సైబర్ నిప్పు రాజుకుంది

Posted By:

చైనా యుఎస్ దేశాల మధ్య సైబర్ వార్ కు తెరలేవనుందా.. చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటనతో ఇరు దేశాల మధ్య సైబర్ వార్ పై తీవ్ర చర్చలు జరగనున్నాయా అంటే అవుననే తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. చైనా సైబర్ దాడులతో అన్ని దేశాలను హడలెత్తిస్తోందని ఈ చర్య చాలా భయంకరమైనదని దీన్ని మానుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుసాన్ తెలిపారు. మిగతా కధనం కింది స్లైడర్ లో చదవండి.

Read more: కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతకన్నా ముందే వార్నింగ్

25 నుంచి జిన్ పింగ్ చైనా పర్యటన ఉన్నందున అంతకన్నా ముందే వార్నింగ్ ఇచ్చారు. సైబర్ దాడులు ఆపకపోతే ఇరే దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదముందని , జిన్ పింగ్ చైనా పర్యటనలో ఒబామా తన వైట్ హౌస్ లో ఇదే విషయంపై ఆయనతో చర్చించాలని కోరారు. అయితే దీనికి చైనా అధ్యక్షుడు కూడా ధీటుగానే బదులిచ్చారు. చైనా సైబర్ దాడులు చేయడం లేదని అసలు అటువంటివి చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సాహించదని వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన లేఖలో ఆయన తెలిపారు. మేమే అటువంటి చర్యలను ఉపేక్షించమని మాకు ఆ అవసరం లేదని ఆ లేఖలో తెలిపారు.

సముద్ర గర్భంలో చైనా తన గోడలను అత్యంత సీక్రెట్ గా నిర్మిస్తూ పోతోంది

దీనిపై సుసాన్ స్పందిస్తూ మేము దీనికి సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నామంటూ.. సముద్ర గర్భంలో చైనా తన గోడలను అత్యంత సీక్రెట్ గా నిర్మిస్తూ పోతోందని ఈ విషయం బయటి ప్రపంచానికి కూడా తెలియదని ఆమె మరో బాంబు పేల్చారు. దీనికి సంబంధించి కూడా చైనా అధ్యక్షుడు గట్టిగానే సమాధానం ఇచ్చారు. అది చైనా ప్రయోజనాలకోసమేనని ఐస్ లాండ్ తో చైనా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికేనన్నారు. అంతే తప్ప మాకు ఏ దేశం టార్గెట్ కాదని చెబుతున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియదు కాని వార్ మరింతగా రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సుసాన్ ఈ విషయం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఒబామా చెవిలో వేశారు.

సైబర్ నేరాల భవిష్యత్ ముఖచిత్రం

జిన్ పింగ్ పర్యటనలో ఈ విషయాలపై తాడో పేడో తేల్చుకోవాలని ఒబామాకు సూచించారు. ఇప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే దేశాల మధ్య యుద్ధాలకు సైబర్ క్షేత్రాలే వేదికలవుతాయనడానికి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరాల భవిష్యత్ ముఖచిత్రం ప్రపంచాన్ని భయపెడుతోంది.

చైనా సైబర్ దాడి చేయడం లేదా..?

చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని ఫైర్ ఐ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఏపీటీ30 అనే సంస్థ ద్వారా చైనా ప్రభుత్వం కీలకమైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై నిఘా ఉంచిందని ఫైర్ ఐ ఓ నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడటం ద్వారా ఏపీటీ 30 కీలకమైన సమాచారాన్ని సేకరించి చైనాకు అందజేస్తోందని పేర్కొంది. అయితే, నిఘా ఆరోపణలను చైనా ఖండించింది. భారత్ తో సహా ఆసియా దేశాలపై చైనా ఎలాంటి నిఘా కార్యకలాపాలకు పాల్పడటం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారప్రతినిధి ప్రకటించారు.

పలు దేశాలపై సైబర్ దాడి

భారత్ తోపాటు పలు ఆసియా దేశాలపైనా చైనా పదేళ్లుగా గూఢచర్యం జరుపుతున్నట్లు తెలిపింది. భారత్, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, నేపాల్, సింగపూర్, ఇండోనేషియా లాంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని గూఢచర్యం సాగించినట్లు వెల్లడించింది. కాగా, తమ దేశంపై గూఢచర్యం చేస్తున్న ఉపగ్రహాలను కనుగొన్నామని రష్యా ప్రకటించింది.

అమెరికాకు సైబర్ దాడి అంటే తెలీదా..?

