Vi యూజర్లకు బ్యాడ్ న్యూస్: 3G సేవలను త్వరలో నిలిపివేయనున్నది!! ఎప్పటినుంచో తెలుసా??

|

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వొడాఫోన్ ఐడియా(Vi) నేడు ఎవరు ఊహించని విధమైన ప్రకటనను విడుదల చేసింది. ప్రకటన యొక్క వివరాలలోకి వస్తే జనవరి 15 నుండి డిల్లీలో తన యొక్క 3G సేవలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త మార్పు ఫలితంగా డిల్లీ సర్కిల్‌లో Vi ఆపరేటర్ తన వినియోగదారులను తమ ప్రస్తుత సిమ్‌ను 4Gకి అప్‌గ్రేడ్ చేయమని కోరడం ప్రారంభించారు. ఈ చర్య స్పెక్ట్రం రీ-ఫార్మింగ్‌లో ఒక భాగంగా ప్రారంభం మాత్రమే. ఇప్పటి వరకు ఆపరేటర్ తన 3G స్పెక్ట్రంను 4G సేవలకు ఉపయోగిస్తున్నారు. రాజధాని నగరంలోని Vi కస్టమర్లు తమ సమీపంలోని దుకాణాల ద్వారా వారి ప్రస్తుత సిమ్‌ను 4G కి సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Vi సిమ్‌ను 4Gకి అప్‌గ్రేడ్ చేయాలనే SMS మెసేజ్

Vi సిమ్‌ను 4Gకి అప్‌గ్రేడ్ చేయాలనే SMS మెసేజ్

3G సేవలను త్వరలో ముగియనున్నట్లు ఢిల్లీ సర్కిల్‌లోని వినియోగదారులకు తెలియజేయడానికి Vi టెలికాం సంస్థ ఒక SMS మెసేజ్ ను పంపుతున్నది. వినియోగదారులు తమ ఫోన్లలో నిరంతరాయమైన సేవను పొందడానికి జనవరి 15 లోపు వారి సిమ్‌ను 4Gకి అప్‌గ్రేడ్ చేయాలనే మెసేజ్ ను ప్రస్తుతం 3G సేవలను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి పంపుతున్నది.

Vi 4G అప్‌గ్రేడ్

Vi 4G అప్‌గ్రేడ్

Vi వినియోగదారుల యొక్క తమ సిమ్‌ను 4Gకి అప్‌గ్రేడ్ చేయలేని వినియోగదారులకు సూచిస్తున్నది. 2G ద్వారా ప్రస్తుతం వాయిస్ కాలింగ్‌ను అందిస్తున్న పాత సిమ్ కనెక్షన్‌లలో డేటా సేవలు జనవరి 15 నుంచి అందుబాటులో ఉండవు. అయితే ఈ మార్పు ఇప్పటికే Vi 4G సిమ్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారుల విషయంలో ఎటువంటి ప్రభావితం చేయదు.

Vi 2G/3G సిమ్ చందాదారులు

Vi 2G/3G సిమ్ చందాదారులు

Vi యొక్క పాత 2G/3G సిమ్ ను వాడుతున్న వారు వారి యొక్క ఫోన్లలో డేటా మరియు వాయిస్ సేవలను ఇకపై కొనసాగించడానికి వారి సిమ్‌ను 4G కి అప్‌గ్రేడ్ చేయడానికి వారి సమీప దుకాణాన్ని సందర్శించాలని వినియోగదారులను కోరుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అందించిన గణాంకాల ప్రకారం ఢిల్లీ సర్కిల్‌లో Vi సుమారు 16.21 మిలియన్లకు పైగా వైర్‌లెస్ చందాదారులను కలిగి ఉన్నారు.

Best Mobiles in India

English summary
Vi Telco Will be Discontinuing its 3G Services From January 15

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X