ఒకే IMEI నెంబర్ మీద పనిచేస్తున్న 13,500 వివో స్మార్ట్‌ఫోన్లు!!! జర జాగ్రత్త...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీల విషయానికి వస్తే చైనా సంస్థలు అధికంగా ఇండియాలో పాపులర్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా వివో సంస్థ ఇతర చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో కలిసి గట్టి పోటీగా తమను తాము మెరుగుపరచుకుంటున్నాయి.

 

వివో స్మార్ట్‌ఫోన్లు

వివో స్మార్ట్‌ఫోన్లు

వివో సంస్థ ఇండియాలోకి ప్రవేశించినప్పటి నుండి ఈ బ్రాండ్ అగ్రశ్రేణి సంస్థలలో ఒకటిగా నిలిచింది. 2020 క్యూ 1 నాటికి భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివోకు 17% వాటా ఉంది. అంతేకాకుండా ఈ త్రైమాసికంలో బడ్జెట్ Y- సిరీస్ శ్రేణి ద్వారా తమ యొక్క మార్కెట్ వాటాను 40% YOY కు పెంచుకోగలిగింది. వివో యొక్క ఈ YOY పెరుగుదలతో మరో భారీ వివాదానికి దారితీసింది. Mitron & Remove China apps యాప్‌లను ఎందుకు తొలగించారో తెలుసా???

వివో స్మార్ట్‌ఫోన్‌ల ఒకే IMEI నెంబర్

వివో స్మార్ట్‌ఫోన్‌ల ఒకే IMEI నెంబర్

ఇండియాలో వివో స్మార్ట్‌ఫోన్‌లలో సుమారు 13,500 కి పైగా ఖచ్చితమైన ఒకే IMEI నంబర్‌తో రన్ అవుతున్నట్లు సైబర్ సెల్ లో కేసును నమోదు చేసారు. IMEI నంబర్ లేదా ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ అనేది ఒక ప్రత్యేకమైన 15-అంకెల కోడ్. ఇది సిమ్ కార్డ్ ఇన్‌పుట్‌తో చాలా పరికరాల మధ్య తేడాను గుర్తించడానికి అనుమతిస్తుంది. Samsung Galaxy A31 వచ్చేసింది!! ఫీచర్స్ అదుర్స్.. ధర కూడా తక్కువే...

ఒకే IMEI నెంబర్
 

ఒకే IMEI నెంబర్

నిబంధనల ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ పరికరాలకు ఒకే IMEI నెంబర్ ఉండకూడదు. ఈ IMEI నెంబర్ ట్యాంపరింగ్ సహాయంతో దొంగిలించబడిన పరికరాలను ట్రాక్ చేయడం మరియు గుర్తించడం వంటి సమయంలో చాలా కష్టతరం అవుతుంది. డిల్లీ సేవా కేంద్రం నుండి 2019 సెప్టెంబర్‌లో పోలీసు సిబ్బంది వివో స్మార్ట్‌ఫోన్‌ను అందుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. దాని మరమ్మత్తు తర్వాత కూడా ఫోన్ యొక్క సిస్టమ్ లోపాన్ని గుర్తించిన తరువాత అతను దానిని సైబర్ సెల్ సిబ్బందికి ఇచ్చాడు. Redmi Earbuds S: రికార్డు స్థాయిలో సేల్స్!! రూ.2000 లోపు ధరలో బెస్ట్ ఇవే...

IMEI నెంబర్ సైబర్ సెల్ కేసు

IMEI నెంబర్ సైబర్ సెల్ కేసు

దానిని తనిఖీ చేసిన తరువాత ఫోన్ యొక్క IMEI నెంబర్ మార్చబడిందని సైబర్ సెల్ కనుగొంది. అప్పటి నుండి మీరట్ పోలీసుల సైబర్ సెల్ బృందం 13,500 కి పైగా వివో స్మార్ట్‌ఫోన్‌లను ఒకే IMEI నంబర్‌ను కలిగి ఉంది అని తేల్చిచెప్పారు. IMEI ట్యాంపరింగ్ నేరస్థులను అడ్డగించడం పోలీసులకు కష్టతరం చేస్తుంది కాబట్టి ఈ ఫలితాలు తీవ్రమైన భద్రతా సమస్యగా మారాయి.

క్రిమినల్ కేసు

క్రిమినల్ కేసు

సిఆర్‌పిసి సెక్షన్ 91 కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద సంబంధిత అధికారులు వివో ఇండియా నోడల్ ఆఫీసర్ హర్మన్‌జిత్ సింగ్‌కు అధికారిక నోటీసు పంపారు. ప్రస్తుతానికి వివో ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు కాని త్వరలో వివో బ్రాండ్ నుండి దీని గురించి సరైన వివరణను ఆశిస్తున్నాము.

IMEI ట్యాంపరింగ్

IMEI ట్యాంపరింగ్

IMEI ట్యాంపరింగ్ అనే దాని గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. 2012 లో 18,000 ఫోన్లు ఒకే IMEI నంబర్ మీద రన్ అవుతున్నట్లు మొదటిసారి వెలుగులోకి వచ్చింది. 2017 లో భారత ప్రభుత్వం IMEI ని ఉల్లంఘించిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది. ఇదే విధమైన కేసును భారీ స్థాయిలో 2019 నవంబర్‌లో కనుగొనబడింది. దొంగిలించబడిన లక్షకు పైగా మొబైల్ ఫోన్లు ఒకే IMEI నంబర్‌ మీద రన్ అవుతున్నట్లు పోలీసు శాఖ కనుగొనింది.

Best Mobiles in India

English summary
Vivo 13,500 Smartphones Running on Same IMEI Number Case Filed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X