నోకియా పై హాట్ రూమర్?

Posted By:

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న నోకియా ప్రస్తుత మార్కెట్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ బ్రాండ్‌కు సంబంధించి ఓ హాట్ రూమర్ వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలకు ప్రాధాన్యతనిస్తు వస్తున్న నోకియా త్వరలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోందని మార్కెట్ చర్చ మొదలైంది.

బ్లాక్‌బెర్రీ vs నోకియా

ప్రముఖ లగ్జరీ ఫోన్‌ల నిర్మాణ సంస్థ ‘వెర్టు' (Vertu) త్వరలో విడుదల చేయబోతున్న ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ‘వెర్టు టీఐ'ను నోకియా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు చిత్రాలు ఇటీవల వెబ్ ప్రపంచంలో ప్రత్యక్షమయ్యయి. ఈ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013లో ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. జపాన్‌కు చెందిన ‘బ్లాక్ ఆఫ్ మొబైల్' వెలువరించిన వివరాల మేరకు ‘వెర్టు టీఐ' ఫీచర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నోకియా పై హాట్ రూమర్?

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- వెర్టుటీఐ డ్యూయల్ - కోర్ ప్రాసెసర్ (1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8260 స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్),
- వై-ఫై కనెక్టువిటీ, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.0,
- 1250ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot