సముద్రం లోపల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు

By Hazarath
|

మైక్రోసాఫ్ట్ ప్రపంచ టెక్ కంపెనీ దిగ్గజాలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా సముద్రం అడుగున డేటాసెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సరికొత్త వ్యూహాలకు తెరలేపింది. ఇక ఈ ప్రాజెక్ట్ కు నాటిక్ అనే పేరు కూడా పెట్టింది. అంతేకాకుండా డేటాకు సంబంధించి ప్రయోగాలు కూడా జరిపింది. మొత్తానికి సముద్రం లోపల డేటాసెంటర్లు ఏర్పాటుపై ప్రయోగం జరిపిన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ మొదటిస్థానంలో నిలిచింది.

Read more: అమ్మాయిల మధ్యలో నేనొక్కడినే : బిల్‌గేట్స్

ప్రాజెక్ట్ నాటిక్ పేరుతో తొలిసారిగా సముద్రం అడుగుభాగాన

ప్రాజెక్ట్ నాటిక్ పేరుతో తొలిసారిగా సముద్రం అడుగుభాగాన

ప్రాజెక్ట్ నాటిక్ పేరుతో తొలిసారిగా సముద్రం అడుగుభాగాన డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు మైక్రోసాప్ట్ నడుం బిగించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ప్రయోగం జరిపింది. మొత్తానికి మీ డేటా ఎల్లప్పుడూ కూల్ గా ఉండే విధంగా ఇలా సముద్రం అడుగుభాగాన డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.

ప్రాజెక్ట్ నాటిక్ అంటే మసాచుసెట్స్ లో ని ఓ నగరం పేరు

ప్రాజెక్ట్ నాటిక్ అంటే మసాచుసెట్స్ లో ని ఓ నగరం పేరు

అయితే ప్రాజెక్ట్ నాటిక్ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా..ఇందులో ప్రత్యేకత ఏమీలేదు. దీనికి వేరే అర్థం కూడా ఏమీ లేదు. ఇది మసాచుసెట్స్ లో ని ఓ నగరం పేరు. గత అయిదేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ మీద పనులు జరుగుతున్నాయి

20 సంవత్సరాల పాటు దీని జీవిత కాలం ఉండేలా

20 సంవత్సరాల పాటు దీని జీవిత కాలం ఉండేలా

20 సంవత్సరాల పాటు దీని జీవిత కాలం ఉండేలా తయారుచేస్తున్నారు. ఆ తరువాత దీన్ని రీ సైక్లింగ్ చేయడం లేకుంటే మరేదైనా చేయడం చేస్తారు. ప్రస్తుతానికి దీని జీవిత కాలం 20 సంవత్సరాలని తెలుస్తోంది.

ఫసిపిక్ మహా సముద్రంలో ఈ పరీక్షను

ఫసిపిక్ మహా సముద్రంలో ఈ పరీక్షను

ఎక్స్ బాక్స్ గేమ్ ద్వారా ఫసిపిక్ మహా సముద్రంలో ఈ పరీక్షను నిర్వహించారు. యునైటైడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా దగ్గర ఉన్న ఫసిపిక్ మహా సముద్ర తీరప్రాంతంలో దాదాపు కిలోమీటర్ మేర గతేడాది ఆగస్టు నుండి నవంబర్ వరకు దీనికి సంబంధించిన పరీక్షలను జరిపారు.

ఇక్కడే సముద్రంలో 30 అడుగుల లోతులో డేటా సెంటర్ ను

ఇక్కడే సముద్రంలో 30 అడుగుల లోతులో డేటా సెంటర్ ను

ఇక్కడే సముద్రంలో 30 అడుగుల లోతులో డేటా సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 105 రోజులు పాటు పని చేయనుంది. కేవలం ఇది ట్రయల్ మాత్రమేనని వారంటున్నారు. ఇందులో భాగంగా 8 అడుగుల మెటల్ యూనిట్ ను సముద్రం లోపలికి ప్రవేశపెట్టారు. దీని నుంచి వచ్చే సంకేతాలను దాని పనితీరును శాస్ర్తవేత్తలు ఇప్పటినుండి పరిశీలించనున్నారు.

