ఇక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లనవసరం లేదు

Written By:

ఇకపై మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లనవసరం లేదు. కేవలం మీ వెంట సెల్‌ఫోన్ తీసుకెళితే చాలు. డ్రైవింగ్ లైసెన్స్ మరచిపోయినా అలాగే ఆర్ సీ తీసుకెళ్లకపోయినా కాని పోలీసులు ఎటువంటి జరిమానా విధించరు. ఎందుకంటే మీ చేతిలో ఇప్పుడు సెల్‌ఫోన్ ఉందిగా..అందులోనే మీ సమస్త సమాచారం ఉంటుంది. అదెలాగంటారా అయితే మీ సెల్ ఫోన్ లో ఆర్టీఏ విడుదల చేయునున్న యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. అదెలాగో చూద్దాం.

Read more : బ్లైండ్‌స్పాట్: అన్నీ నగ్న ఫోటోలు,చంపేస్తామంటూ బెదిరింపులే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ప్లే నుంచి డౌన్ లోడ్ చేసుకునే ఈ యాప్ లో

గూగుల్ ప్లే నుంచి డౌన్ లోడ్ చేసుకునే ఈ యాప్ లో వాహన బీమా తరహాలో మీ డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫ్‌కేట్ ఉంటాయి.

అంతకుముందే ఈ యాప్ ను వాడుతున్న వారు

అంతకుముందే ఈ యాప్ ను వాడుతున్న వారు ఈ-లైసెన్స్, ఈ-ఆర్సీ, ఈ-బీమా, ఈ- కాలుష్యం వంటి డాక్యుమెంట్లను పొందవలిసి ఉంటుంది.

పర్మిట్లు కూడా ఇదే యాప్ ద్వారా

పర్మిట్లు కూడా ఇదే యాప్ ద్వారా పొందవచ్చు. అయితే ఇది తెలంగాణాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తెలంగాణాలోని సమస్త వాహన సమాచారంతో కేంద్ర సర్వర్‌ను టీఎస్టీడీ యాప్‌తో అనుసంధానం చేశామని అధికారులు చెబుుతన్నారు.

ఆర్టీయే కార్యాలయానికి రానవసరం లేకుండానే

ఆర్టీయే కార్యాలయానికి రానవసరం లేకుండానే ఆన్‌లైన్లో ఫీజులు చెల్లించి అన్ని రకాల సేవలను అందుకోవచ్చని వారు పేర్కొన్నారు.కాగా ఈ యాప్ అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో రానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్ కోసం

ఇక ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకోదలచిన వారు, ముందుగా http://www.aptransport.org/ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో లైసెన్స్ (Licence) అనే మెనూలో లెర్నర్స్ లైసెన్స్ (Learner's Licence) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.

లెర్నర్స్ లైసెన్స్ పేజ్ ఓపెన్

ఇప్పుడు లెర్నర్స్ లైసెన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లెర్నర్ లైసెన్స్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవటానికి, మరొకటి లెర్నర్ లైసెన్స్ కోసం డెమో టెస్ట్‌ని బుక్ చేసుకోవటానికి. మనం ముందుగా లెర్నర్ లైసెన్స్ కోసం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, CLICK HERE TO BOOK LEARNER LICENCE SLOT అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

అప్పుడు ఓ సెపరేట్ పేజీ

అప్పుడు ఓ సెపరేట్ పేజీ/విండో ఓపెన్ అవుతుంది. అందులో మళ్లీ లైసెన్స్ (Licence) అనే మెనూ క్రింద లెర్నర్ సెన్స్ టెస్ట్ (Learner Licence Test) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.

ఆ తర్వాత మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో

ఆ తర్వాత మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో లేక ఏ జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ ధరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాను ఎంచుకున్న తర్వాత మీకు సమీపంలో ఉండే లేదా మీరుకు టెస్ట్‌కు హాజరు కాబోయే సెంటరును ఎంచుకొని సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి.

ఆ తర్వాత ఓ క్యాలెండర్ ఓపెన్

ఆ తర్వాత ఓ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో అకెంలు రెడ్ కలర్‌లో ఉంటే ఆయా తేదీల్లో ఆన్‌లైన్ స్లాట్‌లు అందుబాటులో లేవని, అంకెలు గ్రీన్ కలర్‌లో ఉంటే ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉందని అర్థం.

క్యాలెండర్‌లో గ్రీన్ కలర్ అంకెలపై

క్యాలెండర్‌లో గ్రీన్ కలర్ అంకెలపై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న సమయాలు, స్లాట్‌లు కనిపిస్తాయి. మీకు అనువైన సమయం ఎంచుకున్న తర్వాత సబ్‌మిట్ (SUBMIT)పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఆన్‌లైన్ లెర్నర్స్ లైసెన్స్

ఆ తర్వాత ఆన్‌లైన్ లెర్నర్స్ లైసెన్స్ అప్లికేషన్ ఫారమ్ (Online Learner's License Application Form) పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సుపై పేరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా నమోదు చేయాలి. దాంతో పాటుగా అక్కడ అన్ని తప్పనిసరి వివరాలను నమోదు చేసి తిరిగి (SUBMIT)పై క్లిక్ చేస్తే మీరు ఎంచుకున్న తేది, సమయానికి టైమ్ స్లాట్ బుక్ అవుతుంది.

మీరు ఎంచుకున్న తేదీలో ఆ సమయానికి మీరు

మీరు ఎంచుకున్న తేదీలో ఆ సమయానికి మీరు ఎంచుకున్న ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి టెస్టుకు హాజరయ్యినట్లయితే, మీకు లెర్నర్ లైసెన్స్ వస్తుంది. సాధారణంగా లెర్నర్ లైసెన్స్ చెల్లుబాటయ్యే కాలపరిమితి ఒక నెల వరకు ఉంటుంది. దాని గడువు ముగియక ముందే మీరు మరోసారి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియోను ఓ సారి చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write TSTD Mobile App from Telangana State Hyd RTA
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot