Vivo X50 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేసాయి!!! ఫీచర్స్ అద్భుతం....
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఎట్టకేలకు తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు వివో X50 మరియు వివో X50 ప్రోలను ఇండియాలో విడుదల చేశారు. వివో యొక్క ఈ కొత్త మోడల్స్ రెండూ కూడా పంచ్-హోల్ డిస్ప్లేతో మరియు 3D సౌండ్ ట్రాకింగ్, ఆడియో జూమ్ మరియు సూపర్ నైట్ మోడ్ 3.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి SoC వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

వివో X50, వివో X50 ప్రో స్మార్ట్‌ఫోన్స్ లాంచ్
వివో X50 మరియు వివో X50 ప్రో రెండు స్మార్ట్‌ఫోన్‌లు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తాయి. ఈ రెండింటిలో ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే కెమెరా సెటప్. వివో X50 ప్రో స్మార్ట్‌ఫోన్ యాజమాన్య గింబాల్ కెమెరా సిస్టమ్‌ను ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది స్పష్టమైన స్టిల్ ఫోటోలు మరియు వీడియోలను సంగ్రహించడానికి ఫ్రేమ్‌ను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో X50, వివో X50 ప్రో ధరల వివరాలు
ఇండియాలో వివో X50 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో మరియు వివో X50ను కేవలం ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేసారు. ఇందులో వివో X50 యొక్క 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.34,990 ఉండగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల అవుతున్న వివో X50 ప్రో యొక్క ధర 49,990 రూపాయలు.

వివో X50, వివో X50 ప్రో ప్రీ-బుకింగ్
వివో X50 ఫోన్ ఫ్రాస్ట్ బ్లూ మరియు గ్లేజ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లలో లభిస్తుంది. అలాగే వివో X50 ప్రో ఆల్ఫా గ్రే ఒకే ఒక కలర్ లో వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు జూలై 24 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ రోజు నుండి రిలయన్స్ డిజిటల్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్, పేటీఎం మాల్ మరియు టాటా క్లిక్ వంటి ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ రిటైలర్లలో ప్రీ-బుకింగ్‌లు మొదలయ్యాయి.

వివో X50, వివో X50 ప్రో స్పెసిఫికేషన్స్
వివో X50 ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది HDR10+ సపోర్ట్, 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 180HZ టచ్ రెస్పాన్స్ రేట్‌తో 6.56-అంగుళాల ఫుల్-హెచ్‌డి + ఫ్లాట్ అల్ట్రా ఓ అమోలేడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 SoC ని కలిగి ఉండి 8GB RAM తో జతచేయబడి వస్తుంది.

వివో X50 కెమెరా సెటప్
వివో X50 ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX598 సెన్సార్‌ను f / 1.6 లెన్స్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సూపర్-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV), ఎఫ్ / 2.48 ఎపర్చరుతో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ మరియు f / 2.48 ఎపర్చర్‌తో 13-మెగాపిక్సెల్ బోకె షూటర్ 20x డిజిటల్ జూమ్ మద్దతుతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆస్ట్రో మోడ్, ఎక్స్‌ట్రీమ్ నైట్ విజన్, సూపర్ నైట్ హెచ్‌డిఆర్, ప్రో స్పోర్ట్స్ మోడ్, మోషన్ AF ట్రాకింగ్ మరియు ఇన్‌స్టంట్ వ్లాగ్ వంటి ఫీచర్లతో ప్రీలోడ్ చేయబడింది.

వివో X50 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్
వివో X50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఫోటోలు మరియు వీడియోల కోసం క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.6 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ సోనీ IMX598 ప్రైమరీ కెమెరా లెన్స్ గింబాల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. దీనితో పాటుగా 120-డిగ్రీల ఫోవ్‌తో 8 మెగాపిక్సెల్ సూపర్-వైడ్-యాంగిల్ షూటర్, ఎఫ్ / 2.48 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ కెమెరా బోకె షూటర్ మరియు 60x హైబ్రిడ్ జూమ్‌తో వస్తుంది. చివరిగా 8 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ షూటర్ కూడా ఇందులో ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆస్ట్రో మోడ్, ఎక్స్‌ట్రీమ్ నైట్ విజన్, సూపర్ నైట్ హెచ్‌డిఆర్, ప్రో స్పోర్ట్స్ మోడ్, మోషన్ AF ట్రాకింగ్ మరియు ఇన్‌స్టంట్ వ్లాగ్ వంటి ఫీచర్లతో ప్రీలోడ్ చేయబడింది.

వివో X50 సిరీస్ కనెక్టివిటీ
వివో X50 ఫోన్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఇది 33W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 4200mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ 159.54x75.39x7.55mm పరిమాణంలో ఉండి 174.5 గ్రాముల బరువుతో వస్తుంది.


Click it and Unblock the Notifications








