Home
News

అద్భుతమైన ధరల తగ్గింపులతో వివో V15&Y17

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇండియాలో V15 మరియు Y17 మొబైల్ ధరలను తగ్గించింది.Y17 ను ప్రారంభించినప్పుడు దాని ధర Rs.17,990లుగా ఉంది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇండియాలో V15 మరియు Y17 మొబైల్ ధరలను తగ్గించింది.Y17 ను ప్రారంభించినప్పుడు దాని ధర Rs.17,990లుగా ఉంది.ఇప్పుడు దీని మీద Rs.2000లు తగ్గించి RS.15,990లకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.అంతే కాకుండా వివోV15మొబైల్ ప్రారంభ ధర Rs.23,990లు.ఇప్పుడు V15 దాని రెండవ ధర తగ్గింపును పొందింది ప్రస్తుతం ఈ మొబైల్ Rs.19,990లకు అందుబాటులో ఉంది.

vivo v15 y17 price cut india

ఈ స్మార్ట్ ఫోన్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు వివో ఇండియా ఆన్లైన్ స్టోర్ల ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి.అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లలో పాత ధరల వద్ద ఈ మొబైల్లు అమ్ముడవుతున్నాయి.కావున వివో V15 &Y17 లను కొనుగోలు చేసెటప్పుడు కొత్త ధరలు ఉన్నాయా లేదా అని ఒక సారి చెక్ చేసుకోండి.

వివో V15 స్పెసిఫికేషన్స్:

వివో V15 స్పెసిఫికేషన్స్:

వివో V15 6.53-inch నాచ్-లెస్ డిస్ప్లే ను 19.3: 9 యొక్క కారక నిష్పత్తితో మరియు 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కలిగి ఉంటుంది. ఇది 2.3GHz క్లాక్ స్పీడ్ తో TSMC 12nm FinFET ప్రక్రియపై నిర్మించిన ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P70 SOC ప్రాసెసర్ శక్తిని కలిగి ఉంటుంది. ఇది 6GB RAM మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజిను కలిగి ఉంది ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 9.0పై నడుస్తుంది.

ఈ ఫోన్ యొక్క USP దాని AI ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ 24MP ప్రైమరి సెన్సార్ f/1.8తొ , 8MP వైడ్-ఆంగల్ సెకండరీ సెన్సర్ మరియు 5MP డీప్ సెన్సార్ f / 2.4 తో ఉంటుంది. కెమెరా లక్షణాలు ఆటో-ఫోకస్, డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, మరియు టచ్ టు ఫోకస్. ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ల కొసం 32-మెగాపిక్సెల్ షూటర్ f/ 2.0 ఎపర్చర్ లతో ఉంటుంది.

కనెక్టివిటీ ఎంపికలు VoLTE మద్దతు,డ్యూయల్ నానో SIM, Wi-Fi 802.11 b / g / n, WiFi డైరెక్ట్, హాట్ స్పాట్, బ్లూటూత్ 5.0, మరియు microUSB 2.0. ఈ డివైస్ కొలతలు 159.4 x 76.7 x 8.9 mm మరియు 190.5 గ్రాముల బరువు ఉంటుంది. ఇది పీకాక్ బ్లూ,రాయల్ బ్లూ,ఫ్రోజెన్ బ్లాక్,గ్లామర్ రెడ్ వేరియంట్ లలో లబిస్తుంది.

 

వివో V15 మొబైల్ ఫీచర్స్:

వివో V15 మొబైల్ ఫీచర్స్:

డిస్ప్లే ---- 6.53-inch
ప్రాసెసర్ ------ ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P70
ఫ్రంట్ కెమెరా ---- 32 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 24-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్+5-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 64GB/128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

వివో Y17 స్పెసిఫికేషన్స్:

వివో Y17 స్పెసిఫికేషన్స్:

డ్యూయల్-సిమ్ (నానో) వివో Y17Funtouch OS 4.5 ఆండ్రాయిడ్9.0పై తో నడుస్తుంది.6.35-inch 59.4 x 76.8 x 8.9 mm (6.28 x 3.02 x 0.35 పిక్సల్స్) డిస్ప్లే 19: 9 కారక నిష్పత్తితో ఉంటుంది. ఫోన్ ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35 SOC ప్రాసెసర్ శక్తిని కలిగి ఉంటుంది. 4GB RAM మరియు 128GBఇంటర్నల్ స్టోరేజితో పనిచేస్తుంది.స్టోరేజీ microSD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు.

ఆప్టిక్స్ పరంగా వివో Y17వెనుక వైపు 13-మెగాపిక్సెల్ సెన్సార్ (f / 2.2 ఎపర్చరు) మరియు 8-మెగాపిక్సెల్ సెకండ్ డెప్త్ సెన్సార్ (f / 2.4 ఎపర్చర్) తో మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ f / 2.4 తో ట్రిపుల్ కెమెరా సెటప్ను LED ఫ్లాష్ తో కలిసి ఉంటుంది. హ్యాండ్సెట్ ముందు వైపు 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో f / 2.0 ఎపర్చరుతో వస్తుంది.మరియు 5000mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది.

కనెక్టువిటీ ఎంపికలు 4G VoLTE, సింగిల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS, FM రేడియో, OTG మద్దతుతో మైక్రో- USB పోర్ట్ మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. సెన్సార్లను ఆన్ వివో Y17 లో యాక్సలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఎలక్ట్రానిక్ దిక్సూచి,ఫింగర్ ప్రింట్ సెన్సార్, సామీప్య సెన్సార్ మరియు వర్చ్యువల్ గైరోస్కోప్ ఉన్నాయి.ఈ ఫోన్ 155.11x75.09x8.28mm కొలతలతో 190.5 గ్రాముల బరువు ఉంటుంది.

 

వివో Y17 మొబైల్ ఫీచర్స్:

వివో Y17 మొబైల్ ఫీచర్స్:

డిస్ప్లే ---- 6.35-inch
ప్రాసెసర్ ------ ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35
ఫ్రంట్ కెమెరా ---- 20 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9.0పై
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 5000mAh

More from GizBot

Best Mobiles in India

English summary
vivo v15 y17 price cut india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X