ఈ వైర్లు తెగితే చాలు, ప్రపంచం చీకటిలోకి వెళుతుంది,షాకింగ్ నిజాలు

సముద్రం అడుగుభాగాన ఎన్నో ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు.

By Gizbot Bureau
|

సముద్రం అడుగుభాగాన ఎన్నో ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. ఇవి కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తుంటాయి.అయితే ఈ కేబుల్స్ ప్రధానంగా అట్లాంటిక్ సముద్రంలోనే చాలావరకు ఉన్నాయి. సముద్రంలో వేసిన వైర్లతోనే ప్రపంచంలోని అన్ని దేశాల సమాచార వ్యవస్థ నడుస్తోంది. మరి ఈ కేబుల్స్ తెగిపోతే పరిస్థితి ఏంటీ. దేశాల సమాచార వ్యవస్థకు ఎటువంటి అంతరాయం కలుగుతుంది. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: సముద్రం చుట్టూ చైనా ఉరితాళ్లు పేనుతోంది

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

అప్పట్లో రష్యాకు చెందిన జలాంతర్గాములు అట్లాంటిక్ సముద్రంలో అండర్‌వాటర్ కేబుల్స్ ఉన్న కీలక ప్రాంతాల్లో తిష్టవేశాయని అమెరికా ఆరోపించింది .ఒకవేళ సబ్‌మెరైన్లు ఈ కేబుల్ లింకులను తెంచేస్తే ఇంటర్నెట్ సేవలకు పెద్ద అంతరాయమే ఏర్పడుతుందని ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

దీని వల్ల అంతర్జాతీయ సంబంధాలు, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుందని అన్ని దేశాలు ఎప్పుడూ కలవరపడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ వైర్ల నుంచే ప్రపంచంలో మొత్తం సమాచార వ్యవస్థ నడుస్తోంది.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

తీరం దగ్గర ఉన్న కేబుల్స్ ఒకవేళ తెగినా వాటిని రిపేర్ చేయడం సులభమే. కానీ సముద్రం మధ్యలో ఉన్న కేబుల్స్‌ను రిపేర్ చేయడం కష్టంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి అక్కడ కేబుల్స్ తెగిపోతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకమే.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

మానవుల సంగతి పక్కన బెడితే గతేడాది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ను సొర చేపలు కలవరపాటుకు గురిచేసాయి. ప్రపంచదేశాలకు ఇంటర్నెట్ అనుసంధానం కోసం సముద్రం అడుగుభాగాన గూగుల్ అమర్చిన కేబుల్ వ్యవస్థను ప్రమాదకర సొరచేపలు ధ్వంసం చేశాయి. దీంతో ఒక్కసారిగా గూగుల్ షాక్‌కు గురయి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ భయానక సముద్ర జీవుల నుంచి తమ కేబుళ్లను కాపాడుకునేందుకు గూగుల్, ఓ రక్షణాత్మక వ్యవస్థను రూపొందించింది. సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఫైబర్ కేబుళ్లకు కెవ్లార్ (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే పదార్థం) తరహా తొడుగును గూగుల్ వర్గాలు అమర్చే పనిలో పడ్డాయి.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

సొర చేపలు వైర్లను ధ్వసం చేయకుండా ఉండేందుకు కేబుల్స్‌కు పైపూతగా కేవ్లార్ అనే సింథటిక్ ఫైబర్‌ను పైపొరగా వాడినా ఫలితం ఉండట్లేదని గూగుల్ కలవరపడింది కూడా. అదీగాక ఈ సరికొత్త రక్షణాత్మక వ్యవస్థను అత్యంత కఠినమైనదని గూగుల్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ విషయం 1980-90 మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చింది.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

మరి కేబుల్స్ సొర చేపలు ఎందుకు కొరికేస్తున్నాయంటే అదీ విచిత్రమే. కేబుల్స్ వల్ల స్వల్ప అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. అయితే ఆహార వేట కోసం సొరచేపల నోటిలో అయస్కాంత క్షేత్రాలను గుర్తించే సెన్సర్లు ఉండటంతో అవి ఈ కేబుల్స్‌ను గుర్తించి దాడి చేస్తున్నాయట.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఇక హాంగ్‌కాంగ్‌కి సైతం అమెరికాతో ఈ తిప్పలు తప్పలేదు. హాంగ్ కాంగ్ లో Pacnet కంపెనీకి హెడ్ క్వార్టర్‌లోని కంప్యూటర్లను అమెరికా ప్రభుత్వ గూఢచారులు హ్యాక్ చేశారని స్నోడెన్ తెలిపాడు. 2009లో Pacnet కంప్యూటర్లపై గూఢచారులు దాడి చేశారని అయితే ఆ తర్వాత మళ్ళీ దాడి చేయలేదని బాంబు పేల్చారు.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

