Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలు పెరిగాయి!!ఓ లుక్ వేయండి...
ఇండియాలోని టెలికాం సంస్థలలో ప్రస్తుతం అధికంగా యూజర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా(Vi) సంస్థ తన యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను చెన్నై, తమిళనాడు, కోల్‌కతా మరియు మహారాష్ట్ర & గోవా వంటి నాలుగు సర్కిల్‌లలో పెంచింది. ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌లో రూ.598, రూ.699 ధరల వద్ద లభించే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఇప్పుడు రూ.649, రూ.799 ధరలకు పెంచింది. సవరించిన కొత్త ధరలు యుపి ఈస్ట్ ప్రాంతంలో మాత్రమే ప్రభావవంతంగా ఉన్నాయి. పైన పేర్కొన్న ఐదు సర్కిల్‌లలో కొత్త మార్పుల తరువాత పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్‌లు రూ.649, రూ .799, రూ .999, రూ .948, రూ .1,348 ధర వద్ద లభిస్తాయి. ఇతర సర్కిల్‌లలో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రూ .598, రూ .749, రూ .899 మరియు రూ.999 ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి.

Vi రూ.649 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్
భారతదేశంలో ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా టెలికాం ఆపరేటర్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లను అన్ని 17 టెలికాం సర్కిల్‌లలోను అందిస్తున్నది. రూ.649 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రెండు కనెక్షన్‌లతో లభిస్తుంది. Vi యొక్క ఈ ప్లాన్ మొత్తం డేటా ప్రయోజనంలో 80GB ఉంటుంది. ఇందులో ప్రాధమిక కనెక్షన్ కోసం 50GB మరియు ద్వితీయ కనెక్షన్ కోసం 30GB గా విభజించబడింది. మొదటి కనెక్షన్ హోల్డర్ 200GB డేటాను తీసుకెళ్లగలరు, అయితే ద్వితీయ కనెక్షన్ వినియోగదారులు 50GB వరకు డేటాను రోల్ చేయవచ్చు. రెండు కనెక్షన్లకు అందించే ఇతర ప్రయోజనాలు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు నెలకు 100 SMS లు ఉన్నాయి.

Vi రూ.799 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్
Vi Rs 799 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మూడు కనెక్షన్‌లతో లభిస్తుంది. ఇందులో Vi అందించే మొత్తం డేటా ప్రయోజనం 120GB. మొదటి కనెక్షన్ కోసం 60GB మరియు సెకండరీ కనెక్షన్ల కోసం చెరొక 30GB డేటా విభజించబడింది. డేటా రోల్‌ఓవర్ సౌకర్యం రూ.649 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాదిరిగానే ఉంది. అలాగే అపరిమిత కాలింగ్ మరియు నెలకు 100 SMSల ప్రయోజనం కూడా లభిస్తుంది. జాబితాలో మూడవది ఐదు కనెక్షన్లతో లభించే 999 రూపాయల ఫ్యామిలీ ప్లాన్ 200GB మొత్తం డేటాను అందిస్తుంది. ఇందులో ప్రాధమిక కనెక్షన్ కోసం 80GB మరియు ద్వితీయ కనెక్షన్ల కోసం 30GB గా విభజించబడి ఉంటుంది.

Vi రూ.948 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
Vi రూ.948 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ద్వారా మొదటి కనెక్షన్‌కు అపరిమిత హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అలాగే రెండవ కనెక్షన్ కోసం 30GB పరిమిత డేటా రోల్‌ఓవర్‌ను కూడా తెస్తుంది. అలాగే వాయిస్ కాలింగ్ ప్రయోజనాల పరంగా ఈ ఫ్యామిలీ ప్లాన్ అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే రెండు కనెక్షన్ల కోసం నెలకు 100 SMSల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








