విషాదాలతో హోరెత్తిన ట్విట్టర్

By Hazarath
|

మరి కొద్ది రోజుల్లో 2015 సంవత్సరం ముగియబోతోంది. 2015కి బైబై చెప్పి 2016కి స్వాగతం చెప్పే సమయం కూడా దగ్గరలోనే ఉంది. అయితే ఈ సందర్భంగా ట్విట్టర్ ఇండియా 2015వ సంవత్సరానికి సంబంధించి టాప్ ట్రెండ్స్ ను అలాగే ఎక్కువగా రీ ట్వీట్ చేసిన ట్వీట్స్ ను ఇంకా మోస్ట్ పాపులర్ ట్వీట్ లను ప్రకటించింది. వీటిల్లో ఎక్కువగా ఈ సంవత్సరమంతా విషాదాలతో నిండింది. అలాగే విషాదాలతో పాటు ఇంకా అనేక అంశాలు ట్విట్టర్ లో చోటు సంపాదించాయి. వాటిని ఓ సారి చూద్దాం.

Read more: ఇండియా కోటలకు ప్రపంచమే ఫిదా

ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్స్

ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్స్

గోల్డెన్ ట్వీట్ ఘనత బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్‌కు దక్కింది. లండన్‌లో జరిగిన ఏషియన్ అవార్డుల కార్యక్రమంలో షారూఖ్‌ఖాన్ ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు జైన్ మాలిక్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి అత్యధికంగా 1,41,000పైగా రీట్వీట్స్, 18.3 మిలియన్ వ్యూస్, 2 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఏప్రిల్ 17న చేసిన ఈ ట్వీట్ గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది.

ట్విట్టర్ ఈ ఏడాదిని 'సంఘీభావ సంవత్సరం' గా

ట్విట్టర్ ఈ ఏడాదిని 'సంఘీభావ సంవత్సరం' గా

ట్విట్టర్ ఈ ఏడాదిని 'సంఘీభావ సంవత్సరం' గా పేర్కొంది. టర్కీ సముద్రతీరంలో శవమై పడిఉన్న..సిరియాకు చెందిన మూడేళ్ల బాలుడి చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. సిరియా, ఇతర మధ్యప్రా చ్య దేశాల నుంచి వచ్చే శరణార్థులను యూరప్ దేశాల్లోకి అనుమతించాలంటూ అనేక మంది ప్రజలు చేసిన ట్వీట్లు..ట్విట్టర్‌లో ఎక్కువ చర్చిం చుకున్న అంశాల్లో నాలుగోస్థానంలో నిలిచింది.

పారిస్‌పై ఉగ్రదాడి సంఘటన

పారిస్‌పై ఉగ్రదాడి సంఘటన

పారిస్‌పై ఉగ్రదాడి సంఘటన.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ఎక్కువగా చర్చించుకున్న విషయంగా నిలిచింది.

అమెరికాలో జరిగిన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్‌మెంట్

అమెరికాలో జరిగిన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్‌మెంట్

అమెరికాలో జరిగిన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్‌మెంట్' ట్విట్టర్‌లో ఎక్కువగా చర్చించుకున్న విషయాల్లో రెండోస్థానంలో నిలిచింది. అమెరికాలోని ఫెర్గూసన్, చార్లెస్టన్,బ్లాతిమోర్‌లలో పోలీసులు నల్లజాతీయులను కాల్చి చంపటంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది.

అహ్మద్ మొహమ్మద్ అనే బాలుడు రూపొందిన హోమ్‌మేడ్ క్లాక్‌ను

అహ్మద్ మొహమ్మద్ అనే బాలుడు రూపొందిన హోమ్‌మేడ్ క్లాక్‌ను

అమెరికాకు చెందిన 14ఏళ్ల బాలుడు అహ్మద్ మొహమ్మద్ అనే బాలుడు రూపొందిన హోమ్‌మేడ్ క్లాక్‌ను బాంబుగా భావించి స్కూలు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. 'ఐ స్టాండ్ విత్ అహ్మద్'అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రపంచం మొత్తం అహ్మద్‌కు మద్దతు పలికింది.

చివరికి అధ్యక్షుడు ఒబామా స్పందించి

చివరికి అధ్యక్షుడు ఒబామా స్పందించి

చివరికి అధ్యక్షుడు ఒబామా స్పందించి. అహ్మద్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ఈ సంఘటన ఐదోస్థానంలో నిలిచింది.

