గొప్ప డేటా బెనిఫిట్ తో వోడాఫోన్ రూ.229 ప్రీపెయిడ్ ప్లాన్

|

వొడాఫోన్ ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియో గత కొన్ని నెలలుగా వొడాఫోన్ కస్టమర్ల కోసం వోడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టిన అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల సౌజన్యంతో అభివృద్ధి చెందింది. ఈ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా ప్రీపెయిడ్ ప్లాన్‌లు 500రూపాయల పరిధిలో ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు వివిధ రకాల ప్రయోజనాలతో వస్తాయి. వీటిలో కొన్ని కేవలం డేటా-ఆధారితమైనవి.

గొప్ప డేటా బెనిఫిట్ తో వోడాఫోన్ రూ.229 ప్రీపెయిడ్ ప్లాన్

 

మరికొన్ని వాయిస్ -ఆధారిత మరియు కొద్దిగా డేటా వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే కాంబో సమర్పణలను ఇష్టపడే వినియోగదారుల కోసం వోడాఫోన్ పోర్ట్‌ఫోలియోలో రూ.229 ప్రీపెయిడ్ ప్లాన్ చేర్చబడింది. మీరు నెలవారీ ఉత్తమ పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది.

గొప్ప డేటా బెనిఫిట్ తో వోడాఫోన్ రూ.229 ప్రీపెయిడ్ ప్లాన్

మీరు ఉహించినట్లుగానే ఈ ప్లాన్ 229రూపాయలకు 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇది టెలికాం ఆపరేటర్ నుండి వస్తున్న కాంబో ఆఫర్. ఈ ప్రణాళిక గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

వోడాఫోన్ యొక్క 229రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ వివరాలు:

వోడాఫోన్ యొక్క 229రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ వివరాలు:

వోడాఫోన్ యొక్క 229రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ బోనస్ కార్డ్ అపరిమిత ప్లాన్. ఈ ప్లాన్ లో ముఖ్యమైన విషయం ఇది టాక్ టైమ్ ఇవ్వదు. ఏదేమైనా వోడాఫోన్ చందాదారులు ఈ ప్లాన్‌తో తమ నంబర్లను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జిబి డేటాతో పాటు భారతదేశంలోని ఏ నెట్వర్క్ కు అయిన అపరిమిత లోకల్, ఎస్‌టిడి మరియు రోమింగ్ కాల్‌లను ఆస్వాదించవచ్చు. ఈ రూ .229 ప్రీపెయిడ్ ప్లాన్ డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలతో పాటు వోడాఫోన్ చందాదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. చివరగా వినియోగదారులు వోడాఫోన్ ప్లే యాప్‌లో ఉచిత లైవ్ టీవీ, సినిమాలు మరియు మరిన్ని చూడగలరు. ఈ 229రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది.

255రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్:

255రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్:

గుర్తుచేసుకుంటే అన్ని సర్కిల్‌లలో ఇప్పుడు తొలగించబడిన వోడాఫోన్ యొక్క రూ .255 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ ముందు అన్ని రకాల ప్రయోగానాలను అందించేది. అంటే పాత రూ.255 ప్లాన్ కొత్త 229రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే అన్ని రకాల ప్రయోజనాలను అందించింది. కాబట్టి వోడాఫోన్ 255రూపాయల ప్లాన్ ధరను 229రూపాయలకు తగ్గించిందని అర్థం.

 16రూపాయల వోడాఫోన్ ఫిల్మీ రీఛార్జ్ ప్లాన్:
 

16రూపాయల వోడాఫోన్ ఫిల్మీ రీఛార్జ్ ప్లాన్:

ఇటీవల వోడాఫోన్ వినియోగదారుల కోసం అనేక కొత్త కొత్త ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు మరియు ప్రణాళికలను ప్రవేశపెడుతోంది. సుమారు నెల క్రితం వొడాఫోన్ తన చందాదారుల కోసం ఈ కొత్త 16రూపాయల ఫిల్మీ రీఛార్జిని విడుదల చేసింది. ఈ ఫిల్మీ రీఛార్జ్16రూపాయలకి వస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు ఒక రోజుకు 1GB డేటాను అందిస్తుంది ఇది తప్ప మరేమీ ప్రయోజనం లేదు. పేరు సూచించినట్లుగా వోడాఫోన్ చందాదారులు ఈ డేటాను వారి డేటా ప్యాక్ పెంచడానికి మరియు సరికొత్త బ్లాక్ బస్టర్ లేదా తమకు నచ్చిన ఏదైనా సినిమాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐడియా సెల్యులార్ కూడా అదే ప్రయోజనాలతో కొత్త రూ.16 రీఛార్జిని ప్రవేశపెట్టింది.

వోడాఫోన్ ఇతర ప్రీపెయిడ్ ప్రణాళికల ఆఫర్లు :

వోడాఫోన్ ఇతర ప్రీపెయిడ్ ప్రణాళికల ఆఫర్లు :

వొడాఫోన్ ప్రస్తుతం దాని యొక్క కొన్ని ప్లాన్‌లను అందిస్తున్న ఆఫర్‌ల గురించి మాట్లాడుతుంటే వోడాఫోన్ అందిస్తున్న అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌లలో ఒకటి ప్రైమ్‌లోని యూత్ ఆఫర్. ఈ ఆఫర్‌లో భాగంగా 18 నుంచి 24 ఏళ్లలోపు వొడాఫోన్ ప్రీపెయిడ్ చందాదారులు తమ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంపై 50% తగ్గింపు పొందగలరు. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం యొక్క సాధారణ ధర 999 రూపాయలు కానీ ఈ ఆఫర్ ద్వారా వారు ఈ సభ్యత్వాన్ని కేవలం 499 రూపాయలకు మాత్రమే పొందగలుగుతారు.

ఒక వేళ మీరు వోడాఫోన్ యొక్క 229రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మీద పెద్దగా ఆసక్తి చూపకపోతే వోడాఫోన్ ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్, రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ లు 28 రోజుల కాల పరిమితికి అలాగే 90రోజుల కాల పరిమితికి 509రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి వీటితో పాటు ఇంకా చాలా రకాల ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
vodafone prepaid recharge validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more