అమెరికా గూఢాచార శాఖ చైనా ఆర్ధిక పరమైన విషయాలపై బాగా దృష్టిపెట్టి రహస్య నివేదికలను తెప్పించుకుంటోందని చైనా ఆరోపిస్తోంది. ఎన్‌ఎస్‌ఏ వార్తా సంస్థ వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు మెయిల్‌ ద్వారా అమెరికా గూఢాచారి నివేదిక వివరాలు పంపడంతో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ దిశలో బ్రెజిల్‌లోని అతి పెద్ద చమురు సంస్థ పెట్రోబ్రాస్‌, చైనాలో నిర్వహించిన ఆర్ధిక సమావేశాలు, అక్కడా ఇంకా ఇతర దేశాలలో క్రెడిట్‌ కార్డు బ్యాకింగు పద్ధతులు, మైక్రోసాఫ్ట్‌ గూగుల్‌ ఐఎంఎఫ్‌ వంటి సంస్థల సహకారాలు మొదలగు అంశాలన్నిటిపైనా రహస్య పరిశీలన సాగుతోందని ఎన్‌ఎస్‌ఏ తెలిపింది.

చైనా ఏం చేస్తోందో తెలుసుకోవడానికేనా..?

అయితే ఇదంతా ప్రపంచంలో జరుగుతున్న ఆర్దిక కార్యకలాపాల గురించి తెల్సుకోవడమే నని అమెరికా చెబుతున్నా గాని దానివల్ల అమెరికాకు వీసమెత్తు ఉపయోగం లేదని అదంతా చైనా ఏం చేస్తోందో తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతోందని ఎఎస్‌ఏ సంస్థ వెల్లడించింది. రాబోయే కాలంలో భారత్‌, రష్యా, చైనాలు శాస్త్ర సాంకేతిక రంగాలలో బాగా ఎదుగుతాయని ఇంటిలిజెన్సు నివేదిక చెబుతోంది. 2025నాటికి అమెరికాకు అభివృద్ధి కోణంలో ఈ దేశాలు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. టెక్నాలజీ, సమాచార వ్యవస్థ, ఇంధనం, విద్యుత్తు, మెడిసిన్‌, నానో టెక్నాలజీ రంగాలలో అమెరికాకు ఈ దేశాలు పెద్ద సవాలుగా పరిణమిస్తాయి. అని నివేదిక తెలియజెప్పింది.

పది 20ఏళ్ల కాలంలో సైబర్ పోటీ

రానున్న పది 20ఏళ్ల కాలంలో ఈ పోటీ ఏర్పడుతోంది కనుక ఇప్పటినుంచే తగిన ప్రణాళకలు వేసుకుని ఇబ్బందులను అధిగమించవచ్చని నివేదికలో డిఎన్‌ఐ తన దేశమైన అమెరికాకు వివరించింది. ఇతర దేశాల రహస్యాలపై భారీ ఎత్తున నిఘా ఉంచుతున్న అమెరికా ఇతర దేశాలపై అదే తరహా ఆరోపణలు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఈ తరహా ఆరోపణలతోనే చైనాకు చెందిన కొందరు సిబ్బందిని బహిష్కరించింది. ఆ మర్నాడే న్యూయార్కు టైమ్స్‌ పత్రికలో జస్టిస్‌ డిపార్టుమెంటుకు చెందిన మాజీ అదికారి గోల్డు స్మిత్‌తో పాటు ఇతర అధికారులు అమెరికా తన ప్రయోజనాల కోసం గూఢాచార్యం చేస్తోందని తెలిపారు. అదే సమయంలో కొన్ని ఇతర దేశాలు కూడా ఆ తరహా చర్యలు చేస్తున్నాయని చెప్పారు.

ఒబామా వద్దన్న చోటుకే మోడీ వెళ్తున్నారు

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న త‌న అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లోని ప్రసిద్ధ ‘వాల్ డార్ఫ్ అస్టోరియా' హోటల్ లో ఆతిథ్యం స్వీకరించనున్నారు. ఇదే హోటల్ లో బస చేసేందుకు గతంలో అమెరికా అద్యక్షుడు ఒబామా నిరాకరించడం గమనార్హం. ఆస్టోరియా హోటల్ ను 2014లో చైనాకు చెందిన బీమా కంపెనీ కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. తనపై నిఘా ఉంచవచ్చన్న ఉద్దేశంతోనే ఒబామా ఆస్టోరియా హోటల్ లో గడిపేందుకు అంగీకరించలేదు.

