Home
News

Vivo S7 రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి...

ప్రపంచం మొత్తం ఇప్పుడు 5G వైపు అడుగులు వేస్తున్నది. ఇందుకోసం అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ యొక్క 5G ఫీచర్ ఫోన్లను విడుదల చేస్తున్నారు. ప్రముఖ వివో సంస్థ కూడా తన వివో S7 5G కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసే పనిలో ఉన్నది. ఇటీవల ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ధరల వివరాలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లలో లీక్ అయ్యాయి. వివో S7 యొక్క లీక్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివోS7 లీక్ ల పూర్తి సమాచారం

వివోS7 లీక్ ల పూర్తి సమాచారం

వివో S7 స్మార్ట్‌ఫోన్ గురించి లీక్ అయిన సమాచారం ప్రకారం ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ వద్ద విడుదల అవ్వనున్నది. దీని యొక్క ధర RMB 3,298. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.35,300. అలాగే సంస్థ ఈ ఫోన్ ను 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో కూడా అందిస్తున్నట్లు కొన్ని లీక్ లు తెలుపుతున్నాయి.

 

వివోS7 సాఫ్ట్ వెర్ ఫీచర్స్

వివోS7 సాఫ్ట్ వెర్ ఫీచర్స్

వివో కంపెనీ నుంచి రాబోయే కొత్త ఫోన్ వివో S7 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G SoC చిప్‌సెట్ తో వస్తున్నట్లు లీక్ పేర్కొంది. అదే చిప్‌సెట్ ను సరికొత్త వన్‌ప్లస్ నార్డ్‌లో కూడా ఉపయోగించారు. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మరియు ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కూడా కలిగి ఉన్నాయి. ఇది ఒప్పో రెనో 4 హ్యాండ్‌సెట్ మాదిరిగానే అతి పెద్ద 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.

వివోS7 కెమెరా ఫీచర్స్

వివోS7 కెమెరా ఫీచర్స్

లీక్‌లు మరియు విశ్వసనీయ సమాచారం ప్రకారం వివో S7 స్మార్ట్‌ఫోన్ యొక్క సెల్ఫీ కెమెరా సెటప్ లో 44 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ISOCELL GH1 ప్రైమరీ సెల్ఫీ సెన్సార్‌ను ఉపయోగించినట్లు సమాచారం. అలాగే సూపర్-వైడ్-యాంగిల్ లెన్స్‌తో పాటు గల 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. అలాగే బ్యాక్ కెమెరా సెటప్ లో 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ISOCELL GW1+ ప్రైమరీ సెన్సార్‌తో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సెటప్‌లో సూపర్-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 13 మెగాపిక్సెల్ మూడవ కెమెరా జత చేయబడినట్లు సమాచారం.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo S7 Specifications, Price Leaked: What to Expect?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X