వివో దీపావళి ఆఫర్.... వివో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 101లకే కొనవచ్చు

|

ప్రముఖ చైనా సంస్థ వివో ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.101లకు పొందవచ్చు. ఇండియా అంతటా వున్న తన ఆఫ్‌లైన్ స్టోర్ ద్వారా నో-కాస్ట్ EMI మరియు జీరో డౌన్-పేమెంట్ పథకాలను కూడా అందిస్తోంది. ఇంకా ఈ పండుగ సీజన్లో వివో స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసేటప్పుడు డిజిటల్ లావాదేవీలు చేసే వినియోగదారులకు ఇది 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.

వివో దీపావళి ఆఫర్
 

వివో దీపావళి ఆఫర్

ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 18 మరియు అక్టోబర్ 31 మధ్య భారతదేశంలోని అన్ని ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా చెల్లుతుంది అని వివో ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఈ ఆఫర్ కింద తాము ఎంచుకున్న వివో ఫోన్‌ను రూ.101 చెల్లించి పొందవచ్చు. దీపావళి ఆఫర్లో భాగంగా సంస్థ అందిస్తున్న వివో ఫోన్‌లు వరుసగా వివో వి 17 ప్రో, వివో వి 15 ప్రో, వివో జెడ్ 1 ఎక్స్ 8 జిబి ర్యామ్ వేరియంట్, వివో వి 15, వివో ఎస్ 1, వివో వై 17, వివో వై 15, మరియు వివో వై 12.

వివో ఆఫ్‌లైన్ స్టోర్

వివో ఆఫ్‌లైన్ స్టోర్

వివో ఆఫ్‌లైన్ స్టోర్లలో రూ.101 ఆఫర్ కాకుండా వివో HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా 10 శాతం క్యాష్‌బ్యాక్ ను అందిస్తుంది. ఇవే కాకుండా హెచ్‌డిఎఫ్‌సి మరియు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లపై EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులను ఉపయోగించే వినియోగదారులకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్..... ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

బ్యాంక్ కార్డు

అదేవిధంగా బజాజ్ ఫిన్‌సర్వ్, హోమ్ క్రెడిట్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మరియు హెచ్‌డిబిఎఫ్‌ఎస్ బ్యాంక్ కార్డుల ద్వారా 12 నెలల ఇఎంఐ పదవీకాలంతో జీరో ప్రాసెసింగ్ ఫీజు మరియు జీరో డౌన్‌పేమెంట్ ఎంపికలతో నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికలను కంపెనీ అందిస్తోంది.

ఏయే దేశాల్లో ఏ స్మార్ట్‌ఫోన్ నంబర్ 1 స్థానంలో ఉంది ?

వివో-క్యాషిఫై
 

వినియోగదారులు వివో-క్యాషిఫై అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా వివో వి 17 ప్రో మరియు వివో ఎస్ 1 లపై రూ.1,999 వరకు ఎక్స్చేంజ్ పొందవచ్చు. ఈ వారం ప్రారంభంలో వివో తన ఆన్‌లైన్ స్టోర్ లో గ్రాండ్ దీపావళి ఫెస్ట్ సేల్స్ ద్వారా వివిధ స్మార్ట్‌ఫోన్ మోడళ్లను తగ్గింపు ధర వద్ద వినియోగదారులకు అందించింది..

Most Read Articles
Best Mobiles in India

English summary
Vivo Diwali Offer: Smartphone You can Buy at Rs.101 Down Payment

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X