ప్లూటోపై కనువిందు చేస్తున్న మంచుకొండలు

By Hazarath
|

ప్లూటోపై మంచుకొండల చిత్రాలను మీరెప్పడైనా చూశారా..? ఇంతరవకు చూసుండరు. కాని నాసాకు చెందిన న్యూహారిజన్స్ అంతరిక్ష నౌక అద్భుతమైన చిత్రాలను తన కెమెరాలో బంధించింది. మంచుకొండలు తేలియాడుతూ ప్లూటోపై కనువిందు చేస్తున్నాయి. ఆ ముగ్ధ మనోహారమైన చిత్రాలను మీరు చూసేయండి.

Read more : ఆ గ్రహంపై మంచుకొండలు

ప్లూటోపై ఆహ్లాదకరంగా కనిపిస్తున్న నైట్రోజెన్‌తో

ప్లూటోపై ఆహ్లాదకరంగా కనిపిస్తున్న నైట్రోజెన్‌తో

ప్లూటోపై ఆహ్లాదకరంగా కనిపిస్తున్న నైట్రోజెన్‌తో ఘనీభవించిన మంచు కొండల చిత్రాలను నాసాకు చెందిన న్యూహారిజన్స్ అంతరిక్షనౌక బంధించింది. ఈ మరుగుజ్జు గ్రహంపై తేలియాడుతూ కనిపిస్తున్న అనేక కొండలు మంచునీటితో ఉన్న శకలాలై ఉండవొచ్చనే అభిప్రాయాన్ని నాసా శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రాల ద్వారా ప్లూటో గ్రహంపై భూగర్భ కార్యకలాపాలు

ఈ చిత్రాల ద్వారా ప్లూటో గ్రహంపై భూగర్భ కార్యకలాపాలు

ఈ చిత్రాల ద్వారా ప్లూటో గ్రహంపై భూగర్భ కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్నదనే విషయం స్పష్టమైంది. ఫ్లూటో హృదయస్థానంలో 20 కిలోమీటర్ల మేరకు విస్తరించినట్లు కనిపిస్తున్న ఈ మంచు ప్రదేశాలను అనధికారికంగా స్పుత్నిక్ ప్లానమ్గా పిలుస్తున్నారు.

ప్లూటోపై ఉన్న మంచుకొండలు మనోహరమైన వాతావరణ

ప్లూటోపై ఉన్న మంచుకొండలు మనోహరమైన వాతావరణ

ప్లూటోపై ఉన్న మంచుకొండలు మనోహరమైన వాతావరణ, విస్తారమైన భూగర్భ కార్యకలాపాలకు చక్కటి ఉదాహరణ అని నాసా పేర్కొన్నది. మల్టీస్పెక్ట్రల్ విజిబుల్ ఇమేజింగ్ కెమెరా పరికరంతో న్యూహారిజన్ ఈ చిత్రాలను చిత్రీకరించింది.

ప్లూటోపై దాదాపు 500 కిలోమీటర్ల పొడవు

ప్లూటోపై దాదాపు 500 కిలోమీటర్ల పొడవు

ప్లూటోపై దాదాపు 500 కిలోమీటర్ల పొడవు, 340x కిలోమీటర్ల వెడల్పు మేర ప్రాంతాన్ని చిత్రంలో బంధించింది. గతేడాది జూలై 14 న ఫ్లూటోకు చేరుకోవడానికి 12 నిమిషాల ముందు .. 16 వేల కిలో మీటర్ల దూరం నుంచి ఈ చిత్రాలను న్యూహారిజన్ తీసింది.

మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో

మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో

మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో 11 వేల అడుగుల (3,500 మీటర్లు) ఎత్తయిన మంచు కొండలు ఉన్నాయని న్యూ హారిజాన్స్ వ్యోమనౌక పంపిన ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. సౌరకుటుంబం వయసు 456 కోట్ల ఏళ్లు.

ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని

ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని

కాగా .. ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని, అందువల్ల వీటిని సౌరకుటుంబంలోనే అతి యుక్తవయసు మంచు పర్వతాలుగా భావించవచ్చని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

Best Mobiles in India

English summary
Here Write What are the strange floating hills on Pluto New image reveals mysterious extraterrestrial icebergs several miles wide

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X