ప్రపంచంలోనే తొలి జలాంతర్గామి డేటా సెంటర్ గా

ప్రపంచంలోనే తొలి జలాంతర్గామి డేటా సెంటర్ గా

ఇది కాని విజయవంతమయితే ప్రపంచంలోనే తొలి జలాంతర్గామి డేటా సెంటర్ గా నిలుస్తుంది. అయితే ఇప్పటికే కొన్ని టెక్ కంపెనీలు డేటా సెంటర్లను ప్రవేశపెట్టినప్పటికీ వాటికి ఈ డేటా సెంటర్ కు విద్యుత్ విషయంలో, కండీషన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉంది.

గూగుల్ కూడా పోర్ట్ లాండ్ లో నీటిమీద తేలియాడే డేటాసెంటర్ ను

గూగుల్ కూడా పోర్ట్ లాండ్ లో నీటిమీద తేలియాడే డేటాసెంటర్ ను

ఉదాహరణకు నాటిలస్ టెక్నాలజీ నీటి మీద తేలియాడే డేటా సెంటర్ ను యుఎస్ ఆర్మీ కోసం నిర్మించింది. అలాగే గూగుల్ కూడా పోర్ట్ లాండ్ లో నీటిమీద తేలియాడే డేటాసెంటర్ ను నిర్మించింది. వీటికి మైక్రోసాప్ట్ నిర్మిస్తున్న డేటా సెంటర్లకు తేడా చాలానే ఉందని రీసెర్చ్ అధికారులు చెబుతున్నారు

విద్యుత్ ప్రసారం కావాలంటే వాటికి చాలా ఎక్కువ స్థాయిలో ఇంధనం

విద్యుత్ ప్రసారం కావాలంటే వాటికి చాలా ఎక్కువ స్థాయిలో ఇంధనం

సబ్ మెరైన్లు కాని నీటిమీద తేలియాడే డేటాసెంటర్లు కు విద్యుత్ ప్రసారం కావాలంటే వాటికి చాలా ఎక్కువ స్థాయిలో ఇంధనం కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు బయట నుంచే వచ్చే గాలిలో కన్నా సముద్రంలోనే చల్లదనం ఎక్కువగా ఉంటుంది. 

తమ డేటా సెంటర్లను బయట నుంచే వచ్చే గాలితో నడిచేలా

తమ డేటా సెంటర్లను బయట నుంచే వచ్చే గాలితో నడిచేలా

ఇప్పుడు అదే పరిస్థితి ఇతర టెక్ కంపెనీలది. ఈ కంపెనీలు తమ డేటా సెంటర్లను బయట నుంచే వచ్చే గాలితో నడిచేలా ఏర్పాటుచేసాయి. అయితే మైక్రోసాప్ట్ మాత్రం సముద్రంలోపల నుంచే దానికి గాలి అందేలా ఏర్పాట్లు చేస్తోంది.

2013లో నార్త్ స్వీడన్ లో ఫేస్‌బుక్ తన డేటా సెంటర్ ను

2013లో నార్త్ స్వీడన్ లో ఫేస్‌బుక్ తన డేటా సెంటర్ ను

2013లో నార్త్ స్వీడన్ లో ఫేస్‌బుక్ తన డేటా సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఇది మైనింగ్ ప్రాంతమయిన లూలేలో ఉంది.ఆర్కిటిక్ సర్కిల్ కు 60 మైళ్ల దూరంలో ఉంటుంది. దాదాపు 84 ఎకరాల విస్తీర్ణంలో వేలాది కంప్యూటర్ సర్వర్లను రన్ చేస్తోంది. విద్యుత్ కోసం అక్కడ దగ్గర్లో హైడ్రో ఎలక్ట్రికల్ మీద ఆధారపడుతూ వస్తోంది,

ప్రకృతికి ఎటువంటి హనీ జరగకుండా

ప్రకృతికి ఎటువంటి హనీ జరగకుండా

ప్రకృతికి ఎటువంటి హనీ జరగకుండా అలాగే అత్యంత వేగవంతమైన ప్రొవెజనింగ్ తో అలాగే తక్కువ బడ్జెట్ లో ఈ డేటా సెంటర్లను సముద్రం అడుగు భాగాన ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ఎందుకు అంటే

ఈ ప్రాజెక్ట్ ఎందుకు అంటే

ప్రపంజ జనాభాలో చాలామంది తీర ప్రాంతాల్లోనే 125 కిలోమీటర్ల మేర నివసిస్తూ ఉన్నారు.వీరందరి డేటాను అత్యంత త్వరగా తీసుకోవడానికి దగ్గరలోని సముద్రంలోనే ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు రీసెర్చ్ అధికారులు తెలుపుతున్నారు.

