రిసెషన్ సమయంలో ప్రారంభమైన టాప్ కంపెనీలు!

Posted By:

రిసెషన్ సమయంలో కొత్త కంపెనీని ప్రారంభించేందుకు ఎవరు సాహసం చేయరు. అలాంటిది, జనరల్ ఎలక్ట్రిక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలను రిసెషన్ సమయంలోనే ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లటం జరిగింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రిసెషన్ సమయంలో ప్రారంభమై ఉన్నత స్థితిలో నిలిచిన ప్రముఖ కంపెనీల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జనరల్ ఎలక్ట్రిక్: 1890,General Electric: 1890

1.) జనరల్ ఎలక్ట్రిక్: 1890,General Electric: 1890

ఈ సంస్థను 1876లో థామస్ ఎడిసన్ అనే వ్యక్తి ప్రారంభించారు. ఏరోస్పేస్ ఇంకా హెల్త్ కేర్ విభాగాలకు విస్తరించింది.

 

ఐబీఎమ్, 1896 (IBM, 1896)

ఐబీఎమ్, 1896 (IBM, 1896):

ఈ కంపెనీని 1896లో ప్రారంభించారు. ఈ సంస్థలను రిసెషన్ సమయంలో ప్రారంభించటం విశేషం.సూపర్ కంప్యటర్ల తయారీ, హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల తయారీ విభాగంలో దిగ్గజహోదాను అధిరోహించిన ప్రముఖ బహుళ జాతియ కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) గురించి తెలియని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటూ ఉండరు. ఇక్కడ ఉద్యోగం ఓ వరంగా భావించే వారు కోకొల్లలు. న్యూయార్క్‌లోని ఆర్మాంక్ ప్రధాన కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తున్న ఐబీఎంకు ప్రపంచవ్యాప్తంగా 433,362 పై చిలుకు ఉద్యోగులున్నారు.

 

జనరల్ మోటార్స్, 1908 (General Motors,1908)

3.) జనరల్ మోటార్స్, 1908 (General Motors,1908):

అమెరికా ఉన్నతికి చిహ్నంగా ఓ వెలుగు వెలిగిన జనరల్ మోటార్స్ కంపెనీని 1908 సెప్టంబర్ లో ప్రారంభించటం జరిగింది. 100 సంవత్సరాల పాటు ఆటోమొబైల్ ప్రపంచంలో తన సత్తాచాటిన జనరల్ మోటార్స్ సంక్షోభం కారణంగా దివాళా దిశగా అడుగులు వేసింది.

 

డిస్నీ, 1923 (Disney, 1923)

4.) డిస్నీ, 1923 (Disney, 1923):

సోదరులైన వాల్ట్ ఇంకా రాయ్ డిస్నీలు అక్టోబర్ 16, 1923న డిస్నీ బ్రదర్స్ కార్టూన్ స్టూడియోను ప్రారంభించటం జరిగింది. వాల్టర్ ఎలియాస్ డిస్నీ.. 1901, డిసెంబర్ 5న చికాగోలో జన్మించారు. చిన్నతనం నుంచి కార్టూన్ రంగం పై ఇష్టత పెంచుకున్న ఆయన కార్టూన్ సినిమాలను ప్రకటనల నిమిత్తం తయారు చేసి సినిమా ప్రదర్శనకు మందు ధియేటరల్లో చూపించే వారుక్రమక్రమంగా ఆయన సృష్టించిన మిక్కీమౌస్, డొనాల్డ్ డక్, గూఫీ తదితర పాత్రలు పిల్లల నుంచి పెద్దల వరకు విపరీతంగా ఆకర్షించాయి.

 

మైక్రోసాఫ్ట్, 1975 (Microsoft, 1975)

5.) మైక్రోసాఫ్ట్, 1975 (Microsoft, 1975):

మైక్రోసాఫ్ట్ (Microsoft): ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్' ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించటం కొందరికి జీవిత లక్ష్యం. 1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ ‘విండోస్ 8' పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

యాపిల్, 2001 (Apple, 2001)

6.) యాపిల్, 2001 (Apple, 2001):

ప్రారంభం, 1976 (లాస్ ఆల్టోస్, కాలిఫోర్నియా), వ్యవస్థాపకులు: స్టీవ్ జాబ్స్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


వాల్ట్ డిస్నీ స్టూడియో (బర్బాంక్) నిత్యం వేలాది సందర్శకులతో కళకళలాడుతుంది. కార్టూన్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఈ సుమనోహర ప్రదేశాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో పరిచయం చేస్తున్నాం.. వివరాల్లోకి వెళితే వాల్టర్ ఎలియాస్ డిస్నీ.. 1901, డిసెంబర్ 5న చికాగోలో జన్మించారు. చిన్నతనం నుంచి కార్టూన్ రంగం పై ఇష్టత పెంచుకున్న ఆయన కార్టూన్ సినిమాలను ప్రకటనల నిమిత్తం తయారు చేసి సినిమా ప్రదర్శనకు మందు ధియేటరల్లో చూపించే వారు. క్రమక్రమంగా ఆయన సృష్టించిన మిక్కీమౌస్, డొనాల్డ్ డక్, గూఫీ తదితర పాత్రలు పిల్లల నుంచి పెద్దల వరకు విపరీతంగా ఆకర్షించాయి. అప్పట్లో కంప్యూటర్ పరిజ్ఞానం అందుబాటులోలేకపోవటంతో కార్టూన్ చిత్ర నిర్మాణం శ్రమతో కూడుకుని ఉండేది. పాత్ర ప్రతి కదలికనూ చిత్రాలలో చూపిస్తూ కొన్ని వేల బొమ్మలు వేసి ప్రతి ఫ్రేమ్‌ను చిత్రీకరించాల్సి వచ్చేది. తను రూపొందించిన సిండ్రిల్లా, స్నోవైట్ లాంటి కార్టూన్ చిత్రాలకు గాను డిస్నీప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1928లో ‘స్టీమ్ బోల్ లిల్లీ'పేరుతో మిక్కీ మౌస్ చిత్రాన్ని నిర్మించిన డిస్నీ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు. 1966, డిసెంబర్ 15న ఆయన తుదిశ్వాస విడిచారు. డిస్నీ సృష్టించిన పాత్రలు ఇప్పటికి అజరామరం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot