దిక్కుతోచని స్థితిలో అమెరికాలోని భారత ఐటీ ఉద్యోగులు

Written By:

ఫారిన్ చదువులు, ఉద్యోగాలు అంటూ అమెరికా బాటపట్టిన ఇండియన్లకి ఇప్పుడు ట్రంప్ ఫీవర్ పట్టుకుంది. అమెరికా వెళ్లేందుకు అతి ముఖ్యమైన వీసాల్లో ఒకటైన హెచ్ -1 బీ వీసాపై ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయంపైనే అక్కడి ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

హెచ్-1బీ వీసా ఎఫెక్ట్..అమెరికా నిషేధించిన కంపెనీల లిస్ట్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐటీ ఉద్యోగులకు ట్రంప్ ఫీవర్

అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ట్రంప్ ఫీవర్ పట్టుకున్నది. హెచ్ -1 బీ వీసాపై ఆయన తీసుకునే నిర్ణయంపైనే అక్కడి ఇండియన్ ఐటీ ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉంది.

భారతీయ ఉద్యోగులను వెనక్కి పంపిస్తానని

అమెరికాలోని భారతీయ ఉద్యోగులను వెనక్కి పంపిస్తానని అమెరికన్లకు ఉద్యోగఅవకాశాలు కల్పిస్తానని, దీంతోపాటు హెచ్ -1 బీ వీసాలను పునఃసమీక్షిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో అమెరికన్లు ఆయన్ని నమ్మి గెలిపించినట్లుగా తెలుస్తోంది.

ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో

అధ్యక్షుడిగా గెలవడంతో ఇప్పుడు ట్రంప్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు (ఐటీ ఉద్యోగులు) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో తెలియదని, చదువులు కొనసాగుతాయో లేదోనని భయపడుతున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్ -1 బీ వీసా కింద దాదాపు 65000

ప్రతి సంవత్సరం హెచ్ -1 బీ వీసా కింద దాదాపు 65000, వీరిలో మంది వృత్తి నిపుణులు, 20000 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు. ప్రస్తుతం వీరందరీ భవిష్యత్ ట్రంప్ చేతుల్లో ఉంది.

భారత్, అమెరికా సంబంధాలపై

అదీగాక ఈ వీసాపై ట్రంప్ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభావం భారత్, అమెరికా సంబంధాలపై పడనుందని తెలుస్తోంది. మరి ఆ సాహసం చేస్తారా లేదా అనేది ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.

అక్కడ చదువుకుంటూ పనిచేసుకోవాలంటే

విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన విద్యార్థులు అక్కడ చదువుకుంటూ పనిచేసుకోవాలంటే హెచ్ -1 బీ వీసా తప్పని సరి. 

లాటరీలో అదృష్టాన్ని

ఈ వీసా కావాలంటే ఏటా ఇచ్చే 85 వేల హెచ్ -1 బీ వీసాల కోసం లాటరీలో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా వీసా అర్హులను ఎంపిక చేస్తారు.

కంపెనీలలో తీసుకునేందుకు

దీంతో పాటు అమెరికా కంపెనీలు సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రొగ్రామింగ్ వంటి సాంకేతిక పరిజ్క్షానం కలిగి ఉద్యోగులను తమ కంపెనీలలో తీసుకునేందుకు హెచ్ -1 బీ వీసాలను వినియోగిస్తుంటాయి.

అమెరికన్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని..

ఇతర దేశాల నుంచి వచ్చే వలసేతరులకు హెచ్ -1 బీ వీసా, ఇతర వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పించడం వల్ల చాలామంది అమెరికన్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని అక్కడి చట్టసభల్లో సైతం కొన్నాళ్లనుంచి గొంతెత్తుతూనే ఉన్నారు.

ప్రతికూల నిర్ణయం వెలువడితే

ఇప్పుడు దీనిపై ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అక్కడి వలసదారులంతా ఎదురుచూస్తున్నారు. ప్రతికూల నిర్ణయం వెలువడితే అందరూ ఇంటి బాట పట్టక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Visas for tech workers could be limited under Trump administration read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot