Home
News

Vivo Y20A బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!!! ఫీచర్స్ బ్రహ్మాండం...

ఇండియాలోని మొబైల్ రంగంలో మంచి బేస్ కలిగిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో కొత్తగా మరొక ఫోన్ వివో Y20A ను విడుదల చేసింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో గేమింగ్ ఆఫర్‌గా భారతదేశంలో విడుదల చేయబడింది. 6.51-అంగుళాల వాటర్‌డ్రాప్ తరహా డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి హెచ్‌డి మూవీ స్ట్రీమింగ్ మరియు గేమింగ్ అనుభవం కోసం అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. వివో Y20A రెండు కలర్ ఫినిష్‌లతో జనవరి 2 న మొదటి సేల్ ప్రారంభం కానుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో Y20A ధరలు & సేల్స్ వివరాలు

వివో Y20A ధరలు & సేల్స్ వివరాలు

వివో Y20A స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 3GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్ తో భారతదేశంలో రూ.11,490 ధర వద్ద విడుదల అయింది. ఇది నెబ్యులా బ్లూ మరియు డాన్ వైట్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. వివో యొక్క కొత్త ఫోన్ సంస్థ యొక్క భాగస్వామి రిటైల్ దుకాణాలు, వివో ఇండియా ఇ-స్టోర్ మరియు ఇతర ప్రధాన ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి జనవరి 2 నుండి అందుబాటులోకి రానున్నది.

వివో Y20A స్పెసిఫికేషన్స్

వివో Y20A స్పెసిఫికేషన్స్

వివో Y20A స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ OS11 ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.51-అంగుళాల హెచ్‌డి + ఐపిఎస్ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 439 SoC చేత శక్తిని పొందుతూ 3GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది.

వివో Y20A కెమెరా ఫీచర్స్

వివో Y20A కెమెరా ఫీచర్స్

వివో Y20A స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ బోకె లెన్స్, ఎఫ్ / 2,4 ఎపర్చర్‌తో మరో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు నిలువ వరుసలో ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో Y20A 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఫీచర్స్

వివో Y20A 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఫీచర్స్

వివో Y20A స్మార్ట్‌ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 17 గంటల కంటే ఎక్కువ ఆన్‌లైన్ హెచ్‌డి మూవీ స్ట్రీమింగ్ మరియు 10 గంటల సమయం వరకు గేమింగ్ ఆడటానికి బ్యాటరీ బ్యాక్ అప్ లభిస్తుంది అని కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ బోర్డులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 4.2, మైక్రో-USB పోర్ట్, జిపిఎస్, ఎఫ్ఎమ్ రేడియో వంటివి మరిన్ని ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo Y20A Smartphone Launched in India With 10W Fast Charging Support: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X