వైట్ హోస్ సీక్రెట్స్ పై కన్ను

ముఖ్యంగా వైట్ హౌస్ నుంచి దేశ రక్షణ విభాగానికి చెందిన సమాచారాన్ని చైనా సైబర్ నేరగాళ్లు దొంగిలించారన్న వార్తలు వచ్చిన తరువాత ఈ హోటల్ లో సైతం చైనా సైబర్ నిఘా ఉండవచ్చని యూఎస్ ప్రభుత్వ అధికారులు భావించారు. కాగా, భారత ప్రధాని మోడీతో పాటు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఇటువంటి భయాలేమీ లేవు. ఈ నెల 23 నుంచి 28 వరకూ అమెరికాలో గడపనున్న మోడీ ఇదే హోటల్ లో బస చేయనున్నారు

సైబర్తొ దాడులకు గురైన దేశాల్లో తొలి ఐదు దేశాల్లో భారత్

అయితే అనధికారిక సమాచారం ప్రకారం సైబర్ నేరాల ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉంది. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న తొలి 5 దేశాల్లో భారత్ ఒకటని సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ సంస్థ సిమాంటిక్(Semantic) వెల్లడించింది. నేరగాళ్ల నైపుణ్యం పెచ్చుమీరుతోందని రాన్సమ్ వేర్ (Ransomware), ఫిషింగ్ (phishing) ద్వారా అధిక నేరాలకు పాల్పడుతున్నారని 2013 నార్టన్ నివేదిక (Norton Report)లో తెలియజేసింది. ఆయా నేరాల్లో బాధితులు సగటున 12,500 రూపాయలు నష్టపోతున్నారని తెలిపింది. ఇంటర్నెట్ ద్వారా జరిగిన అక్రమ లావాదేవీల వల్ల దేశీయులకు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 24,400 కోట్ల) నష్టం జరిగిందని అంచనా వేసింది.

ప్రపంచ దేశాలు ఏటా 35,500 కోట్ల నుంచి లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టం

సైబర్ నేరాల వల్ల వ్యక్తిగతంగా నష్టం జరుగుతోంది. విలువైన పేటెంట్లు చోరీ చేయడం, ఆర్థిక సంస్థలను మోసం చేయడం, బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి నిధులు మళ్లించడం, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల నుంచి చోరీ, ఇతర అన్ని రకాల సైబర్ నేరాల వల్ల ప్రపంచ దేశాలు ఏటా 35,500 కోట్ల నుంచి లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టపోతున్నాయని అంచనా.

Stock Exchange లను వదల్లేదు

అగ్రరాజ్యానికి చెందిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ(నాస్ డాక్) కంప్యూటర్ వ్యవస్థలోకి సైబర్ నేరగాళ్లు 2010లోనే చొరబడ్డారని ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లు నిర్వహించే లావాదేవీలు గమనించేలా సమాచార వ్యవస్థలోకి ప్రత్యేకమైన మాల్ వేర్(malware) ను సైబర్ నేరగాళ్లు(cyber criminals) జొప్పించగలిగారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్(international organization of securities commission), వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ ఛేంజెస్ ఆఫీస్(world federation of exchanges office) లు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచంలోని 56 శాతం స్టాక్ ఎక్స్ ఛేంజీలు(stock exchanges) సైబర్ నేరాల బారిన పడ్డాయని నిర్ధారణయింది.

డీఎన్ఎస్ ఛేంజర్

2013 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లను డీఎన్ఎస్ ఛేంజర్(DNS changer) అనే మాల్‌వేర్(Malware) స్తంభింపజేసి ప్రకంపనలు సృష్టించింది. దీని తాకిడికి అనేక సంస్థలు తమ సర్వర్ల(servers)ను ముందు జాగ్రత్తగా మూసివేశాయి. ప్రపంచానికి పొంచి ఉన్న సైబర్ ముప్పునకు ఈ ఉదాహరణలే ప్రబల నిదర్శనాలు.

రక్షణ సమాచార చోరీ

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్వయంగా రంగంలోకి దిగి అమెరికాతోపాటు అనేక ఇతర దేశాలనుంచి సున్నితమైన సమాచారాన్ని చోరీ చేస్తోంది. చైనా చేపట్టిన సైబర్‌ యుద్ధ తంత్రం తమ భద్రతా వ్యవస్థకు ప్రమాదకరంగా మారిందని అమెరికా ఆందోళన చెందుతోంది. యుద్ధం లాంటి విపత్తు సంభవించినప్పుడు అమెరికా తక్షణమే కార్యాచరణలోకి దిగకుండా నిరోధించగలిగే సామర్థ్యం చైనా సమకూర్చుకుందని అమెరికా కాంగ్రెస్ సలహా మండలి ఒక నివేదికలో హెచ్చరించింది.

