ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

By Hazarath
|

ధియేటర్‌లోకి ముందుగా ఏసినిమా వచ్చినప్పటికీ అది రెండో రోజే అన్నీ మొబైల్స్‌లోకి పీసీల్లోకి చేరిపోతున్న విషయం తెలిసిందే. కారణం ఆ సినిమా రిలీజైన రెండో రోజే కొన్ని సైట్లలోకి రావడమే. అయితే ఈ సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినప్పటికీ అవి మాత్రం ఆగడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠినతరమైన సూచనలు చేసింది. అవి చూసినా డౌన్‌లోడ్ చేసినా భారీ స్టాయిలో శిక్ష విధించేందుకు సిద్ధమైంది.

టోరెంట్స్ బంద్..పట్టించింది ఎవరో తెలిస్తే షాక్

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

నిషేధిత సైట్ల నుంచి ఎలాంటి సమాచారం తెలుసుకున్నా..ఏదేని రూపంలో డాటా డౌన్ లోడ్ అయినట్లుగా, వీడియో చూసినట్లుగా గుర్తిస్తే నెటిజన్ మూడేళ్లు జైలుశిక్షతో పాటు రూ. 3 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఇదే విషయంపై ఇప్పుడు తాజాగా జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. గత కొంతకాలం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వెబ్‌సైట్లపై నిషేధం విధించి సూచనలు చేస్తూనే ఉన్నాయి. వాటినుంచి ఇలాంటి పనులు చేసే నెటిజన్లు మూడేళ్ల జైలుశిక్ష అనుభవించడంతో పాటు రూ.3లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా
 
ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

అయితే ప్రభుత్వం ఎన్ని విధాలుగా వాటిని బ్యాన్ చేసినప్పటికీ ఏదో విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అశ్లీల సమాచారం ఉండే వెబ్ సైట్ల నుంచి వీడియోలు, సినిమాలు, ఫొటోలు డౌన్ లోడ్ చేస్తూనే ఉన్నారు.  దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ఐఎస్‌పీ'లు) సహాయంతో ఇలాంటి వెబ్ సైట్ల నుంచి డాటా కాపీ, డౌన్ లోడ్ చేస్తున్న యూజర్లను గుర్తించే మార్గాలను అన్వేషిస్తోంది.  

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

కాపీరైట్ చట్టం-1957 ప్రకారం సెక్షన్లు 63, 63-ఏ, 65, 65-ఏ కింద డాటా వాడిన యూజర్లపై గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష, రూ.3లక్షల జరిమానా విధించాలని పేర్కొన్నారు.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

డొమైన్ నేమ్ సర్వీస్(డీఎన్ఎస్) సహాయంతో చాలా రకాల డాటా వెబ్ సైట్ల యూఆర్ఎల్స్(వెబ్ లింక్స్) ను బ్లాక్ చేశారు. కానీ ఇలా చేసిన సైట్లను కొన్ని టెక్నిక్స్ ద్వారా సులువుగా డీకోడ్ చేసి యూజ్ చేస్తున్నారు.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

వాస్తవానికి ఈ విషయంపై సరైన మార్గదర్శకాలు లేని కారణంగా ఇప్పటివరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

బ్లాక్ చేసిన వెబ్ సైట్లు వాడే యూజర్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కసరత్తులు చేస్తున్నందున, త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

స్పష్టత వచ్చిన తరువాత ఈ మార్గదర్శకాలు అమలు అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక అన్ని సైట్లతో పాటు చూసినవారికి పెద్ద శిక్ష పడినట్లే మరి.

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఆ సైట్లు చూస్తే మూడేళ్లు జైలు, రూ.3లక్షల జరిమానా

ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం విధించాయి. అయినప్పటికీ కొన్ని టెక్నిక్స్ ద్వారా వాటిని సులువుగా డీకోడ్ చేస్తున్నారు.

Best Mobiles in India

English summary
Are you a criminal now? Users may get 3 years in jail for viewing torrent site, blocked URLs in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X