Pacnet అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విస్తరించిన భారీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ నిర్మాణాలకు సొంతదారు. దీనికి హాంగ్ కాంగ్, సింగపూర్ లలో గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కంపెనీ ఆధీనంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ సముద్రం అడుగున దాదాపు 46,000 కి.మీ విస్తరించి ఉన్నాయి.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ కేబుల్స్‌ను ఆసియా-పసిఫిక్ దేశాలలో విస్తరించిన ప్రభుత్వ మరియు ప్రైవేటు బహుళజాతి టెలికాం కంపెనీలు వినియోగిస్తాయి. ఈ కేబుల్స్ ను హ్యాక్ చేయగలిగితే ఆసియా-పసిఫిక్ దేశాల కమ్యూనికేషన్ల వ్యవస్థను ఈజీగా తెలుసుకోవచ్చు.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

అమెరికా, బ్రిటన్ గూఢచార కంపెనీలు ఆ మధ్య చేసింది కూడా అదే. చైనా, హాంగ్ కాంగ్, కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్ తదితర దేశాలు ఈ నెట్ వర్క్‌ను వినియోగిస్తున్నాయని తెలిసి అమెరికా ఈ కేబుల్స్ ని హ్యాక్ చేసి ఆ దేశాల సమాచారాన్ని సేకరించాలని ప్రయత్నించింది.

 ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఇక 2008 సంవత్సరంలో కూడా ఈ కేబుల్స్ వల్ల తీవ్ర అంతరాయం జరిగింది. మధ్యధరా సముద్రంలో వున్న ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ తెగిపోయాయి! దెబ్బతో ఇండియాతో సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తూ ఉన్న నెట్‌వర్క్‌లన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి . ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే పలు రంగాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.

 ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

మాములుగా సముద్ర గర్భంలోని కేబుల్స్ భారీ చేపల వల్లా, నౌకల లంగర్లవల్లా, అలాగే సముద్రంలో వచ్చే ఉపద్రవాలవల్ల అప్పుడప్పుడూ తెగిపోతూంటాయి. ఐతే బ్యాకప్‌గా అదనపు లైన్లుండటం వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతగా అంతరాయం ఏర్పడదు.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

అయితే దురదృష్టం కొద్దీ 2008లో ఫిబ్రవరి నెలలో ప్రధాన కేబుల్ కాదు, బ్యాకప్ కేబుల్స్ కూడా తెగిపోయాయి. దాంతో అనేక దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయింది.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

సముద్రగర్భంలో తెగిపోయిన ఈ ఇంటర్నెట్ కేబుళ్లను పునరుద్ధిరించే పనిని ఫ్లాగ్ టెలీకాం తీసుకుంది. అయితే ఈ నౌకలు వల్ల కూడా వైర్లు తెగిపోయిన సంధర్భాలు ఉన్నాయి. జనవరి 30వ తేదీన ఈజిప్ట్ నగరమైన అలెగ్జాండ్రియా తీరానికి 56 కిలోమీటర్ల దూరంలో ఒక నౌక సముద్రంలో లంగరు వేసే ప్రయత్నంలో కేబుళ్లు తెగిపోయాయి.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ ఘటనలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సబ్సిడరీ అయిన ఫ్లాగ్ టెలీకాం సంస్థకు చెందిన రెండు కేబుళ్లు తెగిపోయాయి. దీనిపై ఫ్లాగ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేబుళ్ల పునరుద్ధరణ దిశగా మరమ్మతు చర్యలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు తెలిపారు కూడా.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

మాములుగా ఇంటర్నెట్ కార్యకలాపాల్లో 95 శాతం సముద్రగర్భ కేబుళ్ల ద్వారా సాగుతుండగా, మిగిలిన పనులు ఉపగ్రహ అనుసంధానంతో కొనసాగుతున్నాయి. మరి వీటిని కంట్రోల్ చేయడానికి అగ్రదేశాలు కుయుక్తులు పన్నితే మరో యుద్ధం వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఇక్కడ మీరు చూస్తున్నది సబ్ మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్. దీని అడ్డుకొలత 69 మిల్లీమీటర్లు(అంటే 2.7 ఇంచ్లు). ఇది ఒక్క అంటార్కిటికా‌ను తప్ప ప్రపంచములోని 99 శాతం అంతర్జాతీయ ఇంటర్నెట్, టెలిఫోన్ మరియూ ప్రైవేట్ డాటా ట్రాఫిక్‌ను ప్రపంచ నలుమూలాలలనూ కలుపుతుంది.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఎన్నో సముద్రాలను దాటుతూ కొన్ని వేల కిలోమీటర్ల దూరం వేయబడింది. ఈ వైరుకి ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచంలోని మొత్తం సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది కూడా. సముద్రంలో వైర్లకు ఏ ప్రమాదం జరిగినా దేశాలన్నీ ఛిన్నా భిన్నం అయిపోవాల్సిందే.

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..

ప్రపంచదేశాలను కలిపే అత్యంత పెద్ద నెట్ వర్క్ ఇదే .

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Underwater internet cables could be the next target in tech warfare

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X