రూ. 2000కే స్మార్ట్‌ఫోన్ అమ్మాలి

Written By:

ప్రజలకు ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ సేవలు మరింత మెరుగ్గా అందాలంటే స్మార్ట్‌ఫోన్ ధరలు దిగిరావాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు.30 డాలర్లలోపే అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం 2 వేల రూపాయలకే స్మార్ట్‌ఫోన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చి చెప్పారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో జరిగిన ఇష్టాగోష్టిలో విద్యార్ధులతో సుందర్ పిచాయ్ పాల్గొన్నారు. ఆయన మాటల్లోని హైలెట్స్ పాయింట్స్ ఇవే.

టాంగో 3డీ టెక్నాలజీతో అసుస్ నుంచి అదిరే ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందరికీ ఇంటర్నెట్

భారతీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ ధరలు కేవలం రూ. 2 వేల లోపే ఉండాలి. అప్పుడే అందరికీ ఇంటర్నెట్ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ డిజిటల్ విప్లవం వైపు అడుగులు వేస్తారు.

భారత్ ఒక అంతర్జాతీయ స్థాయి మార్కెట్

డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక అంతర్జాతీయ స్థాయి మార్కెట్ గా మారుతోంది. ఇందు కోసం స్థానిక భాషల మద్దతుతో పాటు అనుసంధానం పెరగాల్సి ఉంది. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంద'ని అన్నారు.

భారత్ ప్రపంచ స్థాయి దేశమవుతుంది

డిజటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రపంచ స్థాయి దేశమవుతుంది. ఏ దేశంతోనైనా ఇది పోటీపడుతుంది. మనకు ఆ శక్తిసామర్థ్యాలు, పునాదులు పుష్కలంగా ఉన్నాయి. భారత్ కు, ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేసే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. అవి కచ్చితంగా మనల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతాయి.

అంతర్జాలం పట్ల అవగాహన

అనుసంధానం (కనెక్టివిటీ) అనేది అసాధారణమైన, అతిముఖ్యమైన అంశం. ప్రజలకు అంతర్జాలం పట్ల అవగాహన ఏర్పడడం కోసం 'ఇంటర్నెట్ సాథీ' వంటి ప్రాజెక్టులను గూగుల్ అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ వాసులు ఆన్లైన్లోకి రావడం కోసం మేం కృషి చేస్తాం.

భారతీయ భాషలన్నిటిలోనూ

మా సేవలను సాధ్యమైనంత వరకు భారతీయ భాషలన్నిటిలోనూ లభ్యమయ్యేలా చూస్తాం. మొత్తం మన జనాభాలో చాలా కొద్ది మంది మాత్రమే ఆంగ్లం మాట్లాడుతారు. అందుకే ఇతర భాషలపై గూగుల్ భారీ స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తోంది.

భారీ పెట్టుబడులు

రోజువారీ జీవితంపై కృత్రిమ మేధ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు భారీ మార్పులను చూపెడతాయి. చిత్రాల గుర్తింపు, గొంతు గుర్తించడం వంటి పనులను కంప్యూటర్లు చేసే సామర్థ్యం అపరిమితంగా పెరుగుతోంది. అందుకే ఈ విభాగంలో మేం భారీ పెట్టుబడులు పెడుతున్నాం. ఇవి కంప్యూటింగ్లో తదుపరి విప్లవానికి నాంది పలుకుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Rs 2K phone: Sundar Pichai’s bet for India’s digital age read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot