‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

Posted By:

ధరల పెరుగుదలతో పాటు అష్ట కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్య, మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం అనేక ప్రణాళికలతో పాటు స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. అవి ఎంత వరకు అమలవుతున్నాయ్..? అన్న విషయాన్ని పక్కన పెడితే. ప్రముఖ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్లు ప్రజల అవసరాలను సౌకర్యవంతంగా తీర్చే పలు స్మార్ట్ అప్లికేషన్‌లను వృద్ధి చేశారు. వీటిని మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల‌లో డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా మీ దైనందిన జీవితం చురుకైన రీతిలో సాగిపోతుంది. వీటిని గూగుల్ ప్లేస్టోర్ ద్వారా
డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ల పూర్తి వివరానలు క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మొదలెట్టండి.. చూస్తూనే ఉంటారు!

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

కొద్దిపాటి రక్షణాత్మకమైన చర్యలతో మీరూ.. మీ కంప్యూటర్ ఆనందంగా ఉండొచ్చు. కంప్యూటర్‌లోకి యూఎస్బీ డ్రైవ్స్, సీడీ లేదా డీవీడీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి యాక్సిస్ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. మీ పీసీలో ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌లతో పాటు సరి అయిన యాంటీవైరస్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

మొబిక్‌విక్ (Mobikwik):

ఈ అప్లికేషన్‌ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్ స్టాల్ చేసుకోవటం ద్వారా ఎలక్ట్రసిటీ, వాటర్ బిల్, భీమా చెల్లింపు, గ్యాస్ బిల్ ఇలా అనేక ఆర్ధిక లావాదేవీలను సురక్షిత ఇంకా సౌకర్యవంతమైన విధానం ద్వారా నెరపవచ్చు. చెల్లింపులో భాగంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలను మొబిక్‌విక్ అప్లికేషన్ కల్పిస్తుంది. లింక్ అడ్రస్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

గ్యాస్‌వాలా (GasWala HP Gas):

ఎల్‌పిజి సిలిండర్ల వినియోగం విషయంలో ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన విధానం ప్రజానీకాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై పున:సమీక్షించిన ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపునాటికి 5 ఎల్‌పీజీ సిలిండర్ల ఉపయోగించుకోవచ్చని తెలిపింది. హెచ్‌పి వినియోగదారులు కోసంగ్యాస్‌వాలా పేరతో ఓ ప్రత్యేక పోర్టల్ రూపుదిద్దుకుంది. హెచ్‌పి వినియోగదారు ఈ పోర్టల్ అప్లికేషన్‌ను తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఈ ఏడాది గ్యాస్ వాడకానికి సంబంధించిన వివరాలను పూర్తి విశ్లేషణతో తెలసుకోవచ్చు. లింక్ అడ్రస్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

మొబైల్ నెంబర్ ట్రాకర్ (Mobile Number Tracker):

ఈ అప్లికేషన్ సాయంతో గుర్తుతెలియని మొబైల్ నెంబర్ల ఆచూకి తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

హిందూ క్యాలెండర్ (Hindu Calendar):

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ ఈ అప్లికేషన్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తిథి, శుక్ల, వారా, నక్షత్రాలతో కూడిన దిన దిన పంచాంగాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రముఖ హిందూ పండుగలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

మేక్‌మై ట్రిప్ (MakeMyTrip):

యూజర్ ఈ అప్లికేషన్ తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆకర్షణీయ రాయితీలలో ప్రయాణ టికెట్‌లతో పాటు హోటల్ రూమ్‌లను బుక్ చేసుకోవచ్చు. సురక్షితమైన చెల్లింపు వ్యవస్థను ఈ యాప్‌లో ఏర్పాటు చేసారు. డౌన్‌లోడ్ లింక్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

ఇండియన్ రైల్ ఇన్ఫో (Indian Rail Info):

యూజర్ ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా రైళ్ల రాకపోకలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు పీఎన్ఆర్ స్టేటస్ ఇంకా సీటు అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. లింక్ అడ్రస్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

ఫైనాన్షియల్ కాలుక్యులేటర్ (Financial Calculator):

కరెన్సీ కన్వర్టర్, టిప్ కాలుక్యులేటర్, క్రెడిట్ కార్డ్‌పే ఆఫ్ కాలుక్యులేటర్, ఐఆర్ఆర్ ఎన్‌పీవీ కాలుక్యులేటర్ తదితర ఫీచర్లు ఈ ఆర్థికపరమైన గణన యంత్రంలో ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఇంకా టాబ్లెట్ పీసీలను సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

ఐసీఐసీఐ బ్యాంక్ ఐమొబైల్ అప్లికేషన్ (ICICI Bank's iMobile):

ఈ ఐమొబైల్ అప్లికేషన్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారుల తమ బ్యాంక్ లావాదేవీను మొబైల్ ఫోన్‌ల ద్వారా నిర్వహించుకోవచ్చు. నగదు బదిలీ, టికెట్ బుకింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ అప్లికేషన్ ఒదిగి ఉంది. లింక్ అడ్రస్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

కామెడీ జోకులు (Funny Jokes):

ఈ అప్లికేషన్ నవ్వులుపూయించే వేలాది కామెడీ జోకులను మీకు చేరువచేస్తుంది. వీటిలో నచ్చిన వాటిని ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

‘కామన్ మ్యాన్ ’ అవసరాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్

డాక్టర్. వెబ్ యాంటీ - వైరస్ లైట్ (Dr. Web Anti-Virus Light):

ఈ అప్లికేషన్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ను వైరస్ ఇంకా స్పామ్ ల ద్వారా రక్షిస్తుంది. డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot