2000 గంటల వీడియో గేమ్, రక్తం గడ్డకట్టి మరణించాడు

Posted By:

ఏకధాటిగా 22 రోజుల పాటు ఓ కంప్యూటర్ గేమ్‌లో నిమగ్నమైన కుర్రోడు అనారోగ్యం పాలై మరణించాడు. ఉల్చాయ్‌కు చెందిన 17 సంవత్సరాల రుస్తామ కాలు విరగడంతో గత నెల 8 నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఒక్కడికే బోర్ కొట్టడంతో ఆన్‌లైన్‌లో డిఫెన్స్ ఆఫ్ ది ఏన్షియంట్స్ గేమ్‌కు బానిసయ్యాడు.

Read More:  ఇక 2 ఎంబీపీఎస్ వరకు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్

దీంతో అతని దినచర్య తినటం, పడుకోవటం గేమ్ ఆడటంలా మారిపోయింది. తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పడిపోయి రుస్తాంను పట్టించుకోవటమే మానేసారు. గత నెల 30వ తేదీని అతని గదిలోంచి కీబోర్డ్ చప్పుడు వినపించలేదు. దీంతో కొంత ఆందోళణకు గురైన అతని తల్లిదండ్రులు లోనికెళ్లి చూసేసరికి రుస్తాం పడిపోయి ఉన్నాడు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. కొద్ది రోజల నుంచి ఇతనిలో శారీరక కదలికలు లేకపోవటంతో రక్త గడ్డకట్టి, ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

Read More: అంతరిక్షంలో అరుదైన ఫోటోలు

గంట.. రెండు గంటలయితే పర్వాలేదు, కొంత మంది ఏకధాటిగా నిద్రహారాలు మానుకుని వీడియోగేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలు మాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్‌లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీ చర్మం వర్ణద్రవ్యాన్ని కోల్పోయి పొడిబారి పోతుంటుంది.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీ ఇంట్లో ఎక్కడ చూసినా వీడియో గేమ్ సీడీలు కనిపిస్తంటాయ్

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు


వీడియో గేమ్‌లలో లీనమై మిమ్మల్ని వీరు కొత్తగా అభివర్ణించుకుంటారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీ మిత్రులకు ఇష్టం లేకున్నా వీడియో గేమ్‌ల గురించి మాట్లాడుతూనే ఉంటారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

నిర్ణయాలను చాలా త్వరగా తీసుకోగలుగుతారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

బాత్రూమ్‌లో కూడా వీడియో గేమ్‌ల గురించే ఆలోచిస్తుంటారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

విహార యాత్రలను ఏ మాత్రం ఇష్టపడరు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

ఖాళీ సమయం దొరికితే చాలు వీడియో గేమ్‌ల ముందు అతుక్కుపోతారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

వీడియో గేమ్‌ల మోజులో పడి మంచి మిత్రులను కోల్పోతారు

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

 ప్లేస్టేషన్ తంబ్ (Playstation Thumb) గేమింగ్ కన్సోల్ కారణంగా తలెత్తె ఈ స్కిన్ డిసార్డర్ చేతి వేళ్లను ఇలా మార్చేస్తుంది.

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

స్నాయువు గాయాలు అయ్యే అవకాశం

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

తిగా వీడియో గేమ్‌లను ఆడటం వల్ల మూర్చ వచ్చే ప్రమాదం.

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

డియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

అతిగా వీడియోగేమ్స్ ఆడటం వల్ల దూకుడు ప్రవర్తనతో పాటు మానసిక సమస్యలు తలెత్తే అవకాశముంది.

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

అతిగా వీడియో గేమ్స్ ఆడటం వల్ల గేమ్ ట్రాన్స్‌ఫర్ ఫినామినా చోటు చేసుకునే ప్రమాదం

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

అతిగా వీడియో గేమ్స్ ఆడటం వల్ల దృష్టి సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

అతిగా వీడియో గేమ్ ఆడటం వల్ల మణికట్టు సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం.

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

అతిగా వీడియో గేమ్ ఆడటం వల్ల పార్శ్వపు నొప్పి సంభవించే అవకాశం.

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

అతిగావీడియో గేమ్ ఆడటం వల్ల ఒక్కో సమయంలో అకాల మరణం తప్పదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tragic teen gamer dies after playing computer for 22 days in a row. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot