అందరికీ ఆదర్శం ఈ సీఈఓలు

Written By:

టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించడంలో వారి పాత్ర చాలా అమోఘం..వారి రాకతో కంపెనీ లాభాల బాటలో పరుగులు పెట్టింది..వారే కంపెనీకి సీఈఓలు..వీరే కంపెనీని లాభాల బాట పట్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. వారు తీసుకునే నిర్ణయాల మీదనే కంపెనీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది..వారి నిర్ణయాల్లో ఏ మాత్రం తేడా జరిగినా కంపెనీ దివాళా తీయడం ఖాయం.అటువంటి వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసకుంటుంటారు. వారి లాగే విజయాలను సాధించాలని కోరుకుంటుంటారు..అందరికీ ఆదర్శంగా నిలిస్తున్న ఆ సీఈఓలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : ఇక్కడ సెల్ఫీ దిగితే అదిరిపోవాల్సిందే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పీటే కాష్ మోర్.. మాషబుల్

పీటే కాష్ మోర్ మాషబుల్ సీఈఓ.ఇది ఓ బ్లాగ్ డిజిటల్.కాని ఓ సోషల్ మీడియా వేదికగా ఓ విప్లవాన్నే సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది దీనికి ప్రభావితం అయి ఉన్నారు. తన అభిప్రాయాలను ఇప్పుడు ఛానల్ ద్వారా పంచుకుంటున్నారు.

టీమ్ కుక్..యాపిల్

యాపిల్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. యాపిల్ ను పరుగులు పెట్టించడంలో టీమ్ కుక్ దే ప్రధాన పాత్ర.. అంతే కాకుండా తన యావదాస్తిని దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తానని తెలిపారు. దాదాపు 4700 కోట్ల రూపాయలు ఉంటుంది. తనకు తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

రోమెట్టి...ఐబీఎమ్

ఐబీఎమ్ సీఈఓ. 1991లో ఐబీఎమ్ లో జాయినయిన రోమెట్టి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరుకున్నారు. అంతే కాకుంగా ఫస్ట్ సీఈఓ కూడా ఈమెనే. అంతేకాకుండా ప్రపంచప్రఖ్యాతిగాంచిన స్కూల్స్ నడపడంలో కూడా కీలక ప్రాత పోషిస్తున్నారు.

టీమ్ ఆర్మ్ స్ట్రాంగ్.. ఏఓఎల్

ఏఓఎల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన టీమ్ ఆ కంపెనీనీ పరుగులు పెట్టించడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు గూగుల్ ఆపరేషన్స్ లో యుఎస్ లో ఈ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.

లారా పేజ్.. గూగుల్

గూగుల్ స్థాపకుల్లో ఒకరు..అంతే కాకుండా గూగుల్ కంపెనీకి సీఈఓ.ఇప్పుడు ప్రపంచంలోనే సెర్చ్ ఇంజిన్ లో మేటిగా నిలపడంలో ఈయనే కీలకం

స్టీవ్ బాల్ మర్... మైక్రోసాఫ్ట్

1980లో మైక్రోసాఫ్ట్ లో జాయినయిన సీవ్ బాలమర్ అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని టెక్ కంపెనీలో మేటి కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఉందంటే అందులో ఈయన పాత్రే చాలా కీలకం.

జెఫ్ బిజోస్.. అమెజాన్

అమెజాన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించక ముందు జెఫ్ బిజోస్ న్యూయార్క్ సీటీలో ఉన్నప్పుడు చిన్న జాబ్ చేస్తుండే వాడు. దాన్ని వదిలి సొంతంగా ఏదైనా చేయాలనే పట్టుదలతో అమెజాన్ కంపెనీనీ స్థాపించాడు. నేడు అది విశ్వ వ్యాప్తమయింది. కోట్లకు పడగలెత్తింది.

జెఫ్ వైనర్...లింక్ డన్

లింక్ డన్ సీఈఓ..చిన్న కంపెనీగా ప్రారంభమైన లింక్ డన్ అనతి కాలంలోనే సంచలనాలు నమోదు చేసిందంటే దానికి కారణం ఆ కంపెనీ అధినేత పట్టుదలే..ఎన్నో కష్టాలనష్టాల కోర్చి కంపెనీని ఈ స్థాయికి తీసుకువచ్చారు.

యిషాన్ వాంగ్.. రెడిట్

రెడిట్ సీఈఓ షిషాన్ వాంగ్ కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఒబామా చేత శభాష్ అనిపించుకున్న వ్యక్తి

శ్రేయాల్ శాండ్ బర్గ్

ఫేస్ బుక్ సీఈఓ..ఫేస్ బుక్ ని విశ్వవ్యాప్తం చేయడంలో ఈమెది కూడా కీలక ప్రాతేనని చెప్పాలి. మార్క్ జుకర్ బర్గ్ శ్రేయాల్ ఐడియాలను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అన్నట్లుగా ఉంటాయి ఈమె ఐడియాలు

జాక్ డార్సే ... ట్విట్టర్

ట్విట్టర్ సీఈఓ..ట్విట్టర్ ను బయటి ప్రపంచానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అది నేడు సెలబ్రిటీలకు వేదికగా మారింది.

జాక్ డార్సే ... ట్విట్టర్

ట్విట్టర్ సీఈఓ..ట్విట్టర్ ను బయటి ప్రపంచానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అది నేడు సెలబ్రిటీలకు వేదికగా మారింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Top 10 Most Inspirational CEOs of Tech World
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot