జియోటీవీ ద్వారా ఉచితంగా ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ సిరీస్‌ను చూడవచ్చు

|

ఇండియాలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇండియా టీమ్ క్రికెట్ ఆడుతోంది అంటే జనాలు టీవీలకు అత్తుకొని మరి చూసే వారు. కానీ స్మార్ట్ గా వేగం పెరుగుతున్న సమాజంలో యువతకు టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూసే సమయం ఉండడం లేదు. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుండి మొబైల్ ఫోన్లలో క్రికెట్ చూస్తున్నారు. ఇప్పుడు అదే క్రికెట్ ను మీ యొక్క స్మార్ట్ ఫోన్లలో ఫ్రీగా చూడడానికి జియో సరికొత్త ప్రణాలికను అందిస్తోంది.

లైవ్ టీవీ
 

ఈ రోజుల్లో క్రికెట్ సీజన్ అనేది దేశంలోని టెలికామ్ ఆపరేటర్లకు మార్కెట్ యొక్క ప్రాధాన్యతలలో ఒకటిగా మారింది. మ్యాచ్‌లు జరిగినప్పుడు మరియు భారత క్రికెట్ జట్టు ఆడుతున్నప్పుడు ప్రజలు తమ టీవీ స్క్రీన్‌లకు అతుక్కుపోయే రోజులు పోయాయి. ఇప్పుడు టెలికామ్ ఆపరేటర్లు తమ యూజర్లకు వారి స్మార్ట్‌ఫోన్‌లలోని లైవ్ టీవీ యాప్ ల ద్వారా క్రికెట్ మ్యాచ్‌లను చూడటానికి ఓవర్-ది-టాప్ యాప్ లను అందిస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమయ్యే ఇండియా-దక్షిణాఫ్రికా సిరీస్ ను అభిమానులు లైవ్ లో మ్యాచ్‌లను చూడడానికి జియోటివి ద్వారా ఉచితంగా యాక్సెస్ పొందగలరని జియో ప్రకటించింది.

JioTV లో లైవ్ మ్యాచ్‌లను ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలి

JioTV లో లైవ్ మ్యాచ్‌లను ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలి

రిలయన్స్ జియో ఇలాంటి చర్యను ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా క్రికెట్ ప్రపంచ కప్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంలో కూడా రిలయన్స్ జియో లక్షలాది మందిని తన వేదికపైకి తీసుకురావడానికి ఇలాంటి ఆఫర్లను ప్రకటించింది . ఈ రెండు క్రికెట్ ఈవెంట్లలో రిలయన్స్ జియో తన చందాదారులకు లైవ్ మ్యాచ్‌ల కోసం యాక్సిస్ ను ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు జరగబోయే ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ సిరీస్‌కు కూడా రిలయన్స్ జియో అదే చేయబోతోంది.

జియోటీవీ
 

క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ సిరీస్‌ను జియో టీవీలో చూడొచ్చు. ఇండియా సౌతాఫ్రికా మధ్య 2019 సెప్టెంబర్ 15 నుంచి సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‌లో 3 టీ20 మ్యాచ్‌లు, 3 టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి. ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగే ప్రతీ మ్యాచ్‌ను జియో టీవీలో లైవ్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది. స్టార్ ఇండియాతో జియో ఐదేళ్లు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జియో ఈ అవకాశాన్ని అందిస్తోంది. జియోటీవీ, హాట్‌స్టార్ యూజర్లు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు అన్నీ స్ట్రీమ్ చేసేందుకు స్టార్ ఇండియాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇతర ఏ ఇండియన్ ఆపరేటర్ కస్టమర్లకు ఇలాంటి ఫ్రీ సర్వీస్ అందించట్లేదు. అయితే కంటెంట్ మాత్రమే ఉచితంగా పొందొచ్చు. డేటాకు మాత్రం ఛార్జీలు ఉంటాయి.

జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ కాంటెస్ట్‌

జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ కాంటెస్ట్‌

ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా చూడాలంటే జియో యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి జియోటీవీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. జియోటీవీ యాప్‌లో జియో క్రికెట్ హెచ్‌డీ ఛానెల్ ఓపెన్ చేయాలి. సిరీస్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లు ఈ ఛానెల్‌లో ఫ్రీగా చూడొచ్చు. జియో యూజర్లకు మ్యాచ్‌లు చూసేందుకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. మ్యాచ్ చూడటం మాత్రమే కాకుండా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కామెంటరీ కూడా వినొచ్చు. అంతేకాదు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌కు జియో సరికొత్త రూపం తీసుకొచ్చింది. యూజర్లు క్రికెట్ మ్యాచ్ చూస్తూనే 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. జియో టీవీలోనే మీకు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌ కనిపిస్తుంది. నాన్-జియో యూజర్లు కూడా మైజియో యాప్‌లో 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Watch India Vs South Africa Cricket Series For Free, Via JioTV

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X