4జీ ఫోన్లతో చైనాను హడలెత్తిస్తున్న ఇండియా కంపెనీలు

Written By:

స్మార్ట్‌ఫోన్లు అనగానే అందరూ చైనా ఫోన్లు మీద దృష్టి పెడతారు..దీనికి కారణం ఏంటంటే అక్కడి ఫోన్లు అయితే చాలా తక్కువ ధరల్లో దొరుకుతాయి. అలాగే ఎక్కువ స్పెసిపికేషన్స్ తో దొరుకుతాయని భావించడమే. అయితే ఇండియాలో కూడా అలాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. ఇవి చాలామందికి తెలియదు. అవి కూడా అద్భుత ఫీచర్లతో తక్కువధరల్లో స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. మరి మన ఇండియాలో ఫోన్లను తయారుచేసే కంపెనీలు ఏంటో ఓ సారి చూద్దాం.

భారత్ దెబ్బకు కుప్పకూలుతున్న చైనా..ప్రపంచ దేశాల్లో కల్లోలం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్

హర్యానాలోని గుర్గాన్ లో మైక్రోమ్యాక్స్ సంస్థ ఉత్పతి కార్యాలయం ఉంది.ఐటీ కంపెనీగా ప్రారంభించి మొబైల్స్ పరిశ్రమగా ఎదిగింది. కాన్వాస్ సీరిస్ పోన్లతో ఇప్పుడు మార్కెట్లో దూసుకుపోతోంది.

సెల్‌కాన్

ఇది మన తెలుగు నేలపై ఉంది. హైదరాబాద్ కేంద్రంగా సెల్ కాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. దీని అధినేత వై గురు.

వీడియోకాన్

ముంబై కేంద్రగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ. దాదాపు 17 ఉత్పత్తి కార్యాలయాలు ఉన్నాయి. టీవీ రంగం నుంచి ఇప్పుడు మొబైల్స్ రంగంలోకి ప్రవేశించింది.

యు

ఇది ఇండియా బ్రాండ్.2014లో ప్రారంభించారు.ఈ కంపెనీ నుంచి వచ్చిన యురేకా ఫోన్ ఓ ఊపు ఊపింది కూడా. మైక్రొమ్యాక్స్ అనుబంధంగా పనిచేస్తోంది.

ఇంటెక్స్

1996లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశించింది. ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకుపోతోంది.

కార్బూన్

2009లో దీన్ని స్థాపించారు. ఇప్పుడు దీని కార్యకలాపాలు బంగ్లాదేశ్ ,శ్రీలంక, నేపాల్ దేశాలకు కూడా విస్తరించాయి. హంగామా . కామ్ కూడా ఈ కంపెనీదే.

లావా

నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ. ప్రపంచంలోనే ఫస్ట్ ఇంటెల్ చిప్ బేస్‌డ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంస్థ లావా ఒక్కటే, మొదట్లో ఫేస్ టెల్ గా వచ్చిన కంపెనీ తరువాత లావాగా పేరును మార్చుకుంది.

ఐబాల్

ముంబై కేంద్రగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ.

హెచ్‌సీఎల్

నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ. 32 దేశాలకు విస్తరించింది. సాప్ట్ వేర్ మొదలు అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది.

జోలో

ఇండియాలో నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ. AMD ఫీచర్స్ తో ఫస్ట్ ట్యాబ్లెట్ లాంచ్ చేసిస సంస్థ కూడా ఇదే.

స్పైస్

దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. మొబైల్ డెవలపర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు అప్లికేషన్ల రంగంలో తనదైన ముద్ర వేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 1o smartphone manufacturers in india Read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot