ఇక్కడ సెల్ఫీ దిగితే అదిరిపోవాల్సిందే

Written By:

సెల్ఫీ.. ఈ రోజుల్లో అది లేనిదే పూట గడవదంటే నమ్మాలి. స్మార్ట్ ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ సెల్పీ దిగనిదే నిద్రపోరు.అంతలా మన జీవితంలో సెల్ఫీ భాగమైపోయింది. మరి సెల్పీ ఎలాంటి చోట దిగాలి..ఎక్కడ దిగితే సెల్ఫీ అదిరిపోతుంది..ఇలాంటి ఎన్నో సందేహాలు మనల్ని వెంటాడుతుంటాయి కదా...అదీగాక దిగిన సెల్ఫీలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి ఎన్ని లైకులు వస్తాయో చూడాలి కదా...అందుకని మీకు ప్రపంచంలో ఏ ప్లేస్ లో సెల్పీ దిగితే అదిరిపోతుందో అక్కడ ఎంతమంది సెల్ఫీలు దిగారో లిస్ట్ ఇస్తున్నాం. ఓసారి చూసేయండి.

Read more : పదేళ్ల రహస్యాన్ని చేధించిన గూగుల్ మ్యాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈఫిల్ టవర్

సెల్ఫీలు దిగాలంటే ఈపిల్ టవర్ దగ్గరకు పోవాల్సిందే..ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ దానిదే.219 మిలియన్లకు పైన ఈఫిల్ టవర్ ఇమేజ్ లను సెల్ఫీల కోసం బ్యాక్ గ్రౌండ్ లో వాడుతుంటారని సర్వే తెలియజేస్తుంది. ప్రతిరోజు మిలియన్ కు పైగానే అక్కడ సెల్ఫీలు దిగుతారని అంచనా అయితే అధికారికంగా 10,700 సెల్ఫీలు దిగారు.

డిస్నీ వరల్డ్ ఫ్లోరిడా

సెల్ఫీలు దిగే అత్యంత సుందరమైన నగరాల్లో డిస్నీ వరల్డ్ ఫ్లోరిగా 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటిదాకా దిగిన సెల్ఫీలు 9,870

బుర్జ్ ఖలీపా దుబాయ్

ఆకాశ హర్మాలను తాకే ఈ బిల్డింగ్ ల దగ్గర నిలబడి ఒక్కసారైనా సెల్ఫీ దిగాలనుకునేవారు చాలామందే ఉంటారు. ఇప్పటిదాకా ఇక్కడ 8,860 మంది సెల్ఫీలు దిగారు

బిగ్ బెన్ లండన్

లండన్ లో అత్యంత ప్రకాశవంతమైన వాటిల్లో ఇది ఒకటి. సెల్ఫీ ఇక్కడ నుంచి దిగితే మీకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ వస్తుంది. ఇప్పటిదాకా 8,780 మంది సెల్ఫీలు దిగారు

న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

1250 అడుగుల ఎత్తులో ఉండే ఈ బిల్డింగ్ సెల్ఫీలు దిగే స్థానాల్లో అయిదవ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటివరకు దిగిన సెల్ఫీలు 8,430

బార్సిలోనియాలోని సాగ్రడ ఫామిల్లా

ఇది ఇంకా పూర్తి కాలేదు. కాని ఇక్కడ సెల్పీలు దిగితే బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయే లుక్ తో వస్తుంది.ఇప్పటివరకు దిగిన సెల్ఫీలు 4,790

డిస్నీల్యాండ్ ప్యారీస్

కార్టూన్ క్యారెక్టర్లతో హోరెత్తిస్తున్న డిస్నీల్యాండ్ లో ఫోటో దిగాలని అందరూ తహతహలాడతారు కూడా. ఇక్కడ ఇప్పటివరకు దాదాపు 4,740 మంది సెల్ఫీలు దిగారు

కోలోస్సేమ్ రోమ్

రోమ్ లోని పురాతన భవనాల్లో ఇది ఒకటి, ఇక్కడ నుంచి దాదాపు 4,670 మంది సెల్ఫీలు దిగారు

టాప్ ఆప్ ది రాక్ న్యూయార్క్

ఇక్కడ కూడా సెల్పీలు దిగితే అదిరిపోతుంది. ఇక్కడ ఇప్పటివరకు దాదాపు 4,290 మంది సెల్ఫీలు దిగారు

టవర్ బ్రిడ్జి లండన్

సెల్ఫీలు దిగాలంటే లండన్ లోని టవర్ బ్రడ్జి తరువాతే ఏదైనా...ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు 3820 మంది సెల్ఫీలు దిగారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10 places to take a selfie
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot