మరణానికి ముందు ఏం జరిగింది ?

Written By:

అహింసా వాదంతో స్వరాజ్యం సిద్ధించదని నమ్మిన వీరుడు. హింసా వాదంతో దేశానికి స్వేచ్చా వాయువులను అందించాలని తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ .ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించి బ్రిటీష్ వారిని తరిమి తరిమి కొట్టిన సేనాధిపతి నేతాజీ.. ప్రపంచ పటంలో ఇండియా కొదమ సింహమై గర్జిసున్న ఆ వీరుని మరణం ఇంకా వీడని మిస్టరీలానే ఉంది. ఆయన మరణంపై ప్రతి రోజూ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన చనిపోయిన ముందు రోజుల్లో ఏం జరిగింది అనేదానిపై కొన్ని శ్వేత పత్రాలు విడులయ్యాయి.

Read more : నేతాజీ చివరి రోజుల మిస్టరీపై వెబ్‌సైట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చంద్రబోస్ మిస్సింగ్‌కు ముందు రోజుల్లో ఏం జరిగిందనే వివరాలను

విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్‌కు ముందు రోజుల్లో ఏం జరిగిందనే వివరాలను ఆయన మనవడు, జర్నలిస్ట్ ఆశిష్ రే బహిర్గతం చేస్తున్నారు.

లండన్ నుంచి నిర్వహించే వెబ్‌సైట్ బోస్ ఫైల్ .ఇన్ఫోలో

లండన్ నుంచి నిర్వహించే వెబ్‌సైట్ బోస్ ఫైల్ .ఇన్ఫోలో వీటిని డాక్యుమెంట్ల సహితంగా పొందుపరుస్తున్నారు. 1945 ఆగస్టు 18 న తైవాన్లో నేతాజీ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ముందురోజు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లింది వీటిలో ఉన్నాయి.

డాక్యుమెంట్ల ప్రకారం .. నేతాజీ

డాక్యుమెంట్ల ప్రకారం .. నేతాజీ ఆగస్టు 17 న బ్యాంకాక్ నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి సైగన్ చేరుకున్నారు. జపాన్ కు చెందిన ఆ విమానంలో ఎక్కువ మందికి చోటులేదని, కల్నల్ రెహ్మన్, నేతాజీ మాత్రమేఅందులో ప్రయాణించారని ఆ దేశ సాక్షులు చెబుతున్నారు.

వాస్తవానికి ఆయన ఈశాన్య ఆసియా వెళ్లాల్సి ఉంది

వాస్తవానికి ఆయన ఈశాన్య ఆసియా వెళ్లాల్సి ఉంది. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓ రెండు రోజుల ముందు లొంగిపోవడంతో అక్కడికీ వెళ్లే వీలు లేక నేతాజీ బృందం సైగాన్ లో దిగాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేతాజీ నాయకత్వంలో గల బారత జాతీయ సైన్యం జపాన్ కు మధ్యవర్తిగా ఉన్నా హికరీ కికన్ అనే సంస్థకు చెందిన జనరల్ ఇసోదా ఆయనతో మాట్లాడారు.

టోక్యో వెళుతున్న 14 సీట్ల జపాన్ యుద్ధ విమానంలో

టోక్యో వెళుతున్న 14 సీట్ల జపాన్ యుద్ధ విమానంలో రెండు సీట్లున్నాయని తమతో రావచ్చని నేతాజీకి తెలిపారు. తప్పనిసరి కావడంతో కల్మన్ రెహమాన్ తో కలిసి నేతాజీ బయలుదేరారు. విమానం సైగన్ నుంచి హైటో, తైపీ, డెరైన్ మీదుగా టోక్యో చేరాల్సి ఉంది. జపాన్ ఆర్మీలోని రష్యా వ్యవహారాల నిష్ణాతుడు జనరల్ షీడీ కూడా ఆ విమానంలో ఉన్నారు.

అదే సమయంలో లెప్టినెంట్ జనరల్ షిదోయ్

అదే సమయంలో లెప్టినెంట్ జనరల్ షిదోయ్ అప్పటి సోవియట్ సరిహద్దులోని చైనా ప్రాంతం మంచూరియాకు వెళుతున్నారు. అయితే తనతో పాటు చైనాలోని మంచూరియా రావాలని లెప్టినెంట్ జనరల్ షిదోయ్ సూచించగా ఆయన అంగీకరించారు. ఆలస్యంగా బయలుదేరడంతో పైలట్ సూచన మేరకు తౌరేన్ లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు.

ఆయనతో పాటు నేతాజీ కూడా వెళ్లాలని నిర్ణయించారని

ఆయనతో పాటు నేతాజీ కూడా వెళ్లాలని నిర్ణయించారని బోస్ కు జపనీస్ దుబాసీ నెగిషీ .. విచారణ కమిటీకి తెలిపారు. దీన్ని బట్టి మంచూరియాలోని డెరైన్ కు వెళ్లడానికి నేతాజీ అంగీకరించి ఉంటారని తెలుస్తోంది. అయితే సైగన్లో బయలుదేరడం ఆలస్యం కావడంతో అనుకున్న ప్రకారం కాకుండా మధ్యలో విమానం ఆగినట్లు వెబ్‌సైట్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.

