Home
News

Vivo Y20A బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ నేడే ప్రారంభం...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఇటీవల విడుదల చేసిన వివో Y20A సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదటి సారి ప్రారంభం అయ్యాయి. మొబైల్ గేమ్లను ఆడటానికి ఎక్కువగా ఇష్టపడే వారికి 6.51-అంగుళాల వాటర్‌డ్రాప్ తరహా డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ ఫీచర్లతో ప్యాక్ చేయబడి ఉంది. వివోఇండియా యొక్క వెబ్ సైట్ మరియు ఇ-స్టోర్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో Y20A ధరలు & సేల్స్ వివరాలు

వివో Y20A ధరలు & సేల్స్ వివరాలు

వివో Y20A స్మార్ట్‌ఫోన్ 3GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్ తో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్ యొక్క ధర రూ.11,490. దీనిని నెబ్యులా బ్లూ మరియు డాన్ వైట్ వంటి రెండు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ఫోన్ ను వివో సంస్థ యొక్క భాగస్వామి రిటైల్ దుకాణాలు, వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.

వివో Y20A ఆండ్రాయిడ్ 11 స్పెసిఫికేషన్స్

వివో Y20A ఆండ్రాయిడ్ 11 స్పెసిఫికేషన్స్

వివో Y20A స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ OS11 ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.51-అంగుళాల హెచ్‌డి + ఐపిఎస్ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 439 SoC చేత శక్తిని పొందుతూ 3GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది.

వివో Y20A ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్స్

వివో Y20A ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్స్

వివో Y20A స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ బోకె లెన్స్, ఎఫ్ / 2,4 ఎపర్చర్‌తో మరో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు నిలువ వరుసలో ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో Y20A 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

వివో Y20A 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

వివో Y20A స్మార్ట్‌ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 17 గంటల కంటే ఎక్కువ ఆన్‌లైన్ హెచ్‌డి మూవీ స్ట్రీమింగ్ మరియు 10 గంటల సమయం వరకు గేమింగ్ ఆడటానికి బ్యాటరీ బ్యాక్ అప్ లభిస్తుంది అని కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ బోర్డులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 4.2, మైక్రో-USB పోర్ట్, జిపిఎస్, ఎఫ్ఎమ్ రేడియో వంటివి మరిన్ని ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y20A Smartphone First Sale Live in Vivo.com: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X