చైనా మార్కెట్‌పై దండయాత్రకు చేతులు కలిపారు

Written By:

దేశీయంగా పేరు గాంచిన ఐటీ దిగ్గజాలు చైనా మార్కెట్ లో తమ సత్తాను చాటేందుకు సిద్దమైపోయాయి. చైనాలో ఎలాగైనా పాగా వేయాలని అన్ని టెక్ కంపెనీలు ఒక్కటయ్యాయి. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఇలా అన్నీ ఏకమై చైనా మార్కెట్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమైపోయాయి. టెక్ దిగ్గజాలన్నీ ఏకమై చైనాలో పాగా వేసేందుకు పెద్ద కసరత్తునే చేస్తున్నాయి. టెక్ దిగ్గజాల చైనా దండయాత్రపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఇండియాలో టెక్ ధనవంతులు వీరే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశీయ ఐటి దిగ్గజాలు చైనా మార్కెట్లోకి చొచ్చుకుపోయేందుకు జట్టు

దేశీయ ఐటి దిగ్గజాలు చైనా మార్కెట్లోకి చొచ్చుకుపోయేందుకు జట్టుకట్టాయి. కఠినాతికఠినమైన చైనా నియంత్రణలు, రక్షిత విధానాలను అధిగమించి అక్కడ పాదం మోపాలన్న లక్ష్యంతో టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఎన్‌ఐఐటి చేతులు కలిపాయి. చైనా ఆగ్నేయప్రాంత రాష్ట్రం గైజోలో భారీ స్థాయి ఐటి ప్రాజెక్టులను ఈ ఐదు ఐటి సంస్థల కన్సార్షియం చేపట్టనుంది. ప్రయోగాత్మకంగా ఈ కన్సార్షియం ఏర్పాటు కావడం వెనక సిఐఐ షాంగై ప్రధాన భూమికపోషించింది.

ఒప్పందంలో ఎన్‌ఐఐటికి కూడా భాగస్వామ్యం

క్లౌడ్‌ ఆధారిత భారీ డేటా సెంటర్‌ ఏర్పాటుతో సహా ఐటికి అవసరమైన ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కోసం సిఐఐ షాంగైతో గైజో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఎన్‌ఐఐటికి కూడా భాగస్వామ్యం ఉంది. గైజో రాష్ట్రంలో ఐటి ప్రొఫెషనల్స్‌ శిక్షణ కోసం 1.6 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని ఎన్‌ఐఐటి దక్కించుకుంది.

భారత్‌ చాలా కాలంగా చైనాపై ఒత్తిడి

విదేశీ మార్కెట్లను కొల్లగొట్టేందుకు దూకుడుగా ముందుకుపోయే చైనా తమ మార్కెట్లోకి మాత్రం విదేశీ కంపెనీలు అడుగుపెట్టకుండా అనేక నియంత్రణలు అమలుచేస్తోంది. ఈ నియంత్రణలు ఎత్తివేసి మార్కెట్‌ ప్రవేశానికి వెసులుబాటు కల్పించాలని భారత్‌ చాలా కాలంగా చైనాపై ఒత్తిడితెస్తోంది.

ద్వైపాక్షిక వాణిజ్యం 7000 కోట్ల డాలర్లు

ముఖ్యంగా ఐటి, ఫార్మా కంపెనీలకు తమ ఉత్పత్తులు, సర్వీసులను మార్కెట్‌ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నది. గతేడాది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 7000 కోట్ల డాలర్లుండగా ఇందులో భారత్‌ తరఫున లోటు 4000 కోట్ల డాలర్లుంది. అంటే చైనా నుంచి మన దిగుమతులు 5500 కోట్ల డాలర్లుండగా, ఎగుమతులు కేవలం 1500 కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి.

ఐటి దిగ్గజాలు చేతులు కలపడం ఇదే తొలిసారి.

భారత ఐటి, ఫార్మా పరిశ్రమలు అంతర్జాతీయంగా అనేక మార్కెట్లలో దిగ్విజయంగా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పటికీ చైనాలో మాత్రం పాదం మోపలేకపోతున్నాయి. చైనా మార్కెట్‌లో పట్టు కోసం వ్యాపార వైరుధ్యాలను పక్కనబెట్టి ఐటి దిగ్గజాలు చేతులు కలపడం ఇదే తొలిసారి.

కొత్త శకం ఆరంభానికి ఇది నాంది

కొత్త శకం ఆరంభానికి ఇది నాంది అని టిసిఎస్‌ చైనా ప్రెసిడెంట్‌ సుజిత్‌ చటర్జీ, ఎన్‌ఐఐటి చైనా ప్రెసిడెంట్‌ ప్రకాష్‌ మీనన్‌ చెప్పారు. అంతర్జాతీయంగా ఎంతో పేరున్నప్పటికీ దేశీ బడా సంస్థలు చైనాలో నిలదొక్కుకునేందుకు నానాతంటాలు పడుతున్నాయి. స్థానిక కంపెనీలతో జట్టుకట్టి మార్కెట్‌ను ఐబిఎం వంటి సంస్థలు దున్నేస్తున్నాయి.

యావత్‌ చైనా మార్కెట్లోకి విస్తరించడం సులభం

చైనా మార్కెట్లో భారతీయ కంపెనీలు ఐబిఎం వంటి సంస్థల దరిదాపుల్లో కూడా లేవు. గైజో రాష్ట్రంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే యావత్‌ చైనా మార్కెట్లోకి విస్తరించడం సులభం అవుతుందన్న నమ్మకంతో దేశీ ఐటి దిగ్గజాలున్నాయి.

చేతులు కలిపి పనిచేస్తే తిరుగే ఉండదు

భారతీయ ఐటి కంపెనీలకున్న సత్తాకు చేతులు కలిపి పనిచేస్తే తిరుగే ఉండదని చటర్జీ అన్నారు. అయితే, సమష్ఠి పోరాటంలో ఏ ఒక్కరు కట్టుదప్పినా కుప్పకూలడం ఖాయమని కూడా ఆయన హెచ్చరించారు. ఒక్కో కంపెనీకి ఒక్కో విభాగంలో నైపుణ్యాలున్నాయని, చైనాలో సాధించే ప్రాజెక్టులను ఆ విధంగానే పంచుకుంటే పేచీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా మార్కెట్లో భారత్ కాలు మోపే రోజులు

మరి ఇక చైనా మార్కెట్లో భారత్ కాలు మోపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలుస్తోంది. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Top Indian IT firms like TCS, Infosys, Wipro, Tech Mahindra form consortium to penetrate Chinese market
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot