Vodafone కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు....
టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ తన వినియోగదారుల కోసం రూ.200 ధర లోపు కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్‌ల యొక్క ధరలు వరుసగా రూ.109 మరియు రూ.169. ఈ రెండు ప్యాక్‌లు కూడా 20 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి కాకపోతే డేటా యొక్క ప్రయోజనంలో తేడాలను కలిగి ఉన్నాయి. వోడాఫోన్ యొక్క అన్ని సర్కిల్‌లలో ఈ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు
వోడాఫోన్ కొత్తగా ప్రారంభించిన రూ.109 ప్యాక్ ‘అన్‌లిమిటెడ్ ప్యాక్స్' విభాగంలో అత్యంత సరసమైన ఆఫర్‌గా ఉంది. అయితే రూ.169 ప్లాన్ రోజువారీ డేటా ప్రయోజనంతో లభిస్తున్న అత్యంత సరసమైన ప్లాన్. వోడాఫోన్‌లో ఇప్పటికే రూ.109, రూ.129, రూ.149, రూ.169, రూ.199 ధరల వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ రూ.109 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు
వోడాఫోన్ కొత్తగా ప్రారంభించిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మొదటిది రూ.109 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులకు మొత్తం చెల్లుబాటు కాలానికి 1GB డేటాను మరియు 300SMS లను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 20 రోజులు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో వొడాఫోన్ ZEE5 మరియు వొడాఫోన్ ప్లే చందాలను అందించడం లేదు.

వోడాఫోన్ రూ.169 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు
వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రెండవది రూ.169 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్. రోజువారీ డేటా ప్రయోజనంతో వోడాఫోన్ అందిస్తున్న చౌకైన ప్రీపెయిడ్ సెగ్మెంట్ ప్లాన్ ఇదే కావడం విశేషం. ఈ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలంలో రోజుకు 1GB 4G డేటా చొప్పున 20GB డేటాను అందిస్తుంది. దీనితో పాటుగా రోజుకు 100 SMS లు మరియు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 20 రోజులు.

వోడాఫోన్ ఇతర ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు
వోడాఫోన్ సంస్థ రూ.109 మరియు రూ.169 ప్లాన్‌ల మధ్య మరొక రెండు రూ.129, రూ.149 ప్రీపెయిడ్ ప్యాక్‌లను తన వినియోగదారులకు అందిస్తున్నది. రూ.129 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 24 రోజుల వాలిడిటీతో 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే రూ.149 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రూ.129 రీఛార్జి ప్లాన్ అందించే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. రూ.129 మరియు రూ .149 ప్లాన్‌లు రెండూ వోడాఫోన్ ప్లే మరియు Zee5 వంటి OTT యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. వొడాఫోన్ రాబోయే రోజుల్లో రూ .109 మరియు 169 ప్లాన్‌లకు కూడా OTT యాప్ల ప్రయోజనాన్ని అందించవచ్చు.


Click it and Unblock the Notifications