బోసు చనిపోయారని చెప్తున్న విమాన ప్రమాదం

బోసు చనిపోయారని చెప్తున్న విమాన ప్రమాదం తర్వాత కొన్నేండ్లకు ఆయన చైనాలో కనిపించారన్న వాదనలను తిరస్కరించేలా ఈ ఫైళ్లలోని అంశాలు ఉన్నాయి. 1952 లో బోసు చైనాలో కనిపించారన్న వార్తలను ఖండిస్తూ బీజింగ్ లోని భారతీయ ఎంబసీ పంపించిన ఒక టెలిగ్రామ్ ను వెబ్‌సైట్ లో పోస్ట్ చేశారు.

1952 లో ఎస్ఎం గోస్వామి అనే బోసు అభిమాని

1945 లో తైవాన్లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో బోసు చనిపోయారని భావించారు. అయితే 1952 లో ఎస్ఎం గోస్వామి అనే బోసు అభిమాని నేతాజీ మిస్టరీ వీడింది అనే శీర్షికతో ఒక కరపత్రం వెలువరించారు. అందులో మంగోలియన్ వాణిజ్య ప్రతినిధి బృందం చైనా అధికారులతో ఉన్న ఒక ఫొటోను ముద్రించారు.

అందులో ఉన్న ఒక వ్యక్తి బోసేనని

అందులో ఉన్న ఒక వ్యక్తి బోసేనని ఆయన పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు హాజరై, ఆ ఫొటోను చూపిస్తూ ఆయన బతికే ఉన్నారని వాదించారు. దీనిని ధ్రువీకరించుకునేందుకు ఆ ఫొటోను బీజింగ్లోని భారతీయ ఎంబసీకి పంపించగా, ఆ ఫొటోలో ఉన్నది బోసు కాదని తిరుగు సమాధానం వచ్చింది.

బోసుదిగా చెప్తున్న ఈ ఫొటోను మేము చైనా విదేశాంగ శాఖకు

ఆ కేబుల్ ఇలా ఉంది. బోసుదిగా చెప్తున్న ఈ ఫొటోను మేము చైనా విదేశాంగ శాఖకు చూపించాం. ఆ ఫొటోలో ఉన్నది పెకింగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి చెందిన మెడికల్ సూపరింటెండెంట్ లీ కే హుంగ్ అని వారు పేర్కొన్నారు.

బోసుకు సంబంధించి 70 ఏండ్లుగా ప్రచారమవుతున్న

బోసుకు సంబంధించి 70 ఏండ్లుగా ప్రచారమవుతున్న తప్పుడు సమాచారాన్ని ఎండగట్టే వాటిలో ఈ టెలిగ్రామ్ ఒకటని వెబ్‌సైట్ ఏర్పాటు చేసిన లండన్ కు చెందిన జర్నలిస్టు అశిష్ రే పేర్కొన్నారు. 1945 లో బోసు సోవియట్ కు వెళ్లారనే వాదనలను గతేడాది డిసెంబర్ 7 న తిప్పికొడుతూ కొన్ని ఫైళ్లను ఈ వెబ్‌సైట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నేతాజీ ప్రయాణిస్తున్న విమానం ఆగస్టు 18,1945న

అయితే నేతాజీ ప్రయాణిస్తున్న విమానం ఆగస్టు 18,1945న కూలిపోయింది. ఆ రోజు నేతాజీ ఏం చేశారు. ఎలా ఉన్నారు. జరిగిన సంఘటన తాలూకూ అంశాలు జనవరి 9న వెబ్‌సైట్ లో విడుదల చేస్తానని ఈ సందర్భంగా ఆశిష్ రే తెలిపారు.

ప్రస్తుతానికి నేతాజీ మిస్టరీకి సంబంధించి ఆయన మనవడు

ప్రస్తుతానికి నేతాజీ మిస్టరీకి సంబంధించి ఆయన మనవడు వెల్లడించిన వివరాలు ఇవి. మరిన్ని వాస్తవాలను తదుపరి పత్రాల్లో విడుదల చేస్తానని ఆయన చెప్పడంతో ఈ మిస్టరీపై ఇంకా అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

నేతాజీ చివరిసారిగా ఆగస్టు 17న

నేతాజీ చివరిసారిగా ఆగస్టు 17న బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో కనిపించారని వివరాలను బట్టి తెలుస్తోంది. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన ఒఖ పోరాట యోధుడి మరణం గురించి సరైన వివరణ గుర్తింపు ఇప్పటికీ లభించకపోవడం ప్రతి భారతీయుని గుండెని కలచివేస్తోంది.

అందరికీ వర్థంతులు ఘనంగా జరుపుకుంటుంటే

అందరికీ వర్థంతులు ఘనంగా జరుపుకుంటుంటే ఆయనకు మాత్రం వర్థంతులే లేవు. ఆయనమ మరనంపై మిస్టరీ ఎప్పుడు వీడుతుందో అప్పుడే ఆయన వర్థంతి జరిగే అవకాశం ఉందని పరిస్థితులను బట్టి తెలుస్తోంది.నేతాజీకి  సంబంధించిన మరిన్ని వివరాలను బోస్ ఫైల్ .ఇన్ఫో వెబ్ సైట్ లో చూడొచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here WriteU.K. website releases papers of day before Bose plane crash
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot