Vivo V20 SE స్మార్ట్‌ఫోన్ మీద రూ.1000 భారీ ధర తగ్గింపు!!

|

భారతదేశంలో నాలుగు నెలల ముందు విడుదల అయిన వివో V20 SE స్మార్ట్‌ఫోన్ యొక్క ధర మీద రూ.1,000 వరకు తగ్గించినట్లు కంపెనీ ధృవీకరించింది. వివో V20 స్మార్ట్‌ఫోన్ యొక్క అప్ డేట్ వేరియంట్‌గా ప్రారంభమైన ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ డిస్ప్లే డిజైన్ తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్లతో లభించే వివో V20 SE మోటరోలా మోటో G 5G, రియల్‌మి X7 5G, శామ్‌సంగ్ గెలాక్సీ M31 లకు గట్టి పోటీని ఇస్తున్నది. ఇప్పుడు తగ్గింపు ధరల వద్ద లభించే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో V20SE స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరల వివరాలు

వివో V20SE స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరల వివరాలు

వివో V20SE స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ తో రూ.20,990 ధర వద్ద ఆక్వామారిన్ గ్రీన్ మరియు గ్రావిటీ బ్లాక్ అనే రెండు కలర్ ఎంపికలలో విడుదల అయింది. అయితే తాజా సవరణ ప్రకారం ఈ ఫోన్ యొక్క ధర రూ.1000 తగ్గించిన తరువాత ఇప్పుడు రూ.19,990 ధర వద్ద లభిస్తుంది. ఈ తగ్గింపు ధరలు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ఛానెల్‌లకు వర్తిస్తుంది. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ మార్కెట్ లో కొత్త ధరలు ఇంకా చూపలేదు.

వివో V20SE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పైన ఫంటౌచ్ OS11 ద్వారా రన్ అవుతుంది. ఇది 6.44-అంగుళాల ఫుల్- HD+ అమోలేడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 8GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది.

వివో V20SE కెమెరా ఫీచర్స్

వివో V20SE కెమెరా ఫీచర్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, f/ 2.2 వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు 2 బోకే ప్రభావం కోసం ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలతో ప్యాక్ చేయబడి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో V20SE 33W ఫ్లాష్ ఛార్జ్ ఫీచర్స్

వివో V20SE 33W ఫ్లాష్ ఛార్జ్ ఫీచర్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ కేవలం 128GB ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, FM రేడియో మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 4,100mAh పెద్ద బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జ్ ఛార్జింగ్ మద్దతుతో అందిస్తుంది. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది. చివరగా ఈ ఫోన్ 161x74.08x7.83mm కొలతల పరిమాణంలో 171 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo V20 SE Smartphone Price Cut in India: New Price, Specs, Availability and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X