ఉద్గారాలు జీరో శాతం మాత్రమే ఉండే అవకాశం

ఉద్గారాలు జీరో శాతం మాత్రమే ఉండే అవకాశం

మరో కారణమేమిటంటే ఈ డేటా సెంటర్లను సముద్రం అడుగున ఏర్పాటు చేయడం ద్వారా బయట వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉందని వారంటున్నారు. ఉద్గారాలు జీరో శాతం మాత్రమే ఉండే అవకాశం ఉందని మైక్రోసాప్ట్ తెలియజేస్తోంది.

 స్టీల్ వస్తువులతో కూడిన మానిటర్లను సముద్రంలో ప్రవేశపెట్టేందుకు

స్టీల్ వస్తువులతో కూడిన మానిటర్లను సముద్రంలో ప్రవేశపెట్టేందుకు

సమర్థవంతమైన ఇంధనం ద్వారా డేటాను మరింతగా పెంచేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తున్నామని, ఇందుకోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నామని యాజమాన్యం చెబుతోంది. స్టీల్ వస్తువులతో కూడిన మానిటర్లను సముద్రంలో ప్రవేశపెట్టేందుకు పర్యావరణానికి శాఖ నుంచి అనుమతులు తీసుకోవడం కూడా జరిగిందని అధికారులు చెబుతున్నారు.

మైక్రోసాప్ట్ అలా కాకుండా ఓ కొత్త ఎనర్జీ మీద

మైక్రోసాప్ట్ అలా కాకుండా ఓ కొత్త ఎనర్జీ మీద

టెక్నాలజీలో పచ్చదనాన్ని చూపించే సంస్థల వార్షిక నివేదికలను చూస్తే వాటిల్లో ముందు మైక్రోసాప్ట్ ఉంటుందని దీన్ని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సముద్రం అడుగున డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలంటే ఎంతో ఎక్కువగా పవన్ విద్యుత్ ను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మైక్రోసాప్ట్ అలా కాకుండా ఓ కొత్త ఎనర్జీ మీద దృష్టి సారిస్తోంది.

ఆపిల్ ,గూగుల్ , ఫేస్ బుక్ లాంటి సంస్థలు

ఆపిల్ ,గూగుల్ , ఫేస్ బుక్ లాంటి సంస్థలు

ఆపిల్ ,గూగుల్ , ఫేస్ బుక్ లాంటి సంస్థలు డేటా సెంటర్లను ఏర్పాటు చేయడంలో మైక్రోసాప్ట్ కు ఇప్పటికే చాలా దూరంలో ఉన్నాయని కంపెనీకి గ్రీన్ పీస్ వాతావరణ పరిశోధకులు టామ్ తెలిపారు. చాలా టెక్ సంస్థలు కూల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయని ఇది హర్షించదగ్గపరిణామమని ఆయన అన్నారు.

ఇండియాలో అలాగే యుఎస్ లో సౌత్ కొరియాలో ఈ డేటా సెంటర్లను

ఇండియాలో అలాగే యుఎస్ లో సౌత్ కొరియాలో ఈ డేటా సెంటర్లను

ఇండియాలో అలాగే యుఎస్ లో, సౌత్ కొరియాలో ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అమెజాన్ అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పుడు సముద్రంలో పెట్టిన డేటా సెంటర్ తో మైక్రోసాఫ్ట్ మరింత వేగవంతంగా ముందుకు దూసుకువెళ్లినా ఆశ్చర్యపడనవసరం లేదు.

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Under the Sea: Microsoft testing underwater data centers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X