జియోఫైబర్ 4K సెట్-టాప్ బాక్స్: మార్కెట్లో ఎందుకు బిన్నంగా ఉంది?

|

రిలయన్స్ జియోఫైబర్ కనెక్షన్లు 4K మద్దతు గల సెట్-టాప్ బాక్స్‌తో అందించబడుతుంది. ఈ సెట్-టాప్ బాక్స్‌ చాలా గొప్ప ఫీచర్స్ తో వస్తుంది. ఇది డిటిహెచ్ ఆపరేటర్ల నుండి వచ్చిన ఇతర సెట్-టాప్ బాక్స్‌లతో పోల్చితే ఇది చాలా బిన్నంగా ఉంది. జియో సెట్-టాప్ బాక్స్‌కు 4K సపోర్ట్ ఉంది మరియు ఇది కేబుల్ టివి మరియు OTT సేవలను ఒకే చోటికి తెస్తుంది.

జియోఫైబర్ 4K సెట్-టాప్ బాక్స్
 

ముఖ్యంగా జియోఫైబర్ 4K సెట్-టాప్ బాక్స్ అనేది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో సమానంగా ఉంటుంది. ఇది 4K సపోర్ట్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది కేవలం 3,999 రూపాయలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ఈ ధరను మళ్ళి తిరిగి పొందగలిగే ప్రాతిపదికన అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో జియో సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా అందిస్తోంది.

జియోఫైబర్

జియోఫైబర్ యొక్క ప్రారంభ కార్యక్రమంలో JioCinema, JioSaavn మరియు OTT యాప్ ల వంటి చాలా యాప్ లతో జియో సెట్-టాప్ బాక్స్ ముందే ఇన్‌స్టాల్ చేయబడిందని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా జియో 4K సెట్-టాప్ బాక్స్ చాలా ఎక్కువ ఫీచర్లను ప్రేక్షకులకు అందిస్తుంది. జియో 4K సెట్-టాప్ బాక్స్ అందించే లక్షణాల గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి చదవండి.

Jio 4K సెట్-టాప్ బాక్స్ ఫీచర్స్

Jio 4K సెట్-టాప్ బాక్స్ ఫీచర్స్

శాటిలైట్ టివి మరియు OTT యాప్ లను కలిపే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మాదిరిగానే జియో యొక్క 4K సెట్-టాప్ బాక్స్ కేబుల్ టివి మరియు OTT కంటెంట్‌లను కలిపి తీసుకువస్తుంది. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా వెబ్‌లో లైవ్ టివి ఛానెల్‌లను చూడటానికి వినియోగదారులను అనుమతించే టివి ప్లస్ యాప్ ముందే ఇన్‌స్టాల్ చేయబడిందని జియో ఎస్‌టిబి తెలిపింది.

సెట్-టాప్ బాక్స్
 

Jio 4K సెట్-టాప్ బాక్స్ యొక్క ఫీచర్స్ లను మెరుగుపరచడానికి జియో వివిధ ప్రాంతాలలో ఉన్న అన్ని స్థానిక కేబుల్ ఆపరేటర్లను తమతో చేతులు కలపమని ఆహ్వానిస్తోంది. తద్వారా వినియోగదారులు జియో STB ద్వారా కేబుల్ టివి సేవలను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం జియో నుండి 4K సెట్-టాప్ బాక్స్ ద్వారా కేబుల్ టివి సేవలను అందించడానికి హాత్వే, డెన్ నెట్‌వర్క్‌లు మరియు మరికొన్ని ఎల్‌సిఓలు జియోతో జతకలిసాయి.

యాప్ ల సమూహం

యాప్ ల సమూహం

జియో స్మార్ట్ సెట్-టాప్ బాక్స్ కావడంతో రిలయన్స్ జియో యొక్క అన్ని యాప్ లను టీవీ ప్లస్, జియోసావ్న్, జియో సినిమా మరియు ఇతర OTT యాప్ లు ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. JioSaavn మరియు JioCinema ద్వారా తాజా ఆడియో పాటలు మరియు తాజా ట్రెయిలర్లు, సినిమాలు మరిన్నింటిని చూడడానికి యాక్సిస్ లభిస్తుంది. హాట్ స్టార్, ZEE5, సన్ఎన్ఎక్స్ టి వంటి వాటితో జియో తన కంటెంట్ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తుందని కూడా భావిస్తున్నారు. ఈ యాప్ లు జియో సెట్-టాప్ బాక్స్ లోపల ముందే ఇన్‌స్టాల్ చేయబడతాయి కాబట్టి వాటిలో లాగిన్ అయి కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు. ఇప్పుడు జియో బ్రాడ్‌బ్యాండ్ మూడు నెలల ఉచిత JioSaavn మరియు JioCinema సుబ్స్క్రిప్షన్ లతో అందించాలని ప్లాన్ చేస్తుంది.

