. ఎంఐయుఐ7 ఈ నెల 24వ తేదీ నుంచి దేశం లో విక్రయించే కొత్త స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఇందులో మేడ్‌ ఫర్‌ ఇండియా ఫీచర్లు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విజువల్‌ ఐవిఆర్‌, స్మార్ట్‌ ఎస్‌ఎంఎస్‌ ఫిల్టర్‌ వంటివి ఇందులో ప్రధానమైనవని ఆయన తెలిపారు. ఎంఐయుఐ7 10 ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం

Read more : విండోస్ 10.. ఐదు బెస్ట్, వరస్ట్ ఫీచర్లు

1.ఫోర్ సిస్టమ్ డిజైన్స్

1.ఫోర్ సిస్టమ్ డిజైన్స్

షియోమి తన అప్ గ్రేడ్ సిస్టమ్ లో నాలుగు రకాల ఇంటర్ ఫేస్ లను రిలీజ్ చేసింది. అవి రోజ్,పింక్ బ్లష్,ఓషియన్ బ్రీజ్,హై లైఫ్.. మీకు ఏది కావాలో అది సెలక్ట్ చేసుకోవచ్చు.

2.ఫాస్టర్ రెస్పాన్స్ టైమ్

2.ఫాస్టర్ రెస్పాన్స్ టైమ్

ఎంఐయుఐ7 ఆపరేటింగ్ సిస్టంలో లోడింగ్ డాటా ఎంఐయుఐ6 కన్నా చాలా ఫాస్ట్ అవుతుంది. ఎంఐయుఐ6 కన్నా 30 శాతం పాస్ట్ గా ఫైల్ ను తీసుకుంటుంది.

3. బెటర్ బ్యాటరీ ఫెర్ఫార్మెన్స్

3. బెటర్ బ్యాటరీ ఫెర్ఫార్మెన్స్

రోజు వాడకంలో 10 శాతం బ్యాటరీని తీసుకుంటుంది. షియోమి ఇంతకుముందు వాటిలో యాప్స్ కి దాదాపు 48 శాతం వాడకం తీసుకునేది. ఇప్పుడు లేటెస్ ఆపరేటింగ్ సిస్టంలో 25 శాతం మాత్రమే తీసుకుంటుంది.

4.షో టైమ్

4.షో టైమ్

మీ కాంటాక్ట్ కు షార్ట్ వీడియోని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆ పర్సన్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు 5 సెకండ్ల వీడియో మీకు హోమ్ స్కీన్ మీద కనిపిస్తుంది. అది నార్మల్ రింగ్ టోన్ లాగా వస్తుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో లేదు. త్వరలో అందుబాటులోకి వస్తుంది.

5.చైల్డ్ మోడ్

5.చైల్డ్ మోడ్

మీరు మీ ఈ మెయిల్స్ ని అలాగే మేసేజ్ ని భద్రపరుచుకోవాలంటే సెట్టింగ్ మెనూలోకెళ్లి ఈ ఆప్సన్ సెలక్ట్ చేసుకుంటే చాలు. అవి సేఫ్ గా ఉంటాయి. ఎవరికి కనబడవు.

6.విజువల్ ఐఆర్

6.విజువల్ ఐఆర్

ఇండియన్ ఆడియన్స్ కోసం విజువల్ ఐఆర్ ను షియోమి రూపొందించింది. ఈ రోమ్ అన్ని భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ తో బ్యాకింగ్,బుకింగ్,టికెట్స్ ఇంకా ఎన్నో రకాల వాటికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు.

7. ఎక్స్ఎక్స్ఎల్ టెక్స్ట్

7. ఎక్స్ఎక్స్ఎల్ టెక్స్ట్

మీకు ఫాంట్ వివిధ రకాల సైజుల్లో లభిస్తుంది. కన్వర్షన్ కూడా చాలా సింపుల్ గా అవుతుంది.

8 డాటా సేవర్

8 డాటా సేవర్

ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో స్మార్ట్ డాటా సేవర్ ని ప్రవేశపెట్టారు. స్మార్ట యాప్ ల ను బ్రౌజ్ చేస్తూనే 50 శాతం డాటాను సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అన్ని దేశాల్లో సెప్టెంబర్ లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

9.డిఎన్ డి ఫీచర్

9.డిఎన్ డి ఫీచర్

ఇది ఆటోమేటిగ్గా మీ ఫోన్ ను స్లీప్ లోకి తీసుకువెళుతుంది.ఒకవేళ మీరు మరచిపోయినా కాని దాని పాటికదే డిఎన్ డి మోడ్ లోకి వెళ్లిపోతుంది.

10.ఎసెమ్మెస్ పిల్టర్

10.ఎసెమ్మెస్ పిల్టర్

ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆసక్తికరమైన మెసేజ్ పిల్టర్ లు ఉన్నాయి. ఈ మెసేజ్ లు సేవ్ లో లేని నంబర్లకు కూడా పోయేలా డిజైన్ చేశారు. ఓటీపీ పాస్ వర్డ్ కి సంబంధించిన పాప్ అప్ డైరెక్ట్ గా టాప్ మీదనే తీసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
iaomi just unveiled the global developer version of the MIUI 7 in India. The beta version will launch on Monday with support for smartphones like Redmi 2, Redmi 1S, Mi 3, Mi 4, Mi 4i, Redmi Note 3G and Redmi Note 4G.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X