Twitter నుంచి సరికొత్త ఫీచర్!!! ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వలె కొత్త అప్‌డేట్...

|

ఇండియాలోని ట్విట్టర్ వినియోగదారుల కోసం ట్విట్టర్ కొత్తగా "ఫ్లీట్స్ ఫీచర్" యొక్క రోల్ అవుట్ ను ప్రకటించింది. ఫ్లీట్స్ ఫీచర్ అనేది ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లాగా ఏవైనా ట్వీట్లు, ఫోటోలు,గిఫ్టులు లేదా వీడియోలను అందరితో పంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

ట్విట్టర్ ఫ్లీట్ ఫీచర్‌

ట్విట్టర్ ఫ్లీట్ ఫీచర్‌

కాని సాధారణ ట్వీట్‌ల మాదిరిగా కాకుండా ఈ ఫ్లీట్‌లు కేవలం 24 గంటలు మాత్రమే చూడడానికి అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇవి ఆటొమ్యాటిక్ గా అదృశ్యమవుతాయి. ట్విట్టర్ యొక్క ఈ కొత్త ఫ్లీట్ ఫీచర్‌లకు రీట్వీట్లు, లైక్లు లేదా రిప్లయ్ లు కూడా ఉంటాయి అని కంపెనీ తెలిపింది. అయితే ట్విట్టర్ వినియోగదారులు ఈ ఫ్లీట్‌ల ఫీచర్ తో డైరెక్ట్ మెసేజెస్ ద్వారా కూడా సంభాషించవచ్చు. Also Read:OPPO A12 అద్భుతమైన ఫీచర్స్ మరియు గేమ్ ఇన్నోవేషన్‌లతో రూ.9,990 లకే స్మార్ట్‌ఫోన్

ట్విట్టర్ కొత్త ఫీచర్

ట్విట్టర్ కొత్త ఫీచర్

మార్చి నెల ప్రారంభంలో ట్విట్టర్ ఈ ఫీచర్ ను మొదటిసారిగా బ్రెజిల్‌లోని వినియోగదారులకు అందించింది. తరువాత ఇటలీలోని వినియోగదారులు కూడా ఈ ఫీచర్ ను అందుకున్నారు. ట్విట్టర్ యొక్క కొత్త ఫీచర్ ఫ్లీట్‌లకు సంబంధించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Redmi Note 9 Pro Max Sale: ఊహించని ఆఫర్లతో గొప్ప అవకాశం!!!

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకు సమానంగా ట్విట్టర్ ఫ్లీట్స్ షేర్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకు సమానంగా ట్విట్టర్ ఫ్లీట్స్ షేర్

ట్విట్టర్‌ యొక్క ప్రొడక్ట్ లీడ్ కైవోన్ బేక్‌పూర్ మార్చి నెలలో చేసిన ట్వీట్‌లో " ఫ్లీట్స్ ఫీచర్ " ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు సారూప్యతను కలిగి ఉంటుంది అని పేర్కొన్నారు. అయితే ఇందులో కొన్ని ఉద్దేశపూర్వక తేడాలు ఉన్నాయని చెప్పారు. ఈ స్టోరీలను మొదట స్నాప్‌చాట్ ప్రవేశపెట్టింది. తరువాత ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌ వంటి పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు కూడా ఈ ఫీచర్ లను ప్రారంభించాయి.

ట్విట్టర్‌ ఫ్లీట్స్ లేఅవుట్‌

ట్విట్టర్‌ ఫ్లీట్స్ లేఅవుట్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో అడ్డంగా కనిపిస్తున్న స్టోరీస్ మాదిరిగా కాకుండా ట్విట్టర్‌ యొక్క ఫ్లీట్స్ నిలువు లేఅవుట్‌ను అనుసరిస్తాయి. ఏదేమైనా ఫ్లీట్‌లపై సంభాషణలు పరిమితం చేయబడ్డాయి. ఎందుకంటే ఇతర వినియోగదారులు ఫ్లీట్‌లకు ప్రతిస్పందించడానికి DM లను వినియోగదారుడు ఓపెన్ చేయాలి. Also Read:షియోమి Mi TV 4X 50 స్మార్ట్‌టీవీ రివ్యూ

ట్విట్టర్ యాప్ ల ద్వారా ఫ్లీట్స్

ట్విట్టర్ యాప్ ల ద్వారా ఫ్లీట్స్

ట్విట్టర్ వినియోగదారులు హోమ్ స్క్రీన్‌లో వారి ప్రొఫైల్ అవతార్‌ను నొక్కడం ద్వారా ఫ్లీట్‌లను పోస్ట్ చేయవచ్చు. వినియోగదారులు అధికంగా 280 అక్షరాల వరకు టెక్స్ట్ ను టైప్ చేయవచ్చు. వీటితో పాటుగా ఫోటోలు, GIF లు లేదా వీడియోను కూడా ఫ్లీట్స్ రూపంలో పోస్ట్ చేయవచ్చు. చివరిగా దీనిని పోస్ట్ చేయడానికి ఫ్లీట్ చిహ్నాన్ని నొక్కండి.

ఫ్లీట్స్ ఎలా పని చేస్తాయి?

ఫ్లీట్స్ ఎలా పని చేస్తాయి?

మీ యొక్క ఆలోచనలను మరియు సంభాషణలను ఎక్కువ మందితో పంచుకోవడానికి ఫ్లీట్స్ ఒక కొత్త మార్గం. ఫ్లీట్స్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా 24 గంటల తర్వాత అదృశ్యమవుతాయి. ట్వీట్ల మాదిరిగానే ఫ్లీట్‌లలో టెక్స్ట్, వీడియోలు మరియు ఫోటోలను కూడా జోడించవచ్చు. మీరు ఫ్లీట్‌కు ప్రత్యుత్తరం ఇవ్వాలనుకుంటే లేదా ఎమోజిని పంపడానికి దానిపై నొక్కండి మరియు మీ DM లలో సంభాషణను కొనసాగించండి. మీ అనుచరులు మీ ఫ్లీట్‌లను వారి టైమ్‌లైన్ ఎగువన చూడవచ్చు. మీ పూర్తి ప్రొఫైల్‌ను చూడగలిగే ఎవరైనా మీ ఫ్లీట్‌లను చూడవచ్చు.

ఫ్లీట్స్ ఫీచర్ వెనుక ఉన్న ఆలోచన?

ఫ్లీట్స్ ఫీచర్ వెనుక ఉన్న ఆలోచన?

ట్విట్టర్ అంటే ప్రజలు కొత్త విషయాలను తెలుసుకోవడానికి లేదా తమకు తెలిసిన దాని గురించి ప్రజలకు తెలియజేయడానికి వాడుతూ ఉంటారు. కానీ కొంతమంది ట్వీట్ చేయడం అసౌకర్యంగా కూడా బావిస్తూఉంటారు. ఎందుకంటే ట్వీట్లు పబ్లిక్ గా శాశ్వత అనుభూతిని కలిగి ఉంటాయి. అలాగే తాము చేసే ట్వీట్‌కు చాలా లైక్ లు మరియు ప్రత్యుత్తరాలు ఉండాలి అనే భావన కూడా ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ నియంత్రణతో కొత్త మార్గాల ద్వారా సంభాషణలు జరపాలని కోరుకుంటున్న సమయంలో ఫ్లీట్‌ల ఫీచర్ ను పరీక్షిస్తున్నాము అని తెలిపారు.

Best Mobiles in India

English summary
Twitter Launched Fleets Feature in India: How it Works

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X