రూ.2.67 తక్కువ ధరకే 1GB డేటాను అందిస్తున్న Vi!! ఇతరులతో పోలిస్తే చాలా తక్కువ...

|

భారత టెలికాం పరిశ్రమలోని సంస్థలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా (Vi) తన యొక్క వినియోగదారులను నిలుపుకోవడానికి మరియు కొత్త వారిని ఆకట్టుకోవడానికి వినూత్నమైన పద్దతిలో అద్భుతమైన మరియు ప్రత్యేకమైన ఆఫర్లను ఎప్పటికప్పుడు అందిస్తున్నది. Vi యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పోలిస్తే ఎయిర్‌టెల్ మరియు జియో యొక్క ప్లాన్‌లు మరింత ఎక్కువ ఆకర్షణీయంగా అనిపించవు.

Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు

Vi యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇతర ప్రైవేట్ ఆపరేటర్ల ప్రణాళికల కంటే స్వల్పంగా ఖరీదైనవి అయినప్పటికీ అధిక మొత్తంలో డేటాను కోరుకునే వినియోగదారులకు ఇవి మరింత విలువైనవిగా ఉంటాయి. కరోనా మహమ్మారి సమయంలో వినియోగదారులు అధికంగా డేటాను వినియోగించడం మీద దృష్టి సారించి Vi కొత్త ప్లాన్‌లను రూపొందించింది. దాని ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ప్రత్యేకమైనవి ఆఫర్లు ఉండడమే కాకుండా ఇవి బోనస్ డేటాతో లభిస్తాయి. Vi టెలికాం సంస్థ అధికంగా డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్ లను పూర్తిగా పరిశీలిద్దాం. ఈ కొత్త ప్లాన్‌లు వినియోగదారులకు 1GB డేటాను కేవలం రూ.2.67 కు మాత్రమే అందిస్తుంది. ఇది చౌకైన డేటా మాత్రమే కాకుండా ఈ ప్లాన్ పరిశ్రమ యొక్క ప్రత్యేకమైన ఆఫర్‌లైన 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' మరియు 'బింగే ఆల్ నైట్' వంటి వాటితో వస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా రూ .801 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా రూ .801 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా(Vi) నుండి లభించే రూ.801 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అంటే ఈ ప్లాన్ వ్యవధిలో వినియోగదారులు మొత్తంగా 252GB డేటాను పొందుతారు. అయితే 252GB డేటాతో పాటుగా కంపెనీ అదనంగా మరొక 48GB డేటాను బోనస్ గా కూడా అందిస్తోంది. అంటే ఈ ప్లాన్‌తో వినియోగదారులు పొందే మొత్తం డేటా 300GB. ఈ డేటా ప్రయోజనాలు కాకుండా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇవే కాకుండా ఈ ప్లాన్ 'వీకెండ్ డేటా రోల్ఓవర్' మరియు 'బింగే ఆల్ నైట్' వంటి మరొక రెండు ఆఫర్లతో కూడా వస్తుంది.

వీకెండ్ డేటా రోల్‌ఓవర్

'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్ అనేది వినియోగదారులు ఒక వారంలో (సోమవారం నుండి శుక్రవారం వరకు) మధ్యలో మిగిలిపోయిన ఎఫ్‌యుపి డేటాను వారాంతాల్లో (శనివారం-ఆదివారం) వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే 'బింగే ఆల్ నైట్' ఆఫర్ తో ప్రతిరోజూ ఉదయం 12 నుండి 6 గంటల మధ్య అధిక వేగంతో డేటాను వినియోగించుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ సమయంలో డేటా పరిమితి ఏమి లేవు. అంటే రాత్రి (12 AM నుండి 6 AM) వరకు వినియోగించే డేటా రోజువారి FUP డేటాను ప్రభావితం చేయదు.

ఓవర్-ది-టాప్

వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క ఈ ప్లాన్‌తో వినియోగదారులు పొందే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు రెండు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇందులో మొదటి OTT ప్రయోజనం విషయానికి వస్తే 1 సంవత్సర వాలిడిటీతో డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనం. వినియోగదారులు ఒక్కొక్కటిగా ఈ చందాను కొనుగోలు చేస్తే వారికి సంవత్సరానికి రూ.399 ఖర్చవుతుంది. అయితే ఈ రూ.801 ప్లాన్‌తో దీనిని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.

ఇవే కాకుండా Vi మూవీస్ & టీవీ యొక్క OTT ప్రయోజనం కూడా ఉంది. Vi మూవీస్ & టీవీ యాప్ iOS మరియు ఆండ్రాయిడ్ పరికరాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3GB రోజువారీ డేటా ప్లాన్‌ను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందించే ఇతర ఆపరేటర్లతో పోలిస్తే Vi నుండి వచ్చిన ఈ ప్లాన్ కేవలం చౌకైనది మాత్రమే కాకుండా ఇతర ఆపరేటర్ల ప్లాన్ ల కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులు చాలా మంది ప్రస్తుతం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ప్లాట్‌ఫామ్ లో ప్రసారం అయ్యే ఐపిఎల్ 2021 క్రికెట్ మ్యాచ్ లను చూడడం కోసం అధికంగా డేటాను వినియోగిస్తున్నారు. అటువంటి వారికి ఈ ప్లాన్ సరైనది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Telco Offering 1GB Data For as Low Cost as Rs 2.67 on This Prepaid Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X