వోడాఫోన్ ఆల్-రౌండర్ ప్యాక్‌ల పూర్తి వివరాలు

|

టెలికామ్ రంగంలో వొడాఫోన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కస్టమర్ లను కూడా ఎక్కువగా కలిగి ఉన్న వోడాఫోన్ తమ వినియోగదారుల కోసం అనేక రకాల ప్లాన్ లను అందిస్తోంది. వొడాఫోన్‌లో మనం తరచుగా మాట్లాడే చాలా ప్రణాళికలు ఉన్నాయి కానీ అవి అన్ని 'ఆల్ రౌండర్ ప్యాక్‌లు' కాదు. ఇప్పుడు సంస్థ నుండి అన్ని రకాల ప్రయోజనాలతో వస్తున్న ప్రణాళికల గురించి తెలుసుకుందాం.

ఆల్-రౌండర్ ప్యాక్స్
 

ఈ ప్యాక్‌లు వాటి పేరుకు సూచించినట్లే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తాయి. వోడాఫోన్ ‘ఆల్-రౌండర్ ప్యాక్స్' ప్రీపెయిడ్ కస్టమర్లకు డేటా, కాలింగ్ బెనిఫిట్స్ మరియు టాక్ టైమ్‌తో సహా అన్ని అవసరాలను కవర్ చేస్తుంది. ఆల్-రౌండర్ ప్యాక్‌లకు రోజువారీ FUP తో వచ్చే అపరిమిత రీఛార్జ్‌ల కంటే తక్కువ ఖర్చు అవుతుంది.

ఆల్-రౌండర్ ప్యాక్‌లు

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆల్-రౌండర్ ప్యాక్‌లు 300 రూపాయల ధర కంటే తక్కువగా ఉన్నాయి. ఈ ప్యాక్‌లను బ్యాకప్ నంబర్ కోసం ఉపయోగిస్తున్న వారికి ఇది అనువైనది. దీని అర్థం వినియోగదారులు తాత్కాలిక నెంబర్ కోసం తక్కువ డబ్బు ఖర్చు చేసి దాని నుండి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను పొందవచ్చు.

వోడాఫోన్ ఆల్-రౌండర్ ప్యాక్‌లు

వోడాఫోన్ ఆల్-రౌండర్ ప్యాక్‌లు

వోడాఫోన్ అందిస్తున్న ఆల్-రౌండర్ ప్యాక్‌లలో మరి చౌకైనది రూ.15ల ప్లాన్. ఇది ఎటువంటి డేటాను అందించదు అయితే ఫోన్‌లో స్థానిక, జాతీయ మరియు రోమింగ్ ఛార్జీలను నిమిషానికి 30 పైసాకు తగ్గిస్తుంది. ఇది 3 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

ప్రీపెయిడ్
 

తదుపరిది రూ.29 ప్రీపెయిడ్ ప్లాన్ ఇది నిమిషానికి 30 పైస ఛార్జీతో స్థానిక, జాతీయ మరియు రోమింగ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఇది కూడా ఎటువంటి డేటా ప్రయోజనాన్ని అందివ్వదు. దీని యొక్క చెల్లుబాటు 7 రోజులు. 100 ఎమ్‌బి డేటా + రూ .26 టాక్‌టైమ్‌ ను రూ .35 ప్యాక్ అందిస్తుంది. అలాగే 100 ఎమ్‌బి డేటా + రూ .30 టాక్‌టైమ్‌ను రూ.39 ప్యాక్‌తో పొందవచ్చు. రూ.45 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రూ.45 టాక్‌టైమ్, 100 ఎంబి డేటాతో పాటు నిమిషానికి 1 పైసా లోకల్, నేషనల్, రోమింగ్ కాలింగ్ ప్రయోజనాలు ఉన్నాయి.

వోడాఫోన్

వోడాఫోన్ అందిస్తున్న రెండు ఖరీదైన ఆల్-రౌండర్ ప్యాక్‌లు రూ .145 మరియు రూ .245 ప్లాన్‌లు. రూ .145 ప్లాన్ లో నిమిషానికి 30 పైస లోకల్, నేషనల్, రోమింగ్ కాలింగ్‌ను రూ.145 టాక్‌టైమ్, 1 జీబీ డేటాను 42 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అలాగే రూ.245 ప్లాన్ నిమిషానికి 30 పైసల లోకల్, నేషనల్, రోమింగ్ కాలింగ్‌తో పాటు రూ.245 టాక్‌టైమ్, 2 జీబీ డేటాను 84 రోజుల పాటు అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone All-Rounder Packs Details in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X