వాయిస్ కంట్రోల్ రిమోట్

వాయిస్ కంట్రోల్ రిమోట్

రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్ అందిస్తున్న రిమోట్ విషయానికి వస్తే ఇది వాయిస్ కంట్రోల్ సపోర్ట్‌తో వస్తుంది. జియో అందిస్తున్న ఈ రిమోట్ Mi టివి లేదా రాబోయే వన్‌ప్లస్ టివి రిమోట్ లాగా ఇది వాయిస్ అసిస్టెంట్ మద్దతుతో సాంప్రదాయ రిమోట్ లాగా వస్తుంది. అలాగే ఇందులో పెద్ద లైవ్ టీవీ బటన్ కూడా ఉంది. ఇది కంటెంట్‌ను చూడటానికి కేబుల్ టీవీ సర్వీస్ లేదా లైవ్ టీవీ యాప్ ను త్వరగా ఆన్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

పాజ్ మరియు రివైండ్ ఫీచర్లు

చివరగా జియో సెట్-టాప్ బాక్స్ ఒక ప్రత్యేకతతో వస్తుంది. ఇది వినియోగదారులు ప్రస్తుతం వారు చూస్తున్న టీవీ షోలను పాజ్ చేయడానికి మరియు రివైండ్ చేయడానికి మరియు ప్లే చేయడానికి అనుమతిస్తుంది. వెబ్ నుండి కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందున ఈ ఫీచర్ టీవీ ప్లస్ యాప్ లలో మాత్రమే పని చేస్తుంది.

 జియో టీవీ

జియో టీవీ

క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ సిరీస్‌ను జియో టీవీలో చూడొచ్చు. ఇండియా సౌతాఫ్రికా మధ్య 2019 సెప్టెంబర్ 15 నుంచి సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‌లో 3 టీ20 మ్యాచ్‌లు, 3 టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి. ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగే ప్రతీ మ్యాచ్‌ను జియో టీవీలో లైవ్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది. స్టార్ ఇండియాతో జియో ఐదేళ్లు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జియో ఈ అవకాశాన్ని అందిస్తోంది. జియోటీవీ, హాట్‌స్టార్ యూజర్లు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు అన్నీ స్ట్రీమ్ చేసేందుకు స్టార్ ఇండియాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇతర ఏ ఇండియన్ ఆపరేటర్ కస్టమర్లకు ఇలాంటి ఫ్రీ సర్వీస్ అందించట్లేదు. అయితే కంటెంట్ మాత్రమే ఉచితంగా పొందొచ్చు. డేటాకు మాత్రం ఛార్జీలు ఉంటాయి.

జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ కాంటెస్ట్‌

జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ కాంటెస్ట్‌

ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా చూడాలంటే జియో యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి జియోటీవీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. జియోటీవీ యాప్‌లో జియో క్రికెట్ హెచ్‌డీ ఛానెల్ ఓపెన్ చేయాలి. సిరీస్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లు ఈ ఛానెల్‌లో ఫ్రీగా చూడొచ్చు. జియో యూజర్లకు మ్యాచ్‌లు చూసేందుకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. మ్యాచ్ చూడటం మాత్రమే కాకుండా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కామెంటరీ కూడా వినొచ్చు. అంతేకాదు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌కు జియో సరికొత్త రూపం తీసుకొచ్చింది. యూజర్లు క్రికెట్ మ్యాచ్ చూస్తూనే 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. జియో టీవీలోనే మీకు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌ కనిపిస్తుంది. నాన్-జియో యూజర్లు కూడా మైజియో యాప్‌లో 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Jiofiber 4K Set-Top Box: Why This is so good in the market?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X