ఎస్తోనియా సైబర్ సంక్షోభం

సైబర్ నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఎస్తోనియా సైబర్ సంక్షోభం నిరూపించింది. 2007 లో ఎస్తోనియాలో ఇదే జరిగింది. తాగునీరు, మురుగునీరు మొదలు చివరకు ఎన్నికలు కూడా ఆన్ లైన్ ద్వారా నిర్వహించుకునే ఎస్తోనియా ప్రభుత్వ నెట్ వర్క్ లోకి చొరబడ్డ సైబర్ దుండగులు, డిస్టర్బ్ డ్ అండ్ డినైల్ ఆఫ్ సర్వీస్ ఎటాక్స్(Distributed denial of Service attacks) ద్వారా యావత్ కంప్యూటర్ వ్యవస్థను స్తంభింపజేశారు. తాగేందుకు నీరు రాక, మురుగునీరు పారక, చివరకు ట్రాఫిక్ లైట్లు సైతం వెలగక ఎస్తోనియా ప్రజలు రోజుల తరబడి నానా పాట్లు పడ్డారు.ఆర్థిక వ్యవహారాల సంగతి అటుంచితే, దైనందిన పరిపాలన వ్యవహారాలను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వాలు కంప్యూటరీకరిస్తున్నాయి.

అణు రియాక్టర్ల నియంత్రణ -స్టక్స్ నెట్ ఉదంతం:

ఇరాన్ అణు రియాక్టర్లను స్తంభింపజేసిన స్టక్స్ నెట్(stuxnet) ఉదంతం భవిష్యత్తులో జరగబోయే సైబర్ యుద్ధాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని రుచి చూపించింది. ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి స్టక్స్‌నెట్‌ను రూపొందించాయి. దీన్ని అణురియాక్టర్లను నియంత్రిస్తున్న కంప్యూటర్ వ్యవస్థలోకి చొప్పించాయి. దాంతో ఆ కంప్యూటర్లు నియంత్రణ కోల్పోయి పనిచేయకుండా ఆగిపోయాయి. అణురియాక్టర్లు నిలిచిపోయాయి.

డేటా మైనింగ్ – సైబర్ ప్రచ్ఛన్న యుద్ధం

ఫ్లేమ్ పేరుతో సమాచారం తోడివేసే (డేటామైనింగ్-data mining) వైరస్‌ను అమెరికా రూపొందించింది. కంప్యూటర్‌లోకి చొరబడిన తరవాత సమస్త సమాచారాన్నీ ఇది తస్కరించి తన యజమానికి చేరవేస్తుంది. కీ బోర్డు మీద టైపు చేసే ప్రతి మాటను, కంప్యూటర్లో చూసే ప్రతి పేజీనీ, అక్కడ జరిగే సంభాషణలనూ యజమానికి అందజేస్తుంది. కంప్యూటర్ అనుసంధాన వ్యవస్థ (Networking systems )ల్లోని నిర్దుష్ట సమాచారాన్ని స్కాన్‌ చేసి మరీ చోరీ చేస్తుంది. దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు సైబర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయనడానికి ఇదో నిదర్శనం.

సీమాంతర నేరాలు:

అమెరికాలోని ఫెడరల్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (Federal National Information Service) అనే ఆర్థిక సంస్థ నుంచి రెండు రోజుల వ్యవధిలో ఓ ముఠా 130 లక్షల డాలర్లు తస్కరించిన ఉదంతం గతంలో వెలుగులోకి వచ్చింది. సైబర్ ముఠాలు బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి ఖాతాదారుల డెబిట్ కార్డుల (DEBT CARDS) సమాచారాన్ని తస్కరించారు. ఈ సమాచారంతో వారు అక్కడ నకిలీ డెబిట్ కార్డులు సృష్టించారు. ATM (Automated Teller Machine) కేంద్రాల ద్వారా 130 లక్షల డాలర్లు తస్కరించగలిగారు.

లాటరీ మెయిల్స్ వల:

దేశంలో ఆన్‌లైన్ లావాదేవీల వ్యాపారమూ శరవేగంగా విస్తరిస్తోంది. అయినా సైబర్ నేరాలపట్ల ప్రజలకు ఉన్న అవగాహన బాగా తక్కువ. అందుకే లాటరీ తగిలిందని తప్పుడు మెయిల్ పంపించి పెద్దయెత్తున డబ్బు కొల్లగొట్టే నైజీరియన్ మోసాల సంఖ్య ఎక్కువవుతోంది. రూ.కోట్ల విలువ చేసే లాటరీ కలిసిందని చెప్పగానే వెనకాముందు ఆలోచించకుండా అడిగినంత డబ్బు మాయగాళ్ల ఖాతాల్లో డిపాజిట్ చేసేవారి సంఖ్యకూ కొదవలేదు.

వాల్ స్ట్ర్రీట్ జర్నల్

చైనా సైబర్ దాడులు చేయడం లేదని అధ్యక్షుడు జిన్ పింగ్ రాసిన లేఖ ఈ ఫత్రికకే 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write US tells China cyberespionage is more than an irritant, must stop
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot