గాల్లో తేలినట్లుందే..గుండె పేలినట్టుందే

Written By:

చైనా.. అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశం. చైనాలోని జింటాయి ప్రాంతం. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో అదికూడా ఒకటి. ఎప్పటిలాగే.. జింటాయిలో కార్లు యమా స్పీడ్ గా దూసుకుపోతున్నాయి. అయితే, అనుకోకుండా సిగ్నల్ దగ్గరకు వచ్చే సరికి కార్లు ఒక్కసారిగా పైకి లేచాయి. మాయల పకీరు సినిమాల్లో కనుసైగలు, చేతిలో మాయాదండాన్ని కదపగానే నేలపై ఉన్న వస్తువులను గాల్లోకి ఎగిరినట్లే చైనాలోని ఓ పట్టణంలో రహదారిపై వాహనాలు ఉన్నట్లుండి గాల్లో తేలాయి.

Read more: మైక్రోసాఫ్ట్‌‌కి మిగిలిన చేదు జ్జాపకాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఓ దృశ్యం

వివరాల్లోకి వెళితే అది చైనాలోని బిజీగా ఉండే జింటాయి ప్రాంతంలో. అక్కడి రహదారి ఎప్పుడూ తీరిక లేకుండా రద్దీగా ఉంటుంది. గతవారం ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఓ దృశ్యం సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

మొదట ఒక కారు గాల్లోకి

మొదట ఒక కారు గాల్లోకి లేచింది. అలా గాల్లోకి లేచిన కారు.. ఎగిరి పక్కన ఉన్న కారుపై పడింది.

ఆ వెంటనే ఆ కారు కూడా పైకి

ఆ వెంటనే ఆ కారు కూడా పైకి లేచింది. ఇక.. దానిపక్కనే ఉన్న మూడో కారు సైతం గాల్లోకి లేచి ఎవరు దుదిపెసినట్టు అటుఇటు కుదిపింది.

ఈ దృశ్యాలన్నీ కూడా సిగ్నల్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో

ఈ దృశ్యాలన్నీ కూడా సిగ్నల్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సిగ్నల్స్ వద్ద కార్లు ఎవరో లేపెసినట్టు ఎగిరిపడటానికి దెయ్యాలే కారణమని కొందరు అంటున్నారు.

కార్లు ఇలా ఎగిరి పడటానికి కారణం

అయితే, కార్లు ఇలా ఎగిరి పడటానికి కారణం సన్నని తీగే కారణమని పోలీసులు చెప్తున్నారు. అడ్డంగా సన్నని తీగ ఉండటం వలన ఇలా జరిగిందని పోలీసులు వివరణ ఇస్తున్నారు.

మూడు వాహనాలు చుట్టుపక్కలవారిని

మూడు వాహనాలు చుట్టుపక్కలవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వాటంతటవే పడిపోయాయి. వేగంగా వచ్చిన వాహనం ఒకటి సరిగ్గా సిగ్నల్ను సమీపిస్తుండగానే ఉన్నట్లుండి అకస్మాత్తుగా గాల్లోకి లేచి పక్కనే ఉన్న వాహనం పై పడిపోయింది.

ఇదంతా మాయేనని కొందరు

ఆ వాహనం కూడా గాల్లోకి లేచి కిందపడగా.. దాని పక్కనుంచి వెళుతున్న వాహనం కూడా ఎవరో పైకి ఎత్తే క్రమంలో అటుఇటు కుదిపేసినట్లుగా రోడ్డుపై కదులుతూ ఆగిపోయింది. ఇదంతా మాయేనని కొందరు వాదిస్తున్నారు.

అదృష్టవశాత్తు ఆ వాహానాల్లోని వ్యక్తులు

అదృష్టవశాత్తు ఆ వాహానాల్లోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, అదృశ్య శక్తుల వల్ల ఆ వాహనాలు గాల్లోకి లేవలేదని, ఒక సన్నటి వైరు వాటికి అనుకోకుండా తగులుకోని ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

code :

రెండు కార్లలో ఉండే బలమైన అయస్కాంత వికర్షణ శక్తి వల్ల

అయితే మరి కొందరు మాత్రం రెండు కార్లలో ఉండే బలమైన అయస్కాంత వికర్షణ శక్తి వల్ల ఆ వాహనాలు పరస్పరం వికర్షించుకొని అలా గాల్లోకి ఎగిరి ఉంటాయని అంటున్నారు. అయస్కాంత సజాతి దృవాలు వికర్షిస్తాయ్ అనే సూత్రాన్ని చెబుతూ ఆ వాదనను బలపరుస్తున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Watch cars levitate -- there's a down-to-earth explanation
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot