Vodafone స్పెషల్ 4జీ ఆఫర్, ఏంటో తెలుసా..?
టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ వినియోగదారుల కోసం ఓ స్పెషల్ 4జీ ప్లాన్‌ను ప్రకటించింది. కష్టమర్లకు వినోదాల విందును అందించనుంది.
టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ వినియోగదారుల కోసం ఓ స్పెషల్ 4జీ ప్లాన్‌ను ప్రకటించింది. కష్టమర్లకు వినోదాల విందును అందించనుంది. తమ కస్టమర్లకు బాలీవుడ్, హాలీవుడ్, రీజనల్ మూవీస్, అమెరికా టీవీ షోలు, కిడ్స్ ప్రొగ్రామింగ్, గ్లోబల్ అమెజాన్ ఒరిజనల్స్ అందించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాతో కంపెనీ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.

మార్చి 22 నుంచి
మార్చి 22 నుంచి వొడాఫోన్ ఈ సూపర్ నెట్ 4జీ నెట్‌వర్క్ స్పెషల్ ఆఫర్ ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. అప్పటి ఉంచి అమెజాన్ ప్రైమ్‌ను ఎంజాయ్ చేయొచ్చని కస్టమర్లకు తెలిపింది.

రూ.499 వార్షిక సబ్ స్క్రిప్షన్‌తో
ఇందుకోసం రూ.499 వార్షిక సబ్ స్క్రిప్షన్‌తో అమెజాన్ ప్రైమ్‌ను మై వొడాఫోన్ యాప్ లేదా వొడాఫోన్ వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అమెజాన్ ద్వారా రూ.250 క్యాష్ బ్యాక్‌ను
దీంతో పాటు అమెజాన్ ద్వారా రూ.250 క్యాష్ బ్యాక్‌ను యూజర్లు పొందనున్నారు. ఆండ్రాయిడ్ డివైజ్‌లకే ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది.

వినోదపు కంటెంట్ పొందడానికి
కష్టమర్లు వినోదాన్ని కోరుకుంటున్నారని, వారు వినోదపు కంటెంట్ పొందడానికి ప్రయత్నిస్తున్నారని, అమెజాన్ ప్రైమ్ వీడియో భాగస్వామ్యంతో తమ కస్టమర్లకు ఇది తేలికగా అందించవచ్చని వొడాఫోన్ పేర్కొంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాతో
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న తొలి టెలికాం కంపెనీ వొడాఫోనే. తమ కంటెంట్ ప్రతిపాదనకు మరింత బలం చేకూర్చేందుకు ఈ పార్టనర్ షిప్ ఎంతో సహకరించనుందని తెలిపింది.


Click it and Unblock the Notifications








