Home
News

రోజుకు 400MB అదనపు డేటాతో వోడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు

భారతదేశ టెలికాం పరిశ్రమలో అన్ని కంపెనీలు అదనపు మొబైల్ డేటాను అందించడం అనేది ఇప్పుడు వున్న చందాదారులను నిలుపుకోవటానికి మరియు కొత్తవారిని ఆకర్షించడానికి ఉపయోగించే ఓక కొత్త వ్యూహం. ఎయిర్‌టెల్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ తమ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌ల కోసం అదనపు మొబైల్ డేటాను ఇవ్వడం ప్రారంభించాయి.

vodafone idea 400mb extra data prepaid recharge

ఇప్పుడు వోడాఫోన్-ఐడియా కూడా దీనిని అనుసరిస్తోంది. వోడాఫోన్ మరియు ఐడియా చందాదారులు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ఇప్పుడు వారు వాడుతున్న రోజువారీ డేటా కంటే 400MB అదనపు డేటాను అందిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా ప్రెవేశపెట్టిన ఈ అదనపు డేటా ప్లాన్ వోడాఫోన్ మరియు ఐడియా చందాదారులకు ఇప్పుడు రూ. 499, రూ. 399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికలపైన 400MB అదనపు రోజువారీ డేటాను అందిస్తుంది.

vodafone idea 400mb extra data prepaid recharge

వోడాఫోన్-ఐడియా యొక్క ఈ తాజా ఆఫర్ ఎయిర్‌టెల్‌ నుండి నేరుగా తీసుకున్నది. ఇది మే నుండి మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల మీద 400MB అదనపు రోజువారీ డేటాను ఇవ్వడం ప్రారంభించింది.

ఐడియా రీఛార్జ్ :

ఐడియా రీఛార్జ్ :

నివేదిక ప్రకారం ఐడియా చందాదారులు రూ. 499, రూ. 399 బండిల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇప్పుడు వారి రోజువారీ డేటా అలవెన్స్ పైన 400MB అదనపు మొబైల్ డేటాను పొందుతాయి. అయితే My Idea రీఛార్జ్ మరియు చెల్లింపుల యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తేనే అదనపు డేటా ఆఫర్ పొందవచ్చు.

వోడాఫోన్ రీఛార్జ్ :

వోడాఫోన్ రీఛార్జ్ :

వోడాఫోన్ చందాదారులు కూడా రూ.399 ప్లాన్ మీద అదనపు 400MB రోజువారీ ప్రయోజనాన్ని పొందవచ్చు కానీ దీనిని My వోడాఫోన్ యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. స్వతంత్రంగా రూ.499 ప్లాన్‌ను రీఛార్జ్ చేసిన కూడా అదనపు డేటా ఆఫర్‌ లభించదు.

ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఆఫర్స్:

ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఆఫర్స్:

ఐడియా రూ.499 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ముందు రోజుకు 2GB డేటాను మంజూరు చేస్తున్నది. కానీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఆఫర్‌ వలన రోజువారీ డేటా ఇప్పుడు 2.4GBగా ఉంది. అదేవిధంగా వొడాఫోన్ మరియు ఐడియా చందాదారులు రూ. 399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజువారీ డేటా కోటా 1GB నుండి ఇప్పుడు రోజుకు 1.4GB డేటాను పొందుతున్నారు .ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు చెల్లుబాటు సమయంలో అపరిమిత కాలింగ్ మరియు రోజు వారి SMS ప్రయోజనాలు వంటి ఇతర షరతులు కూడా అలాగే ఉంటాయి.

రూ.139 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌:

రూ.139 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌:

ఇటీవల వొడాఫోన్ తన రూ.139 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను చెల్లుబాటు వ్యవధిలో 5 జీబీ డేటాకు సవరించింది. అంతకుముందు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ కేవలం 3 జిబి డేటాతో 28 రోజుల సమయంలో అందిస్తున్నారు. ఈ వోడాఫోన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు చెల్లుబాటు వ్యవధిలో 300 స్థానిక మరియు జాతీయ SMS లను కూడా అందిస్తుంది.

మరిన్ని ప్లాన్‌లు:

మరిన్ని ప్లాన్‌లు:

వోడాఫోన్ అదే ధర పరిధిలో మరో రెండు ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఒకటి రూ.129 రీఛార్జ్ ప్లాన్ కాగా మరొకటి రూ .149 రీఛార్జ్ ప్లాన్ . 129రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ మరియు 2 GB 3G / 4G డేటాను అందిస్తుంది. ఇది అపరిమిత స్థానిక మరియు జాతీయ కాలింగ్ మద్దతుతో కూడా వస్తుంది. అలాగే రూ.149ల ప్లాన్ అపరిమిత స్థానిక మరియు జాతీయ కాలింగ్ మద్దతుతో పాటు ఇది 2GB డేటాను 28 రోజుల చెల్లుబాటు సమయంతో అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vodafone idea 400mb extra data prepaid recharge
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X