అమెరికా, ఐర్లాండ్‌లు స్వలింగ సంపర్కుల వివాహాన్ని

అమెరికా, ఐర్లాండ్‌లు స్వలింగ సంపర్కుల వివాహాన్ని

అమెరికా, ఐర్లాండ్‌లు స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. ఈ విషయం ఎక్కువ మంది చర్చించిన అంశంగా మూడోస్థానంలో నిలిచింది. స్వలింగ సంపర్కుల విహహానికి సంబంధించిన చట్టాన్ని యూఎస్ సుప్రీం కోర్టు జూన్ 26న ధ్రువపరిచింది.

ఇంగ్లండ్, కెనడా, ఇండియాలో జాతీయస్థాయిలో జరిగిన ఎన్నికలు

ఇంగ్లండ్, కెనడా, ఇండియాలో జాతీయస్థాయిలో జరిగిన ఎన్నికలు

ఇంగ్లండ్, కెనడా, ఇండియాలో జాతీయస్థాయిలో జరిగిన ఎన్నికలు..ట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్లతో ట్విట్టర్ టైమ్ లైన్లను హోరెత్తించాయి. ఈ అంశం ఆరోస్థానంలో నిలిచింది.

మోస్ట్ ఫాలోడ్ యూజర్స్

మోస్ట్ ఫాలోడ్ యూజర్స్

ఇయర్ ఇన్ ట్విట్టర్ 2015'నివేదిక ప్రకారం బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ 18.1 మిలియన్ల ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉన్నారు.

షారూఖ్ ఖాన్ 16.5 మిలియన్ల ఫాలోవర్లతో

షారూఖ్ ఖాన్ 16.5 మిలియన్ల ఫాలోవర్లతో

షారూఖ్ ఖాన్ 16.5 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచారు.

ప్రధాని నరేంద్ర మోదీ 16.4 మిలియన్ల ఫాలోవర్లతో

ప్రధాని నరేంద్ర మోదీ 16.4 మిలియన్ల ఫాలోవర్లతో

ప్రధాని నరేంద్ర మోదీ 16.4 మిలియన్ల ఫాలోవర్లతో మూడోస్థానంలో ఉన్నారు.

అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ వరసగా

అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ వరసగా

అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ వరసగా 15.5 మిలియన్లు, 15 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

9 ట్విట్టర్ అకౌంట్లు బాలీవుడ్ స్టార్లకు

9 ట్విట్టర్ అకౌంట్లు బాలీవుడ్ స్టార్లకు

భారత్‌లో మోస్ట్ ఫాలోవుడ్ టాప్ టెన్ పర్సన్స్‌లో 9 ట్విట్టర్ అకౌంట్లు బాలీవుడ్ స్టార్లకు చెందినవే కావటం విశేషం.

మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్

మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్

ట్విట్టర్‌లో మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్ క్రీడలు, వినోదం, రాజకీయం, సామాజిక కార్యక్రమాల మిశ్రమంగా ఉన్నాయి.

ఐపీల్-9 మిలియన్ ట్వీట్లు

ఐపీల్-9 మిలియన్ ట్వీట్లు

ఐపీల్-9 మిలియన్ ట్వీట్లు

సెల్ఫీవిత్‌డాటర్-3,75,000 ట్వీట్లు

సెల్ఫీవిత్‌డాటర్-3,75,000 ట్వీట్లు

సెల్ఫీవిత్‌ డాటర్-3,75,000 ట్వీట్లు

బిహార్ ఎన్నికల ఫలితాలు-2,60,000 ట్వీట్లు

బిహార్ ఎన్నికల ఫలితాలు-2,60,000 ట్వీట్లు

బిహార్ ఎన్నికల ఫలితాలు-2,60,000 ట్వీట్లు

నరేంద్ర మోదీ ఏడాది పాలన-1,79,000 ట్వీట్లు

నరేంద్ర మోదీ ఏడాది పాలన-1,79,000 ట్వీట్లు

నరేంద్ర మోదీ ఏడాది పాలన-1,79,000 ట్వీట్లు

దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే సినిమాకు

దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే సినిమాకు

దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే సినిమాకు 20 ఏళ్లయిన సందర్భం-1,40,000 ట్వీట్లు

సొంతంగా ట్విట్టర్ ఇమోజీ పొందిన మేకిన్ ఇండియా

సొంతంగా ట్విట్టర్ ఇమోజీ పొందిన మేకిన్ ఇండియా

అమెరికా బ్రాండ్ కాకుండా సొంతంగా ట్విట్టర్ ఇమోజీ పొందిన తొలి హ్యాష్‌ట్యాగ్ 'మేకిన్ ఇండియా'

Best Mobiles in India

English summary
Here Write Twitter tallies the tweeting trends of 2015

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X