ఇంటర్నెట్‌ను కాపాడండి!, అసలేంటీ నెట్ న్యూట్రాలిటీ..?

|

‘సేవ్ ద ఇంటర్నెట్' పేరుతో నెలిజన్లు సరికొత్త ఆన్‌లైన్ ఉద్యమానికి తెరలేపారు. పక్షపాతరహితంగా ఇంటర్నెట్‌ను అందరికి అందుబాటులో ఉండాలన్న నినాదంతో ‘నెట్ న్యూట్రాలిటీ'ని కోరుకుంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు నెటిజన్ల నుంచి లక్షల్లో ఈమెయిల్స్ అందుతున్నాయి.

 ఇంటర్నెట్‌ను కాపాడండి!, అసలేంటీ నెట్ న్యూట్రాలిటీ..?

తటస్థ వైఖరితో ఇంటర్నెట్‌ను అందరికి సమానంగా అందుబాటులో ఉంచాలనేది ‘నెట్ న్యూట్రాలిటీ' ప్రధాన సిద్ధాంతం. ఈ సూత్రం ప్రకారం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు (ఐఎస్‌పీలు) ఇంటర్నెట్‌లో అన్ని వెబ్‌సైట్‌‍లను అందరూ ఒకే రీతిలో యాక్సెస్ చేసుకోగలిగే వీలు కలిపించాలి. అయితే, ఇటీవల కాలంలో పలు టెలికం ఆపరేటర్లు కొత్త ప్యాకేజీల పేరుతో వినియోదారులు ఇంటర్నెట్ వినియోగ సరళిని నియత్రించే ప్రయత్నం చేయడంతో అసలు వివాదం రాజుకుంది.

 ఇంటర్నెట్‌ను కాపాడండి!, అసలేంటీ నెట్ న్యూట్రాలిటీ..?

ప్రొడక్ట్ డెవలపర్లు కొత్త మొత్తాన్ని చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్ యూజర్లు ఉచితంగా యాక్సెస్ చేసుకునే విధంగా టెలికామ్ కంపెనీలు ప్రత్యేక పథకాలు అందుబాటులోకి తీసుకురావటంతో ఆయా యాప్స్ ఇంకా వెబ్‌సైట్స్‌కే ప్రాచుర్యం లభిస్తుంది. ఈ ప్రక్రియ లాభమే కదా అని మనకు అనిపించవచ్చు. అయితే ఇది పైకి కినిపించే కోణం మాత్రమే... సదరు టెలికామ్ ఆపరేటర్‌‍లు అందిస్తోన్న ప్రత్యేక పథకాలలో ఎంపిక చేయబడిన వైబ్‌సైట్‌‍లు లేదా అప్లికేషన్‌లను మాత్రమే ఉచిత యాక్సెస్ చేసుకోగలిగే అవకాశం ఉంది. ఆ ప్లాన్‌లో లేని సైట్లను వినియోగించుకోవాలంటే వేరొక డేటా ప్యాకేజీని కొనుగోలు చేయాల్సిందే. ఈ ప్రక్రియ వల్ల అటు టెలికం ఆపరేటర్లు, ఇటు వెబ్‌సైట్‌లు వినియోగదారుల నుంచి ఆదాయాన్ని పొందుతాయి.

 ఇంటర్నెట్‌ను కాపాడండి!, అసలేంటీ నెట్ న్యూట్రాలిటీ..?

నెట్ న్యూట్రాలిటీని పాటించకపోవటం వల్ల ఎక్కువ ఆదాయాన్ని గడించే సంస్థలు భారీగా డబ్బు వెచ్చించి టెలికామ్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోగలవు, అలా కుదర్చుకోలేని చిన్నచిన్న వెబ్‌సైట్‌లు పోటీలో వెనుకబడిపాతాయి. ఉచిత సర్వీసులతో సరిపెట్టుకునే వారు ఇతర డేటా ప్యాకేజీలను కొనుగోలు చేయలేకపోవటంతో చిన్న‌చిన్న వెబ్‌సైట్‌లకు నష్టం వాటిల్లక తప్పదు. ఇంటర్నెట్ విషయంలో టెల్కోలు ఈ విధంగా వ్యవహరించడం వల్ల చిన్న చిన్న సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇంటర్నెట్ స్వేచ్చను కోరుకునే వారిలో లక్షమందకి పైగా యూజర్లు నెట్ న్యూట్రాలిటీని కాపాడాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు సేద్ ది ఇంటర్నెట్ డాట్‌ఇన్ వెబ్‌సైట్ ద్వారా మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. నెట్ న్యూట్రాలటీ అంశం పై చెలరేగిన వివాదాన్ని క్రేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని అధ్యయనం చేసేందుకు పలువురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు టెలికం మంత్రి రవిశంకర ప్రసాద్ సోమవారం వెల్లడించారు.

ఇంకా చదవండి: స్మార్ట్‌ఫోన్‍‌ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయా..?

Best Mobiles in India

English summary
what is net neutrality..? why it is important..?. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X