Home
News

గూగుల్‌ని తలదన్నే సెర్చ్ ఇంజిన్‌లు

By Hazarath

ఎవరికైనా ఏదైనా అవసరమొచ్చి ఆన్ లైన్ లో వెతకాలంటే ముందుగా ఏ వెబ్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళతారు...ఎవరైనా సరే.. సెర్చ్ చేయాలంటే సిస్టం ముందు కూర్చుని ఠపీమని గూగుల్ టైప్ చేస్తారు. అంతలా గూగుల్ పాపులర్ అయింది. అయితే ఒక్క గూగుల్ మాత్రమేనా ఉండేది ఇంక ఏమి లేవా అంటే ఎందుకు లేవు ఇంకా చాలానే ఉన్నాయి..ఇవి యూజర్లకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పడు సమర్థవంతంగా గూగుల్ కన్నా ఫాస్ట్ గా సేవలను అందిస్తున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

Read more: కోపమొస్తే ఇలా కూడా చేస్తారా..

1. బింగ్ (www.bing.com)

1. బింగ్ (www.bing.com)

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజినే 'బింగ్'. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన అన్ని డివైస్‌లలోనూ ఈ సెర్చ్‌ను డిఫాల్ట్‌గా అందిస్తున్నారు. గూగుల్ లాగే ఇది కూడా ఏ అంశానికి చెందిన సమాచారాన్నయినా సరే క్షణాల్లోనే సెర్చ్ చేసి మనకు అందజేస్తుంది.

2. యాహూ (search.yahoo.com)

2. యాహూ (search.yahoo.com)

గూగుల్, బింగ్‌ల తరువాత యూజర్లు ఎక్కువగా వాడుతున్న సెర్చ్ ఇంజిన్ 'యాహూ'. మార్కెట్‌లో దీనికి 9.57 షేర్ ఉంది. పైన పేర్కొన్న వాటిలాగే ఇది కూడా పనిచేస్తుంది.

3. బైదు (www.baidu.com)

3. బైదు (www.baidu.com)

చైనాకు సెర్చ్ ఇంజిన్ కంపెనీ 'బైదు'. జనవరి 1, 2000వ సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. వెబ్‌సైట్లకు చెందిన సమాచారం, ఆడియో ఫైల్స్, ఫొటోల వంటి వాటిని దీని ద్వారా వెతకవచ్చు.

4. ఏఓఎల్ (www.aol.com)

4. ఏఓఎల్ (www.aol.com)

ప్రపంచంలో అత్యధిక శాతం మంది యూజర్లు వాడుతున్న సెర్చ్ ఇంజిన్లలో ఇది కూడా ఒకటి. మార్కెట్‌లో దీని వాటా 0.59 శాతం మాత్రమే. 1983లో కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌గా తొలుత దీన్ని ప్రారంభించారు. అనంతరం 1991లో 'అమెరికా ఆన్‌లైన్‌'గా మార్పు చెందింది. అన్ని సెర్చ్ ఇంజిన్లలాగే ఇది కూడా పనిచేస్తుంది.

5. ఆస్క్ (www.ask.com)

5. ఆస్క్ (www.ask.com)

ఇంతకు ముందున్న 'ఆస్క్ జీవ్స్' సంస్థే 'ఆస్క్‌'గా మారి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో సెర్చ్ రిజల్ట్స్ 'ప్రశ్న - సమాధానం' మోడల్‌లో వస్తాయి. 1995లో దీన్ని స్థాపించారు.

6. ఎగ్జయిట్ (msxml.excite.com)

6. ఎగ్జయిట్ (msxml.excite.com)

ఐఏసీ సెర్చ్ అండ్ మీడియాకు చెందిన సెర్చ్ ఇంజినే 'ఎగ్జయిట్'. దీని ద్వారా యూజర్లు కేవలం సెర్చ్ సమాచారాన్నే కాకుండా ఈ-మెయిల్, వార్తలు, ఇన్‌స్టాంట్ మెసేజింగ్, వాతావరణ స్థితిగతులను గురించి తెలుసుకోవచ్చు.

7. డక్ డక్ గో (duckduckgo.com)

7. డక్ డక్ గో (duckduckgo.com)

ఇంటర్నెట్ యూజర్లకు మరింత ప్రైవసీని కల్పించడమే లక్ష్యంగా ఈ సెర్చ్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇతర సెర్చ్ ఇంజిన్‌లతో కలిసి ఇది యూజర్లకు నాణ్యమైన సెర్చ్ సమాచారాన్ని అందజేస్తుంది. 2008లో ఇది ప్రారంభమైంది.

8. వోల్‌ఫ్రమ్ ఆల్ఫా (www.wolframalpha.com)

8. వోల్‌ఫ్రమ్ ఆల్ఫా (www.wolframalpha.com)

ఇది ఇతర సెర్చ్ ఇంజిన్‌ల మాదిరిగా డాక్యుమెంట్స్ లేదా వెబ్ పేజీలకు చెందిన రిజల్ట్స్‌ను ఇవ్వదు. దీన్ని ఆయా అంశాలకు చెందిన గణనలకు ఉపయోగిస్తారు. అందుకే దీన్ని 'కంప్యూటేషనల్ సెర్చ్ ఇంజిన్' అని పిలుస్తారు. మ్యాథమాటికా సంస్థ దీన్ని 2009లో ప్రారంభించింది.

9. యాండెక్స్ (www.yandex.com)

9. యాండెక్స్ (www.yandex.com)

రష్యాలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది రష్యాకు చెందిన కంపెనీయే కావడం గమనార్హం. 1997లో దీన్ని ప్రారంభించారు. సాధారణ సెర్చ్ ఇంజిన్‌లలాగే ఇది కూడా పనిచేస్తుంది. కేవలం రష్యా దేశంలోనే కాకుండా ఉక్రెయిన్, కజకిస్థాన్, బెలారస్, టర్కీలలోనూ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

10. లైకోస్ (www.lycos.com)

10. లైకోస్ (www.lycos.com)

సెర్చ్ ఇంజిన్ రంగంలో 'లైకోస్' తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. 1994లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ-మెయిల్, వెబ్ హోస్టింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ వంటి సమాచారాన్ని ఇది సెర్చ్ రిజల్ట్స్‌తోపాటు అందిస్తుంది.

11. చాచా (www.chacha.com)

11. చాచా (www.chacha.com)

2006లో 'చాచా' సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. పైన పేర్కొన్న ఆస్క్ లాగే ఇందులో లభించే సెర్చ్ రిజల్ట్స్ కూడా ప్రశ్న - సమాధానం మోడల్‌లోనే ఉంటాయి. యూజర్లు వేసే ప్రశ్నలకు ఇది రియల్ టైమ్‌లో సమాధానాలిస్తుంది.

గూగుల్ ( www. google.com)

గూగుల్ ( www. google.com)

గూగుల్ గురించి మీ అందరికీ తెలిసిందే..ప్రపంచమంతా దీన్నే వాడుతున్నారు ఇప్పుడు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write top 11 best search engines in the world
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X