3 లక్షల మంది ఇండియన్ ఐటీ ఉద్యోగులు ఇంటికేనా...?

Written By:

హెచ్‌1బీ వీసాల నిబంధనల్లో అమెరికా అధ్యక్షుడు చేసిన మార్పులతో అక్కడ ఇండియన్ ఐటీ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంలో పడింది. దాదాపు మూడు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇంటిదారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరిలో మన తెలుగు వారు దాదాపు 1.06 లక్షల మంది ఉన్నారు. వీరిలో 80 వేల మందికి పైగా స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది.

గూగుల్ క్రోమ్‌కి పోటీగా మైక్రోసాప్ట్ నుంచి కొత్త ఓఎస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రంప్ తీసుకున్న నిర్ణయం

వీసాదారుల కనీస వేతనం 60 వేల నుంచి 1.30 లక్షల డాలర్లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ పెను ప్రకంపనలనే రేపుతోంది. అక్కడ పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో 98 శాతం మంది వేతనాలు 1.10 లక్షల డాలర్ల లోపే ఉండటం ఈ ప్రకంపనలకు కారణం.

87 శాతం మంది

కేవలం 13 శాతం మంది భారతీయ ఉద్యోగులు మాత్రమే అక్కడ 1.3 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ వేతనం పొందుతున్నారు. మిగతా 87 శాతం మంది అంతకంటే తక్కువ వేతనంతో అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి నడిసంద్రంలో నావలా తయారయ్యింది.

ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌

అయితే ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. అయినా అది 1.30 లక్షల డాలర్ల లోపే ఉంది.

మూడున్నర లక్షల మంది

ప్రస్తుతం అమెరికాలో ఈ వీసాపై మూడున్నర లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరే కాకుండా మూడేళ్లుగా అక్కడి విశ్వవిద్యాలయాల్లో మాస్టర్‌ డిగ్రీ కోసం మరో మూడు లక్షల మంది వెళ్లారు. ట్రంప్ నిబంధనలు అమల్లోకి వస్తే వీరంతా ఇంటిదారి పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలుగువారే 1.06 లక్షల మంది

ఇక అక్కడ పనిచేస్తున్న మూడున్నర లక్షల మంది ఉద్యోగుల్లో మన తెలుగువారే 1.06 లక్షల మంది ఉన్నారని అంచనా. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే వీరిలో దాదాపు 80 వేల మందికి పైగానే స్వదేశానికి రావాల్సి ఉంటుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What H1B visa reforms mean for Indian IT companies read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot