జియో RS.299 ప్రీపెయిడ్ ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్‌లు

|

ఇండియాలో టెలికామ్ పరిశ్రమలో తీవ్రమైన పోటీ ఉన్నందున దాదాపు అన్ని టెలికం ఆపరేటర్ల యొక్క ప్రీపెయిడ్ టారిఫ్ షీట్ సరిగ్గా ఉండే విధంగా చూస్తున్నారు. ఏదేమైనా మరింత మంది చందాదారులను ఆకర్షించడానికి మరియు పోటీలో ముందు ఉండటానికి అన్ని టెల్కోస్ కంపెనీలు ఎక్కువగా ప్రీపెయిడ్ ప్రణాళికలపై దృష్టి సారిస్తున్నాయి. అలాంటి ప్రీపెయిడ్ ప్రణాళికలలో ఒకటి 299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్.

వొడాఫోన్

భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ సంస్థలు ఒకే ధర వద్ద 299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. అయితే మూడు టెల్కోలు వేర్వేరు ప్రయోజనాలను అందిస్తున్నాయి . ఎయిర్‌టెల్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తో అందిస్తుండగా, జియో యొక్క 299 రూపాయల ప్లాన్ మెరుగైన డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. మరొక వైపు వోడాఫోన్ కూడా దాని 299 రూపాయల ప్లాన్ 70 రోజుల చెల్లుబాటుతో రావడంతో లాంగ్-వాలిడిటీ ప్లాన్‌ను అందించడంపై దృష్టి సారించింది. పరిశ్రమలో ప్రస్తుతం ఏ టెల్కో సంస్థ 299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉత్తమంగా అందిస్తుందో తెలుసుకుందాం.

ఎయిర్టెల్ యొక్క రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

ఎయిర్టెల్ యొక్క రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

కొన్ని నెలలకు ముందు ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ 299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. ఈ ప్రణాళిక ప్రకారం ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 2.5 జిబి రోజువారీ డేటాను మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజులపాటు పొందుతారు. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు 129 రూపాయల విలువైన ఒక నెల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. కాబట్టి ఈ ప్లాన్ అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం పొందడానికి ఇది సరైన సమయం. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం సెప్టెంబర్ 29 నుండి జరగబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో ప్రైమ్ సభ్యులు ఇతరులకన్నా ముందుగా సేల్స్ కోసం యాక్సిస్ పొందుతారు.

రిలయన్స్ జియో యొక్క రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

రిలయన్స్ జియో యొక్క రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో దాదాపు రెండేళ్లుగా ప్రీపెయిడ్ విభాగంలో అగ్రగామిగా ఉంది. జియో చివరిసారిగా తన ప్రీపెయిడ్ ప్రణాళికలను జనవరి 2018 లో సవరించింది. అప్పటి నుండి ఇప్పటివరకు సంస్థ నుండి ఎటువంటి ప్లాన్ సవరణలను చూడలేదు. ఎందుకంటే ఇది ఇప్పటికీ పరిశ్రమలో కొన్ని ఉత్తమమైన సమర్పణలను కలిగి ఉంది. జియో యొక్క రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్ 3 జిబి రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో 28 రోజుల పాటు అందిస్తుంది. అలాగే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది JioCinema, JioTV వంటి అన్ని జియో యాప్ లకు Jio కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తుంది.

వోడాఫోన్ యొక్క రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

చివరగా వోడాఫోన్ యొక్క 299 రూపాయల ప్లాన్‌ ఇతర టెల్కోలతో పోలిస్తే ఇది లాంగ్-వాలిడిటీతో అందిస్తోంది. వోడాఫోన్ యొక్క 299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల కాల వ్యవధి సమయానికి అందిస్తుంది. ఈ 70 రోజుల సమయంలో అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 ఎస్ఎంఎస్ మరియు 3 జిబి 3 జి / 4 జి డేటా వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే వినియోగదారులు వోడాఫోన్ ప్లే మొబైల్ యాప్ కోసం ఉచితంగా యాక్సిస్ ను పొందుతారు.

 రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉత్తమమైంది?

రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉత్తమమైంది?

టెల్కోస్ అందిస్తున్న కొన్ని ప్రీపెయిడ్ ప్రణాళికలు చందాదారులను ఆకర్షించడానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో 299 రూపాయల ప్లాన్ కూడా ఒకటి. మా అభిప్రాయం ప్రకారం ఎయిర్టెల్ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంతో వస్తున్నందున పరిశ్రమలో ఇది ఉత్తమమైనది. కాని డేటా యొక్క ప్రయోజనం గురించి శ్రద్ధ వహించేవారికి రిలయన్స్ జియో యొక్క 299 రూపాయల ప్లాన్ గొప్ప ఎంపిక. చివరగా వొడాఫోన్ యొక్క 299 రూపాయల రీఛార్జ్ ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అంత ఎక్కువ ప్రయోజనాలను అందిచడం లేదు అయితే ఈ ధర పరిధిలో చెల్లుబాటు కాలం విషయంలో మాత్రం ఇది చాలా ఉత్తమమైనది. డేటాతో అవసరం లేని వారికి వోడాఫోన్ యొక్క 299 రూపాయల ప్లాన్ చాలా మంచిది. ఎందుకంటే వోడాఫోన్ యొక్క ఈ ప్లాన్ 70 రోజుల చెల్లుబాటుతో అందిస్తుండగా మిగిలిన రెండు టెల్కోలు కేవలం 28 రోజుల చెల్లుబాటుతో వస్తోంది.

Best Mobiles in India

English summary
Reliance Jio vs Airtel vs Vodafone Rs.299 Prepaid Plan Compared

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X