Airtel, Vodafone, Jio కొత్తగా అందిస్తున్న రోజువారి అధిక డేటా ప్లాన్‌లు
కరోనావైరస్ కారణంగా భారత ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌లో ఇంకా 17 రోజులు మిగిలి ఉండటంతో ఎక్కువ మంది టెక్ సంస్థల ఉద్యోగులు మిగిలిన అన్ని తోజులు తమ ఇంటి వద్ద నుండే పనిచేయవలసి ఉంటుంది. దీని కారణంగా వినియోగదారులు వారి యొక్క రోజువారీ మొబైల్ డేటాను అధికంగా వినియోగిస్తున్నారు.

ఇంటి నుండి పనిచేసే వారిలో అదనపు డేటా అవసరం ఉన్న వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు వారికి సహాయపడే విధంగా వివిధ రకాల ప్లాన్ లను అందిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుండి వచ్చిన సమాచారం ప్రకారం 2019 డిసెంబర్ కాలం నాటికి భారతదేశంలో 19.14 మిలియన్ల మంది మాత్రమే వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను వాడుతున్నారు. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు 642.80 మిలియన్ల వద్ద ఉన్నారు, ఇది చాలా మంది పౌరులు వృత్తిపరమైన ఉపయోగం కోసం సెల్యులార్ కనెక్షన్‌ను ఉపయోగిస్తుందని సూచిస్తుంది.

భారతీయ టెలికం ఆపరేటర్లు
భారతీయ టెలికం ఆపరేటర్లైన భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు రిలయన్స్ జియో యొక్క టాప్-అప్ ప్యాక్‌ల ద్వారా అదనపు డేటాను అందిస్తున్నాయి. ఈ ఆపరేటర్లు తమ ప్రధాన ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులకు అధిక డేటాను అందించే ప్లాన్‌లను కూడా అందిస్తున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో
రిలయన్స్ జియో తన వినియోగదారులకు అన్ని రకాల ప్లాన్‌ల మీద రోజుకు కనీసం 1GB డేటాను అందిస్తోంది. జియో సంస్థ రోజువారి 3GB డేటాను కూడా అనేక ప్లాన్‌ల మీద అందిస్తుంది. రిలయన్స్ జియో మరియు ఇతరులు అందిస్తున్న సరసమైన ప్లాన్‌లు ప్రస్తుత కాలంలో అందరికి సరిపోవు. ప్రస్తుత లాక్డౌన్ వ్యవధిలో చాలా మందికి రోజువారీ 3GB డేటా ప్లాన్‌లు సరిగ్గా సరిపోతాయి. రిలయన్స్ జియో యొక్క టాప్ టైర్ 3GB ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో రూ.349 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ జియో టు జియో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 1000 నాన్-జియో నిమిషాలతో పాటు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.

వోడాఫోన్
వొడాఫోన్ పరిమిత ప్లాన్‌లపై డబుల్ డేటా ఆఫర్‌ను అమలు చేసింది. వోడాఫోన్ యొక్క రూ.249 ధర వద్ద గల ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా మరియు 1.5GB అదనపు రోజువారీ డేటాను అందిస్తుంది. బేస్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో అన్ని నెట్వర్క్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకు 3GB డేటాతో పాటుగా బేస్ ప్లాన్ యొక్క సారూప్య ప్రయోజనాలను అందించే రూ.349 మరియు రూ.599 ప్లాన్‌లను కూడా కంపెనీ అందిస్తుంది. ఇవి రెండు వరుసగా 56 రోజులు మరియు 84 రోజుల వాలిడిటీతో లభిస్తాయి.

వోడాఫోన్ స్వతంత్ర డేటా ప్లాన్‌లు
డబుల్ డేటా ఆఫర్ ప్లాన్ లు కాకుండా వోడాఫోన్ రోజువారీ 3GB డేటా స్వతంత్ర డేటా ప్లాన్‌ను కూడా అందిస్తున్నది. ఈ ప్లాన్ రోజువారీ 3GB డేటా ప్రయోజనాలతో పాటు పైన పేర్కొన్న అన్ని రకాల ప్లాన్‌లకు సమానమైన అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తాయి. వీటి యొక్క ధరలు మరియు వాలిడిటీ వరుసగా 28 రోజుల వాలిడిటీ గల ప్లాన్ యొక్క ధర రూ.398 మరియు 56 రోజుల చెల్లుబాటు గల ప్లాన్ యొక్క ధర 558 రూపాయలు.

ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ యొక్క టాప్ టైర్ డేటా ప్లాన్ రూ.398 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ కాలానికి రోజువారి 3GB డేటా ప్రయోజనం మరియు అన్ని నెట్వర్క్ లకు అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100SMS ల ప్రయోజనాలను అందిస్తుంది. రూ.398 ప్లాన్ మాదిరిగానే ఇలాంటి ప్రయోజనాలను అందించే రూ.588 ప్లాన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. అయితే ఇది 56 రోజుల వాలిడిటీతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








