ఉబెర్ క్యాబ్‌లలో ఉచిత 4జీ ఇంటర్నెట్

Posted By:

యాప్ బుకింగ్ ఆధారంగా ట్యాక్సీ సేవలను అందిస్తోన్న Uber ఇండియా తమ ప్రయాణీకుల కోసం ఉచిత 4జీ వై-ఫై సేవలను అందిస్తోంది. ఈ సేవల నిమిత్తం టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో Uber ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ఈ సేవలను ముంబైలో అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే ఇతర పట్టణాలకు విస్తరించనున్నారు.

Read More: రసకందాయానికి రాసలీలల గుట్టు

ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు ప్రత్యేక ప్రమోషన్‌లతో పాటు డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తామని ఉబెర్ ఇండియా ప్రకటించింది. తరచూ ఉబెర్ క్యాబ్‌లను బుక్ చేసుకునే వారికి ఈ సేవలు మరింతగా ఉపయోగపడనున్నాయి. భారత దేశంలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలోపు తమ పనులను చక్కబెట్టుకునే విధంగా ఈ సేవలను అందిస్తున్నట్లు ఉబెర్ తెలిపింది. ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

ముందుగా అధికారిక UBER వెబ్‌సైట్‌లోకి ప్రవేశించండి.

 

 

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

ఆ తరువాత SIGN UP లింక్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ పేరు, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీతో పాటు క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయండి.

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

వివరాలను పొందపరిచిన తరువాత ఉబర్ సర్వీసుకు సంబంధించి టర్మ్స్ ఇంకా ప్రైవసీ పాలసీలను నిశితంగా పరిశీలించి ఆ తరువాత సైనప్ బటన్ పై క్లిక్ చేయండి.

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

ఇప్పుడు మీ ఉబెర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓపెన్ చేసిన అకౌంట్‌కు సంబంధించిన వివరాలు మీరు జత చేసిన ఈమెయిల్ అకౌంట్‌కు పంపబడతాయి.

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

 ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ అప్లికేషన్ స్టోర్ నుంచి, బ్లాక్‌బెర్రీ యూజర్లు బ్లాక్‌బెర్రీ యాప్ వరల్డ్ నుంచి ఉబర్ అప్లికేషన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

ఉబర్ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తరువాత మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కండి.

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

యాప్‌లోకి లాగిన్ అయిన తరువాత మీ ప్రాంతాన్ని బట్టి ఉబర్ రకరకాల కార్ సర్వీసులను అందిస్తుంది. వాటిలో మీకు నచ్చిన క్యాబ్ సర్వీసును పొందవచ్చు.

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

మీకు నచ్చిన క్యాబ్ సర్వీసును ఎంచుకున్న తరువాత మీరు ఉన్న ప్రదేశాన్ని యాప్‌లో మార్క్ చేయండి. మీకు అత్యంత చేరువలో ఉన్న కారు ఎక్కడుందో తెలిసిపోతుంది. అంతేకాకుండా డ్రైవర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

 యాప్‌లో మీరు ఉన్న ప్రదేశాన్ని మార్క్ చేయటం ద్వారా యాప్ సాయంతో డ్రైవర్ మిమ్మల్ని చేరుకోగలగుతారు.

ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్

ఎక్కడికి వెళ్లాలో ముందుగా చెప్పవల్సిన అవసరం లేదు. దిగిన తరువాత డ్రైవర్లకు ఏ విధమైన పేమెంట్ చెల్లించాల్సి అవసరం లేదు మొత్తం పేమెంట్ క్రెడిట్ కార్డ్ ద్వారానే జరిగిపోతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్స్‌ను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో పొందవచ్చు. 

https://www.facebook.com/GizBotTelugu

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Uber providing free WiFi in cabs. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot