రసకందాయానికి రాసలీలల గుట్టు

|

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోన్న యాష్లే మాడిసన్ డేటింగ్ వెబ్‌సైట్ హ్యాకింగ్ భాగోతం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ అక్రమ సంబంధాల వెబ్‌సైట్‌లోని సభ్యులకు సంబంధించిన చాటు మాటు వ్యవహారాలను చాకిచక్యంగా దొంగిలించిన హ్యాకర్లు దశలు వారీగా ఆ డేటాను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తున్నారు.

Read More:శవాలతో పరాచకాలా

మొదటి సారిగా కొద్ది రోజుల క్రితం లీక్ చేసిన డేటాలో సుమారు 36 మిలియన్ల మంది ప్రొఫైల్స్‌కు సంబంధించిన సమాచారం ఉండగా, తాజాగా ఇంటర్నెట్‌లో విడుదల చేసిన 20 జీబిల నిడివిగల డేటాలో వెబ్‌సైట్‌కు సీఈఓకు సంబంధించిన ఈ-మెయిల్స్‌తో పాటు మొత్తం కంపెనీకి సంబంధించిన సోర్స్ కోడ్స్ ఉన్నట్లు ఇంటర్నెట్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Read More: మోజు .. వీళ్లకు తగ్గింది, వాళ్లకి పెరిగింది

హ్యాకర్లు ఈ డేటాతో పాటుగా అవిడ్ లైఫ్ మీడియా సీఈఓ నోయిన్ బైడర్ మాన్‌ను టార్గెట్ చేస్తూ "Hey Noel, you can admit it's real now." పేరుతో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై ఇప్పటికే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దర్యాప్తును ముమ్మం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

స్పూఫ్ ఇ-మెయిల్స్ ఈమెయిల్ అకౌంట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు మోసపూరిత డేటాతో కూడిన స్పూఫ్ ఇ-మెయిల్స్‌ను నెటిజనుల అకౌంట్లకు పంపుతున్నారు. వీటిని అసలు నమ్మకూడదు.

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

ప్రముఖ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్న హ్యాకర్లు సదరు వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి విజిటర్ల పై మాల్వేర్‌తో దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి నకిలీ వెబ్‌సైట్స్ అలాను నకిలీ యాప్స్ జోలికి వెళ్లొద్దు. httpsతో మొదల్యే వెబ్ లింక్ బ్రౌజింగ్‌కు ఎంతో శ్రేయస్కరం.

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

మోసపూరిత డిస్కౌంట్ ధరలు ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు భారీ డిస్కౌంట్ ధరలతో అనేక యాడ్ లింక్‌లు మనకు కనిపిస్తుంటాయి. ఈ లింక్స్ సురక్షితం కాదు.

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కాస్త చెబుతారా అంటూ తియ్యని మాటలతో కూడిన ఫేక్ కాల్స్ ఒకోసారి వస్తుంటాయి. సాధారణంగా ఏ బ్యాంక్ వారు ఇలాంటి ఫోన్ కాల్స్ చేయరు. కాబట్టి ఇటివంటి నకిలీ కాల్స్‌కు స్పందించకండి.

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

ముందుగా మీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. కుడివైపు టాప్ మెనూ బార్‌లో కనిపించే అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ గూగుల్ డేటాా కోసం ఆరు ముఖ్యమైన చిట్కాలు

మీ గూగుల్ డేటాా కోసం ఆరు ముఖ్యమైన చిట్కాలు

ఆ తరువాత కనిపించే పేజీలో కనిపించే సెక్యూరిటీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపించే పాస్‌వర్డ్ డైలాగ్ బాక్స్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ పక్కన కనిపించే "Setup" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత కనిపించే పేజీలో "Start setup" బటన్ పై క్లిక్ చేసినట్లయితే టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మీ గూగుల్ డేటాా కోసం ఆరు ముఖ్యమైన చిట్కాలు

మీ గూగుల్ డేటాా కోసం ఆరు ముఖ్యమైన చిట్కాలు

టూ స్టెప్ వెరిఫికేషన్ కోడ్‌ను యాక్టివేట్ చేసుకునే క్రమంలో ప్రతిసారి వెరిఫికేషన్ కోడ్ అందవల్సిన ఫోన్ నెంబర్‌ను మీరు ఎంటర్ చేయవవల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను బట్టి ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ రూపంలో మీ ఫోన్‌కు అందుతుంది.

