అన్నింటికీ ఒకటే: సరికొత్త ప్లాన్‌తో దూసుకొచ్చిన వొడాఫోన్

Written By:

టెలికం రంగంలో సత్తా చాటుతున్న వొడాఫోన్ ఇప్పుడు వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. ప్రి-పెయిడ్ ప్లాన్ 'ఫ్లెక్స్ పేరుతో ఈ ప్లాన్ ను విడుదల చేసింది. దీని ద్వారా కష్టమర్లు అన్నింటినీ ఒకేసారి రీ ఛార్జ్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్, రోమింగ్ వంటి పలు అంశాలను కోరుకుంటోన్న యూజర్లకి ఈ ప్యాక్ అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్లాన్ హైలెట్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

ఇప్పుడు రెండే నిమిషాల్లో మీ సిమ్ యాక్టివేషన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అన్నింటికీ ఒకే రీచార్జ్

ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు వాయిల్స్ కాల్స్, డేటా, రోమింగ్, ఎస్ఎంఎస్లకు వివిధ రకాల రీచార్జ్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అన్నింటికీ ఒకే రీచార్జ్ సరిపోతుంది.

ఫ్లెక్స్' అనే యూనిట్లు

ప్రస్తుత రీచార్జ్‌కి కొత్త ఫ్లెక్స్ ప్లాన్ రీచార్జ్‌కి కొంత తేడా ఉంటుంది. ఇంతకుముందుటా మనకు రీ ఛార్జ్ చేసుకుంటే అమౌంట్ కాకుండా 'ఫ్లెక్స్' అనే యూనిట్లు ఈ ప్లాన్‌తో వస్తాయి.

ఒక ఫ్లెక్స్ యూనిట్

ఒక ఫ్లెక్స్ యూనిట్ .. 1 ఎంబీ డేటా / ఒక ఎస్ఎంఎస్ / ఒక ఇన్కమింగ్ కాల్ (రోమింగ్) కు సమానంగా ఉంటుంది. కొన్ని సర్వీసుల (ఎస్టీడీ, రోమింగ్లో ఉన్నప్పుడు ఔట్గోయింగ్ కాల్స్ వంటివి) ధర ఒక ఫ్లెక్స్ యూనిట్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు.

వ్యయం ఫ్లెక్స్ యూనిట్ల రూపంలో

వొడాఫోన్ ఫ్లెక్స్ ప్లాన్లో మనం ఏ సర్వీసులను ఉపయోగించినా కూడా వాటికయ్యే వ్యయం ఫ్లెక్స్ యూనిట్ల రూపంలో మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది.

రూ .118 లతో రీచార్జ్ చేసుకుంటే 325 ఫ్లెక్స్ యూనిట్లను

ఒక యూజర్ వొడాఫోన్ ఫ్లెక్స్ ప్లాన్ కింద రూ .118 లతో రీచార్జ్ చేసుకుంటే 325 ఫ్లెక్స్ యూనిట్లను పొందొచ్చు. ఇక 204లతో 700 యూనిట్లను, రూ .304 తో 1,200 యూనిట్లు, రూ .395 తో 1,750 యూనిట్లను పొందొచ్చు.

రూ .42 తో రీచార్జ్ చేసుకుంటే 105 యూనిట్లు

అలాగే రూ .42 తో రీచార్జ్ చేసుకుంటే 105 యూనిట్లు, రూ .53 తో చేసుకుంటే 138 యూనిట్లు వస్తాయి. కాగా ప్యాక్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఒక నెలలో మిగిలిన యూనిట్లను తర్వాతి నెలకు బదిలీ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone unveils FLEX plans for pre-paid users across India read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting