Home
News

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్రయోజనంతో ఎయిర్‌టెల్, జియోకు పోటీగా Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు...

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లు భారతీ ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో టెల్కోలు ఇటీవల ప్రారంభించిన వాటి యొక్క ప్రయోజాలకు దీటుగా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క ఈ కొత్త ప్లాన్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్-ఓన్లీ ప్రయోజనంతో వస్తాయి. Vi టెల్కో భారతదేశం అంతటా గల తన యొక్క వినియోగదారులకు ఈ ప్లాన్‌లను అందిస్తోంది. ఇవన్నీ ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్ మరియు టెల్కో మొబైల్ యాప్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లు వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తున్నాయో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వొడాఫోన్ ఐడియా(Vi) - డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వొడాఫోన్ ఐడియా(Vi) - డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో ఇప్పుడు OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో నాలుగు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జాగ్రత్తగా గమనిస్తే పాత ప్లాన్‌లే ధరల పెంపును అందుకొని అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ యొక్క ప్రయోజనంతో లభిస్తాయి. కానీ ఈ ప్లాన్‌లు జియో మరియు ఎయిర్‌టెల్ అందించే ధరలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకా ఇవి ఎయిర్‌టెల్ మరియు జియో సమర్పణల కంటే మెరుగ్గా కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ల యొక్క ప్రయోజనాలు ఎంత మెరుగ్గా ఉన్నాయో వంటి వివరాలు తెలుసుకుందాం.

Vi

వొడాఫోన్ ఐడియా(Vi) టెల్కో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనాలతో ప్రారంభించిన మొదటి కొత్త ప్లాన్ రూ.501 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఇది వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అందించడంతో పాటుగా కంపెనీ నుండి 16GB బోనస్ డేటా కూడా అదనంగా లభిస్తుంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మరియు Vi మూవీస్ & టీవీ వంటి ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను అందిస్తుంది.

రూ.701 ప్లాన్

వొడాఫోన్ ఐడియా(Vi) కొత్తగా ప్రారంభించిన రెండవ ప్లాన్ రూ.701 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ మరియు Vi మూవీస్ & టీవీ సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచిత యాక్సిస్ అందించడంతో పాటుగా 3GB రోజువారీ డేటా మరియు 32GB బోనస్ డేటాను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే రూ.901 ధర వద్ద లభించే ప్లాన్ 3GB రోజువారీ డేటా మరియు 48GB బోనస్ డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఇది కూడా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మరియు Vi మూవీస్ & టీవీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తుంది. అలాగే రూ.2,595 ధర వద్ద లభించే దీర్ఘకాలిక ప్లాన్ అదే డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మరియు Vi మూవీస్ & టీవీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో 1.5GB రోజువారీ డేటాతో 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది.

వాయిస్ కాలింగ్

వొడాఫోన్ ఐడియా(Vi) కొత్తగా ప్రారంభించిన ఈ ప్లాన్‌లన్నీ కూడా వినియోగదారులకు ఉచిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో వస్తాయని గమనించండి. ఇంకా వీరికి 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' మరియు 'బింగే ఆల్ నైట్' ఆఫర్‌ కూడా ఉపయోగించుకుంటారు. ఈ ప్రయోజనాలు ఈ ప్లాన్‌లను Jio మరియు Airtel తమ వినియోగదారులకు అందించే స్థాయి కంటే ఎక్కువగా తీసుకుంటాయి.

డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌

డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ని ముందునుంచి కూడా రూ.601 డేటా వోచర్ ప్లాన్ తో అందిస్తుంది. ఇది 56 రోజుల చెల్లుబాటు కాలానికి వినియోగదారులకు 75GB డేటాను అందిస్తుంది. పైన పేర్కొన్న ప్రతి ప్లాన్‌తోను టెల్కో రూ.499 ధర విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ ను ఉచితముగా అందిస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లు వినియోగదారులకు 1-సంవత్సరం పాటు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి మరియు అవి ఒకేసారి ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే ప్రసారం చేయడానికి అనుమతిస్తాయి.

జియో - డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనం

జియో - డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనం

రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారుల కోసం సెప్టెంబర్ 1, 2021 నుండి డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో కొన్ని ప్లాన్‌లను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లు కస్టమర్‌లకు డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్ లో ఇంగ్లీష్‌తో సహా పూర్తిస్థాయి అంతర్జాతీయ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇస్తాయి. ఈ కొత్త ప్లాన్‌లు రూ.499, రూ.666, రూ.888, రూ.2,599 మరియు రూ.549 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్‌లలో రూ.549 ‘డేటా వోచర్' ప్లాన్ మినహా మిగిలినవన్నీ కూడా అపరిమిత వాయిస్ కాలింగ్, SMS మరియు డేటా ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్‌లతో వినియోగదారులకు అందించే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది. వినియోగదారులు అంతర్జాతీయ కంటెంట్‌ను ఇంగ్లీష్‌లో కూడా యాక్సెస్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Announced Four New Disney+ Hotstar Prepaid Plans: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X