మీ గూగుల్ డేటాా కోసం ఆరు ముఖ్యమైన చిట్కాలు

మీ గూగుల్ డేటాా కోసం ఆరు ముఖ్యమైన చిట్కాలు

తక్షణమే, మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ రూపంలో 6 అంకెలతో కూడిన వెరిఫికేషన్ కోడ్ అందుతుంది. ఆ కోడ్‌ను మీరు Enter verification code ఆప్షన్ ప్రక్కన కనిపించే ఖాళీ బాక్సులో ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

మీ గూగుల్ డేటాా కోసం ఆరు ముఖ్యమైన చిట్కాలు

మీ గూగుల్ డేటాా కోసం ఆరు ముఖ్యమైన చిట్కాలు

తరువాత ప్రత్యక్షమయ్యే Trust this computer బాక్సులో "Next" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసేందుకు "Confirm" ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే మీ గూగుల్ అకౌంట్‌కు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ అమలైనట్లే.

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పొంచి ఉన్న ముప్పు

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పొంచి ఉన్న ముప్పు

2012-13 మధ్యలో ఆండ్రాయిడ్ మాల్వేర్ 63 శాతానికి పెరిగినట్లు యాంటీ - వైరస్ సాఫ్ట్‌వేర్ ఇంకా ఇంటర్నెట్ ప్రొటెక్షన్‌లను సమకూర్చే ఇఎస్ఇటీ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అత్యధికంగా హ్యాక్ చేయబడిన ఆపరేటింగ్ సిస్టం కూడా ‘ఆండ్రాయిడే' అని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పొంచి ఉన్న ముప్పు

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పొంచి ఉన్న ముప్పు

కొత్తగా కనుగొన్న 99శాతం మొబైల్ మాలీషియస్ ప్రోగ్రామ్‌లలో 99 శాతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ను టార్గెట్ చేసినవేనని క్యాస్పర్ స్కై సెక్యూరిటీ తన నివేదికలో పేర్కొంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పొంచి ఉన్న ముప్పు

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పొంచి ఉన్న ముప్పు

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌‌ను విశ్లేషించినట్లయితే 80శాతం మార్కెట్‌ను ఆండ్రాయిడ్ శాసిస్తోంది. ఈ నేపధ్యంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లపై వైరస్ దాడులు పెరిగిపోయాయి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పొంచి ఉన్న ముప్పు

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పొంచి ఉన్న ముప్పు

ప్రమాదకర వైరస్‌ల నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను రక్షించుకునేందుకు యూజర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి. https://www.facebook.com/GizBotTelugu

కెనడాకు చెందిన అష్లీ మాడిసన్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ డేటింగ్ సర్వీసును అందిస్తుంది. వివాహితులకు మాత్రమే అనుమతి. ముందుగా ఈ వెబ్‌సైట్‌లో రిజస్టర్ అయి నచ్చిన వారితో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది ఈ వెబ్‌సైట్‌ను వినియోగిస్తున్నారు. ప్రతినెలా 12 కోట్ల మంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. పెద్దవాళ్లకు మాత్రమే అనే వెబ్ సైట్స్‌ల్లో దీని ర్యాంకు 18. జీవితం చిన్నది.. ఓ ఎఫైర్‌ను కలిగి ఉండండి అనేది దీని స్లోగన్. 2001లో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్ 46 దేశాల్లో క్రీయాశీలకంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అష్లీ, మాడిసన్ అనే స్త్రీల పేర్లతో ఈ సైట్‌కు పేరు పెట్టారు.

Best Mobiles in India

English summary
Ashley Madison latest leak is double in size and allegedly contains CEO Noel Biderman’s emails. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X