Home
News

Vodafone నుంచి మరో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు...ఇవే!

వోడాఫోన్ ఇప్పుడు 'వాల్యూ యాడెడ్ సర్వీస్' విభాగం కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకువచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల USP 'సర్వీస్ వాలిడిటీ' ప్రయోజనం. రూ .47, రూ .67, రూ .78 ధరతో గల ఈ కొత్త ప్లాన్‌లు 'కాలర్ ట్యూన్' ప్రయోజనం మరియు సర్వీస్ వాలిడిటీను 90 రోజుల వరకు అందిస్తున్నాయి.

కాలర్ ట్యూన్ ప్లాన్‌లు

ఇవి ఆల్ రౌండర్ ప్లాన్‌ల మాదిరిగా టాక్ టైమ్ మరియు డేటా బెనిఫిట్ వంటి ప్రయోజనాలను అందివ్వవు. కానీ దానికి బదులుగా కంపెనీ కాలర్ ట్యూన్ ప్రయోజనాన్ని అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం వోడాఫోన్ 56 రోజుల సర్వీసు వాలిడిటీతో రూ.95 కొత్త ఆల్ రౌండర్ ప్యాక్‌ను విడుదల చేసింది. రూ.95 ఆల్ రౌండర్ ప్లాన్ మాదిరిగానే కొత్త కాలర్ ట్యూన్ ప్లాన్‌లు ప్రస్తుతానికి ఎంపిక చేసిన సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ కాలర్ ట్యూన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ కాలర్ ట్యూన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ సంస్థ ‘వాల్యూ యాడ్ఎడ్ సర్వీస్' లైనప్‌లో భాగంగా మూడు కొత్త కాలర్ ట్యూన్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఇందులో రూ.47 ధర గల ప్లాన్‌ 28 రోజుల పాటు వాలిడిటీని మరియు యూజర్ కాలర్ ట్యూన్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ ప్రయోజనంతో వస్తుంది. అంటే వినియోగదారులు ఇన్‌కమింగ్ వాయిస్ కాల్‌లను స్వీకరిస్తూనే ఉంటారు. వినియోగదారులు టాక్ టైమ్ ప్లాన్‌లను రూ.10 లేదా మరొక దానితో రీఛార్జ్ చేస్తే వారు అవుట్గోయింగ్ వాయిస్ కాల్స్ యాక్సిస్ అవుట్‌గోయింగ్ కాల్ ఛార్జీల వద్ద చేయగలరు.

వోడాఫోన్ వాస్ ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ వాస్ ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క రూ.67 వాస్ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వాలిడిటీతో పాటు కాలర్ ట్యూన్ ప్రయోజనాన్ని అందిస్తుంది. చివరిగా రూ.78 ప్లాన్ అదే కాలర్ ట్యూన్ ప్రయోజనంతో పాటు 89 రోజుల వాలిడిటీని అందిస్తుంది. రూ.47 ప్లాన్ మాదిరిగానే రూ .67 మరియు రూ .78 ప్లాన్లు కూడా వరుసగా 90 రోజులు మరియు 89 రోజులు సర్వీస్ వాలిడిటీ ప్రయోజనంను అందిస్తాయి. ఈ మూడు ప్లాన్లలో ఏదీ కూడా సంస్థ యొక్క అపరిమిత కాంబో లేదా ఆల్ రౌండర్ ప్లాన్‌ల వంటి టాక్ టైమ్ మరియు డేటా వంటి ప్రయోజనాలను అందించదు.

వోడాఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు

వోడాఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు

వోడాఫోన్ కొత్తగా VAS ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించినప్పటికీ ఇది సర్వీస్ వాలిడిటీ బెనిఫిట్‌తో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను ఇప్పటికీ అందిస్తూనే ఉంది. యాడ్-ఆన్ ప్యాక్లలో రూ.16 ప్లాన్ 1 జీబీ డేటా ప్రయోజనాన్ని 24 గంటల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. రూ.48, రూ.98 డేటా యాడ్-ఆన్‌లు 3 జీబీ, 6 జీబీ డేటా బెనిఫిట్‌తో 28 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తాయి.

ఇన్‌కమింగ్ వాయిస్ కాల్‌

ఇన్‌కమింగ్ వాయిస్ కాల్‌

వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ఇన్‌కమింగ్ వాయిస్ కాల్‌లను స్వీకరించడానికి నెంబర్ యాక్సిస్ లో ఉండడం అవసరం. వొడాఫోన్ యూజర్లు క్రియాశీల సర్వీస్ వాలిడిటీను కలిగి ఉంటే వారు అవుట్గోయింగ్ కాల్స్ చేయడానికి టాక్ టైమ్ ప్లాన్లను కూడా రీఛార్జ్ చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Launched Three New Caller Tune Prepaid Plans: Here are The Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X