రెప్పపాటులో సినిమా డౌన్‌లోడ్

Written By:

దాని వేగానికి రెప్పపాటులో సినిమా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక వాయిస్ కాల్స్ , వీడియో కాల్స్ చేస్తే మీకు ఒక్క సెకను కూడా అంతరాయం కలగదు. గూగుల్ సెర్చింగ్ లో బటన్ నొక్కడం ఆలస్యం అలా మీరనుకున్నది ఓపెన్ అయిపోతుంది. మరి ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటున్నారా...5జీ దూసుకొస్తోంది. మరో సమాచార విప్లవానికి నాంది పలికేందుకు రెడీ అవుతోంది.

5జీ వేగం తెలిస్తే షాకే..

రెప్పపాటులో సినిమా డౌన్‌లోడ్

అయితే ఈ 5జీని నోకియా కంపెనీ ముందుగా తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గతేడాది బోస్టన్లో జరిగిన 'బ్రూక్లిన్ 5 జీ వార్షిక సదస్సు'లో 5 జీ టెక్నాలజీని ఆవిష్కరించింది.లాభాలు ఎలా ఉంటాయో చూడండి.

సోషల్ మీడియాలో సంచలనాలు, అన్నీ ఫేక్ వార్తలే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5 జీ వేగం సెకనుకు 10 గిగాబిట్స్

మొబైల్ సేవలు 4 జీ కన్నా 40 రెట్లు వేగంగా అందుతాయి. 4 జీ వేగం 42 ఎంబీపీఎస్ కాగా, 5 జీ వేగం సెకనుకు 10 గిగాబిట్స్.

ఇప్పటి కన్నా 16 రెట్లు స్పష్టంగా

ఫుల్ లెంగ్త్ హెచ్‌డీ సినిమాను ఒక్క సెకనులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫొటోలు, ఫోన్ కాల్స్ ఇప్పటి కన్నా 16 రెట్లు స్పష్టంగా అందుతాయి

దాదాపుగా జీరో సెకన్లు

మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవల ప్రసారంలో విరామం 4 జీ నెట్వర్క్లో 60 మిల్లీ సెకన్లు. 5 జీ నెట్వర్క్లో ఈ విరామం దాదాపుగా జీరో సెకన్లు

73000 మెగా హెర్ట్జ్ హైఫ్రీక్వెన్సీ

4 జీ నెట్వర్క్ 1800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తే 5 జీ నెట్వర్క్లో సిగ్నళ్లు 73000 మెగా హెర్ట్జ్ హైఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయి

మరో ఐదేళ్లు

5జీ నెట్ వర్క్ వాడుకోవాలంటే మొబైల్స్ ,ల్యాపీలు, కంప్యూటర్లకు సాంకేతిక మార్పులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. 5 జీ సేవలు అందుబాటులోకి రావడానికి మరో ఐదేళ్లు పట్టవచ్చని అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What Is 5G, and What Does It Mean for Consumers Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot